మనిషిని బ్రహ్మయ్య మట్టితో
కధానాయక మొల్ల (1970)
దాశరథి,
బాలు,
ఎస్.పి. కోదండపాణి
మట్టికి మనిషికి బంధమున్నదిరా
మట్టిలొ ఎంతెంతో మహిమ ఉన్నదిరా
మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా
ఆడించుతున్నాడు బొమ్మలాగ
నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగ
దేవుని కోవెలలో దివ్వెగా
పేదల గంజి నీళ్ల ముంతగా
పాలకు దాకగా మధువుకు పాత్రగా
రూపం ఏదైనా మన్నొకటేరా
రాజులు రైతులని భేదమేలా..
జగాన నరులంతా ఒక్కటేరా
ఎందుకు రోషాలు దేనికి ద్వేషాలు
అంత ఒకటైతే మంచిదిరా
దేవుని నమ్ముకుని సాగిపోరా
నీటీ బుడగేరా జీవితమూ
జగతిన కాదేదీ శాశ్వతమూ
దీనుల సేవించి మంచిగ జీవించి
మనిషే దేవుడిగా మారాలిరా
మనకు మిగిలేది మంచొకటేరా