November 22, 2021

తెలుగు సినిమా పాటల్లో అంత్యానుప్రాసాలంకార ప్రయోగం-2

అంత్యానుప్రాసాలంకారము
 
మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్యానుప్రాసాలంకారము అవుతుంది.\

తెలుగు చిత్రాల్లోని పాటల్లో మరి కొన్ని ఉదాహరణలు 

క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన. 

నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే (పద్మవ్యూహం)
మాట లేకున్నను భాష ఉంటుందిలే
ప్రేమయే లేకపోతే జీవితం లేదులే

వాసనే లేకనే పూలు పూయొచ్చులే
ఆకులే ఆడకా గాలి కదలొచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే?
నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఎదో అందిలే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా
ఓ మనసా 

పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో.. (తేనె మనసులు)
తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. 
విందులే.. చేయనా..

వేణూ గానాలెన్నో ఈ రాధ గుండెల్లో..
మౌన గాథలెన్నో ఈ పేద గుండెల్లో..
పాడనా.. ఊపిరై.. రాధాలోలా..

ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా..

అణువణువున హృదయం అడుగడుగున ప్రణయం (కోటికొక్కడు)
చిరునవ్వుల్లో శ్రీరాగం.. అరచూపుల్లో అనురాగం.

ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం...(కొండవీటి సింహం)
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం
ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం...
సంగమించు ప్రణయంలో ఉదయరాగ సింధూరం
ప్రేమే పెన్నిధిగా .. దైవం సన్నిధిగా
ప్రేమే పెన్నిధిగా .. దైవం సన్నిధిగా
సమశృతిలో జత కలిసి
ప్రియలయలో అదమరచి .. అనురాగాలు పలికించువేళా...
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగా
నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి (హిట్లర్)
పడుచు సొగసుల పాలాస్త్రీ... అంటనీరా నా మేస్త్రి
నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ... అంటనీరా నా మేస్త్రి

నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే ఖంగోత్రి
ఏకులమూ నీదంటే గోకులమూ నవ్విందీ (సప్తపది)
మాధవుడు యాదవుడు.. మా కులమే లెమ్మంది
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
ఆదినుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడిమంత్రపు మనుషులకే ఈ మాటలు... ఇన్ని మాటలు
శ్రీరస్తు ప్రియమస్తంటూ చిలకే దొరికే (స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్)
ప్రేమిస్తే ఏమిస్తుందో అడిగే వరకే
సాధిస్తా వేదిస్తుంటే సరదా పడితే
మాటిస్తా మాలే వేస్తా మనసే పుడితే
సండే లవర్ ఒన్ డే ఫ్లవర్
నేనే డాన్సర్ నువ్వే ఆన్సర్
జల్సాలా జాజ్ మ్యూజిక్కు
కాదమ్మో మాజిక్కు
జల్సా లా జాజ్ మ్యూజిక్కు
కాదమ్మో మాజిక్కు

త్యాగయ్య మనవణ్ణైతే రామా అంటా
క్షేత్రయ్య పదమే వింటే భామా అంటా
నీ పేరు పెట్టాలంటే ప్రేమ అంటా
నీ తోడు దక్కిందంటే ధీమా గుంటా
నాతో షికార్  
ఊళ్ళో పుకార్  
మాయాబజార్  
నాతో హుషార్
గిన్నీసు బుక్కు కెక్కిస్తా  
జిమ్మిక్సే చేయిస్తా
గిన్నీసు బుక్కు కెక్కిస్తా 
జిమ్మిక్సే చేయిస్తా

