January 1, 2020

కన్నుమూసింది లేదు


కన్నుమూసింది లేదు
సంగీతం::టి.చలపతిరావు
మనుషులు-మమతలు (1965)
రచన::దాశరథి
గానం::సుశీల

పల్లవి::

కన్నుమూసింది లేదు
నిన్ను మరచింది లేదు..నీ తోడూ
కన్నుమూసింది లేదు
నిన్ను మరచింది లేదు..నీతోడూ 
ఓ..ప్రియతమా....
చరణం::1

హేమంతమేగే చేమంతిపూచె..యీ నాడూ
మేఘాలుతొలగె నెలరాజు వెలిగె..యీ రేయీ
హేమంతమేగే చేమంతిపూచె..యీ నాడూ
మేఘాలుతొలగె నెలరాజు వెలిగె..యీ రేయీ
అయినా జాలిలేదేల..యికనైనా రావేలా

కన్ను మూసింది..లేదు
నిన్ను మరచింది లేదు..నీతోడూ ఓ..ప్రియతమా..ఆ

చరణం::2

కన్నీటిలోనె కరిగింది హృదయం..ఇన్నాళ్ళూ
కన్నీటిలోనె కరిగింది హృదయం..ఇన్నాళ్ళూ
ఎడబాటులోనె గడిచింది కాలం..ఇన్నేళ్ళూ
అయినా జాలిలేదేల ఇకనైనా..రావేలా యీ వేళా..ఆ

కన్ను మూసింది..లేదు
నిన్ను మరచింది లేదు..నీతోడూ ఓ..ప్రియతమా..ఆ

చరణం::3

నీ రాక కోసం దేవుళ్లనెంతో ..కొలిచేను
నీ దారికాచి ద్వారానా వేచి..వున్నాను
నీ రాకకోసం దేవుళ్ల నెంతో ..కొలిచేను
నీ దారికాచి ద్వారానా వేచి..వున్నాను
అయినా జాలిలేదేల ఇకనైనా రావేలా..రావేలా
జాలిలేదేల ఇకనైనా రావేలా..ఆ ఆ ఆ ఆ