January 1, 2020

నీకోసం నీకోసం నీకోసం


నీకోసం నీకోసం నీకోసం
చిత్రం : నేనున్నాను (2004)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.కె, శ్రేయా ఘోషాల్

పల్లవి: 

వేసంకాలం వెన్నెల్లాగా 
వానల్లొ వాగుల్లాగ 
వయసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి 
ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
శీతాకాలం ఎండల్లాగ 
సంక్రాతి పండుగలాగ 
సొగసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి 
ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
ఓరోరి అందగాడా 
నన్నేలు మన్మధుడా
నీకోసం నీకోసం నీకోసం 
నీకోసం నీకోసం నీకోసం
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసే సందడివేళ 
ఆకూ వక్కా సున్నం
నీకోసం నీకోసం నీకోసం 
నీకోసం నీకోసం నీకోసంచరణం 1:

గుండె చాటుగా ఉండనందిక 
ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా
ఉన్నపాటుగా ఆడపుట్టుకా 
కట్టుబాటు దాటలేదుగా
కన్నె వేడుకా విన్నవించగా 
అందుబాటులోనె ఉన్నానుగా
తీగచాటుగా మూగపాటగా 
ఆగిపోకె రాగమాలికా
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనైరానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా
అమ్మమ్మో అబ్బబ్బో 
ఆ ముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం
నీకోసం నీకోసం నీకోసం 

చరణం 2:

సిగ్గుపోరితో నెగ్గలేవుగా 
ఏడుమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయకా మోయలేవుగా 
లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా 
కోరుకున్న కొంగుబంగారమా
తాళి బొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దరకానా చిగురంటి పెదవులపైనా
మురిపాల మువ్వను కానా దొరగారి నవ్వులలోన
నిద్దర్లొ పొద్దుల్లో 
నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్దతిలోన ముద్దుల్నెన్నో తెచ్చా
నీకోసం నీకోసం నీకోసం