ఫెంటాస్టిక్ డిస్కోలే చేస్తా 
కర్ణాటిక్ రాగాలే తీస్తా
తొడుగుల్లో అందాలే చూస్తా
పరువంతో బంధాలే వేస్తా
ఒడిస్సీ నటన ఆడేస్తా
ఓడించే లయ వేస్తా
కాలేజీ లెక్చర్ దంచేస్తా
టీనేజీ కథ రాస్తా
ముక్కు మీద కోపం (స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్)
ముట్టుకోని రూపం
ఇక్కడే ఇప్పుడే అంటుకోనా
పక్కదిండు పాపం 
చుక్కలమ్మ సాక్ష్యం
వద్దని వాయిదా వేసుకోనా
అమ్మాయి తీగరో సన్నాయి నొక్కుతో
సంగీత నవ్వులే రావాలి
అబ్బాయి రాకతో లల్లాయి పాటలో
గారాల ఎంకినైపోవాలి
శ్రీకాముడీ గుడి 
సిందూర పాపిడి
వచ్చిందిలే రతి 
ప్రాయాల హారతి
గుప్పిళ్ళు విప్పుకోని పాప 
చప్పుళ్ళు చాలుగాని టాటా

కథేమిటే చెలి 
ఇదేమి కౌగిలి
గులాబి మొగ్గలో గులేబకావళి
వయస్సు ఒడ్డు దాటుతుంటే 
మనస్సు అడ్డు చెప్పదాయె
ఫలాన చోట అంటుకోనా 
ఫలాల పంట అందుకోనా

భలేగ ఉందిరా 
ఇదేమి ముద్దురా
పడింది ముద్దర 
చెడింది నిద్దర
హా.. ఆ హా.. జాజి పూలే చూసే జాలిగా.. (జాకీ)
హే.. ఏహే.. జంట కమ్మన్నాయి జాలీ గా.. 
తెలుసు నా జాకీ నువ్వనీ..
అహా మనసే రాజాల రవ్వనీ.. 
ఓ రాకుమారుడా.. 
నీ రాక కోసమే వేచి వేచి వేగుతున్నాను రా..
చినుకు ముల్లు గుచ్చుకున్నదీ...(రంగూన్ రౌడి)
చిన్నదాని వలపు ఒళ్ళు విరుచుకున్నది
వానజల్లు వెచ్చగున్నదీ...
చిన్నవాడి వయసు తేనె వెల్లువైనది

కురిసి వెలసిన వాన వరదంటా...
మనసు కలసిన జంట వలపంటా
నీకు మెరుపెంతో.. నాకు ఉరుమంతా
వయసు వయసంతా.. వలపు గిలిసంతా

వరస కలసి జంటలాయెనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే
వరస కలసి జంటలాయెనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే

వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
అర్రెరెర్రె వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
అదరహో..ఓ..అదరహా..అదరహో..ఓ..అదరహా (రంగూన్ రౌడి)
నీ అందం చూస్తే అదరహా..నా మురపెం చూస్తే ముదరహా
నా వయసు నీ సొగసు..నా వయసు నీ సొగసు కలుసుకుంటే.
యమహా..యమహా.. యమహా.. యమహా

అదరహో..ఓ..అదరహా..
అదరహో..ఓ..అదరహా
నీ వాటం చూస్తే అదరహా.. నా వైనం చూస్తే ముదరహా
నా మనసూ...  నీ వయసూ..
నా మనసూ నీ వయసూ కలుపుకొంటే..
యమహా.. యమహా.. యమహా.. యమహా
నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా (కొండవీటి దొంగ)
కాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సు బుస్సు ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా
కథ ముదరగ..
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
హే.. చనకు చనకు చాం పట్టుకో పట్టుకో ఝంపె దరువులే వెయ్య
ఈ ప్రణయాలూ అభిమానాలూ..దాచాలంటే దాగనివేలే (సూర్యచంద్ర)
సూర్యుడు నీవై చూసే వేళ..ఎదలో పద్మం విరిసెనులే
చంద్రుడు నీవై పిలిచే వేళ..నాలో తారక మెరిసెనులే

జీవన వేణువు పాడెను..ఏమనీ ఏమేమనీ
నవ జీవన గీతికి పల్లవి నీవనీ నీ ప్రేమనీ
సాగనీ ప్రియరంజనీ..
పూజనీ నీ పూజనీ
పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే (దళపతి, రాజశ్రీ)
ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే
మాసాలు వారాలవును నీవు, నేను కూడితే
వారాలు మాసాలవును బాటే మారి సాగితే
పొంగునీ బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేను నీ ఎదుట ఉంటే
నీవే కదా నా ప్రాణం 
నీవే కదా నా లోకం

సుందరి నేనే నువ్వంట 
చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంట 
జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంటా 
నీడగా పాడమంట
నా సిరి నీవేనట
నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా (ప్రేమ పావురాలు, రాజశ్రీ)
నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
ఆ మనసేమో నా మాటే వినదంటా
ఆ మనసేమో నా మాటే వినదంటా
కదిలించేను కరిగించేను నన్నంటా

నా మనసేమో నా మాటే వినదంటా
నా మనసేమో నా మాటే వినదంటా
నేలవిడిచి సాములెన్నో చెయ్యరా.... (సొమ్మొకడిది సోకొకడిది)
మబ్బుల్లో మెరుపంతా నీదిరా..
నిలబడి తాగే నీళ్ళు చేదురా... 
పరుగెత్తయినా పాలు తాగరా
బ్రతుకంటే బస్తీమే సవాలురా... 
ప్రపంచమే మాయాబజారురా...
ప్రపంచమే మాయాబజారురా...

గురిచూసి కొట్టాలిరా... 
సిరి చూసి పట్టాలిరా...
నీ ఎత్తు ఎదగాలంటే.. 
ఎత్తులు.. జిత్తులు.. వెయ్యరా...

ఎత్తులు... జిత్తులు... వెయ్యరా...
ఆకాశం నీ హద్దురా... 
అవకాశం వదలొద్దురా...

నుదుటి రాత నువ్వు మార్చి రాయరా... 
నూరేళ్ళ అనుభవాలు నీవిరా... 
అనుకున్నది పొందడమే నీతిరా... 
మనకున్నది పెంచటమే ఖ్యాతిరా...
మనిషి జన్మ మరువలేని ఛాన్సురా... 
ఈ రేసులో జాక్‌పాట్ కొట్టాలిరా...
ఈ రేసులో జాక్‌పాట్ కొట్టాలిరా...

హా.. సుడిలోకి దూకాలిరా... 
కడదాకా ఈదాలిరా...
నీ ఒడ్డు చేరాలంటే... 
తడాకా... మజాకా... చూపరా...
తడాకా... మజాకా... చూపరా...
పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు.. కరగాలి కౌగిళ్ళలో (సొమ్మొకడిది సోకొకడిది)
వలపించే ఒళ్ళు.. వలచే పరవళ్ళు.. కదిలే పొదరిళ్ళలో

తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు.. కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు.. బిగిసే సంకెళ్ళలో
నీలో అందాలు.. నేనే పొందాలి..నాకే చెందాలిలే..

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను.. చలితో నీవు.. చేసే అల్లరులూ...

కురిసే ఈ వాన.. తడిసే నాలోనా.. రేపిందిలే తపనా
పలికే పరువాన.. వలపే విరివాన .. నీవే ఆలాపనా

వణికే నీ మేన .. సణిగే నా వీణ .. పలికిందిలే మోహనా
విరిసే నా నవ్వు.. విరజాజీ పువ్వు .. సిగలో నేనుంచనా
నీలో రాగాలు.. నాలో రేగాలి.. నేనే ఊగాలిలే

తొలివలపూ తొందరలు.. ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు.. చలితో నేను..చేసే అల్లరులూ...
తొలివలపూ తొందరలు..ఉసిగొలిపే తెమ్మెరలు
విజయుడై వచ్చినాడురా (జగదేకవీరుడు అతిలోకసుందరి) 
తన ప్రజలంతా మెచ్చినారురా
దుర్గమునే ఏలినాడురా 
ఆ స్వర్గమునే దించినాడురా
అక్షితలే చల్లినారు రమణులంతా...అహ హారతులే భక్తి మీర పట్టినారురా
సింహాసమెక్కి తాను విష్ణుమూర్తిలా...అహ సిరులెన్నో చెలువు మీద చిలికినాడురా

కళలే పోషించినాడురా 
తను కావ్యాలే రాసినాడురా
శిలలే తెప్పించినాడురా 
ఘన శిల్పాలే మలచినాడురా
చెరువులెన్నో తవ్వించి కరువుమాపి... అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా
కులమతాల రక్కసిని రూపుమాపి...అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా
ప్రియతమా నను పలకరించు ప్రణయమా..(జగదేకవీరుడు అతిలోకసుందరి)
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..

ప్రియతమా నను పలకరించు ప్రణయమా..
అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..
సౌందర్య లహరి స్వప్నసుందరి (పెళ్ళిసందడి)
నువ్వే నా ఊపిరి
శృంగార నగరి స్వర్ణ మంజరి 
రావే రసమాధురి
వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇలచేరి కనిపించు ఓసారి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
నువ్వంటే నాకు ధైర్యం (పెళ్ళిసందD, చంద్రబోస్)
నేనంటే నీకు సర్వం 
నీకూ నాకూ ప్రేమ 
ప్రేమంటే ఏంటి?

చల్లగా అల్లుకుంటది 
మెల్లగా గిల్లుతుంటది 
వెళ్లనే వెళ్లనంటది 
విడిపోనంటది 

నువ్వంటే నాకు 
ప్రాణం 
నేనంటే నీకు 
లోకం 
ప్రేమంటే ఏంటి?
చిమ్మటి చీకటి కమ్మటి సంగటి (రామ జోగయ్య శాస్త్రి, అరవిందసమేత)
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ
ఒకనాటి మాట కాదు..(కన్నవారి కలలు, రాజశ్రీ) 
ఒకనాడు తీరిపోదు...
ఒకనాటి మాట కాదు.. 
ఒకనాడు తీరిపోదు...
తొలినాటి ప్రేమదీపం.. 
కలనైన ఆరిపోదు...
తొలినాటి ప్రేమదీపం..
కలనైన ఆరిపోదు...
ఒకనాటి మాట కాదు... 
ఒక నాడు తీరి పోదు..
గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ (కన్నవారి కలలు, రాజశ్రీ)
తలపులకు.. వలపులకు.. సరిహద్దు లేదనీ 
కుసుమముతో ఆ భ్రమరం తెలిపినది ఏమనీ 
జగమునకు మన చెలిమి ఆదర్శమౌననీ 
కలలు తీరగా... కలిసి పొమ్మనీ 
కౌగిలింతలో... కరిగి పొమ్మనీ 
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ 

మధువొలకబోసే... ఈ చిలిపి కళ్ళు..
అవి నాకు వేసే.. బంగారు సంకెళ్ళూ...
నీవు ఊపిరై ఇన్నాళ్ళూ నాలో గుసగుస మన్నావని (జేగంటలు)
నీవు ప్రాణమై ఇన్నాళ్ళూ ఎదలో ఎదలే విన్నావని 
నీవు ఊపిరై ఇన్నాళ్ళూ నాలో గుసగుస మన్నావని 
నీవు ప్రాణమై ఇన్నాళ్ళూ ఎదలో ఎదవై విన్నావని
జాబిలి జాబులు అందుకునీ 
వెన్నెల లేఖలు వ్రాసుకునీ 
ఈనాడే నువ్వొస్తావని 
నీ నీడే నాకిస్తావని 
తెలుసులే
తెలుసులే తెలుసులే  
నీకు తెలుసోలేదో గానీ నాకు తెలుసులే 
తెలుసులే తెలుసులే

ఆరు ఋతువులు ఆమనులై పూలపల్లకీ తెస్తాయని 
ఏడు రంగుల హరివిల్లే మన ఇల్లై దిగి వస్తుందని 
ఆరు ఋతువులు ఆమనులై పూలపల్లకీ తెస్తాయని 
ఏడు రంగుల హరివిల్లే మన ఇల్లై దిగి వస్తుందని 
రేపటి రెక్కలు కట్టుకునీ 
వేకువ దివ్వెలు పెట్టుకునీ 
నాకోసం నువ్వొస్తావనీ 
నాలోనే నువ్వుంటావని 
తెలుసులే
తెలుసులే తెలుసులే  
నీకు తెలుసోలేదో గానీ నాకు తెలుసులే 
తెలుసులే తెలుసులే
నా కళ్ళలో నిండిపోవాలి...(ధర్మదాత, సినారె)
నువ్వు నా గుండెలో ఉండి పోవాలి 
నా కళ్ళలో నిండిపోవాలి...
నువ్వు నా గుండెలో ఉండి పోవాలి 
చెలి కౌగిలి చెరసాల కావాలి... 
చెలి కౌగిలి చెరసాల కావాలి...
కలకాలం బంధీనై పోవాలి 

పరమేశ్వరి...ఊహు... 
ప్రాణేశ్వరి...ప్రణయేశ్వరి..హృదయేశ్వరి..మదనేశ్వరి.. 
ఇకనైన శాంతించవే.... 
రాజేశ్వరి..భాగేశ్వరి...రాగీశ్వరి..నాగేశ్వరి... 
నీ దాసుని ...కరుణించవే....
పట్టపగలు ప్రేమ తెగులు పుట్టకూడదు...(విశ్వరూపం)
పుట్టినా... రేయి పగలు చంపకూడదు...
పట్టపగలు ప్రేమ తెగులు పుట్టకూడదు...
పుట్టినా... రేయి పగలు చంపకూడదు...

ప్రేమ పుట్టినా... పుట్టి పెరిగినా...
ప్రేమ పుట్టినా... పుట్టి పెరిగినా...
చెట్టుపుట్ట పాలు కానే కాకూడదు...
గుండె చాటులోన గాని పండకూడదు...
గుండె చాటులోన గాని పండకూడదు.... లేదా....
అండ ఉండదు.... అండ ఉండదు....

కనులు చాలవు... కలము చాలదు...
పలుకు చాలదు... పదము చాలదు...
నిన్ను పొగడ కాళిదాసు కవిత చాలదు...
నిన్ను చూసి కుర్రమనసు ఆగి చావదు...
సొగసు చూడ తరమా (సైనికుడు)
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా 
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ  ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ 
సిందూలేసే సూడవమ్మ 
వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ 
నాలో నేను లేనోయమ్మ 
ప్రేమ వింత వరమా
వయస్సునామి (కంత్రి)
తాకెనమ్మి 
ఆగలేను సుమి 
సొగస్సుతోవ్వి 
ధూముదామి 
పాడు తకతైధిమి
బొమ్మల చెమ్మల ఉప్పెనలోయి 
ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి
ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి 
చెక్కిలి చిక్కిన చెక్కరలోయి
పిల్లో... పడిపోయా మాయల లోయలో
తల్లో... దిగిపోయా ఊయల లోతులో

కొరుక్కుతిందా నేత్రమా చురుక్కు చూపే చైత్రమా 
అత్తుక్కుపోయే ఆత్రమా జతక్కులాస గోత్రమా
హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవె భామా
ఒద్దుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా
నిను మెచ్చానె లలనా ఓ ఇందువదనా నీకింతపదునా
ఏకాంతంగా ఉన్నా (అశోక్, చంద్రబోస్)
ఎందరి మధ్యన ఉన్నా
నీకై నేనూ ఆలోచిస్తున్నా
ఏ పని చేస్తూ ఉన్నా 
ఎటు పయనిస్తూ ఉన్నా
నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్ళై నీ కోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా
నీ పెదవుల పిలుపుల కోసం పడి చస్తున్నా
నా తనువంత మనసై ఉన్నా
మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా (అమృత)
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
బాణాలేదో భూమికి వెలుగుగా
మందారాలే మత్తునూ వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసిపాపాయి
చిలికే చిరునగవే చీకటితల్లికి వేకువా
ప్రియతమా తమా సంగీతం (ఆలాపన)
విరిసె సుమములై వసంతం
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తొలిపొద్దు ముద్దాడగానే... ఎరుపెక్కె తూరుపు దిక్కూ.. (కటకటాల రుద్రయ్య)
తొలిచూపు రాపాడగానే... వలపొక్కటే వయసు దిక్కూ.. 
వరదల్లే వాటేసి...  మనసల్లే మాటేసి...  వయసల్లే కాటేస్తే చిక్కు 
తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు 

వీణ నాది..
తీగ నీది..
తీగ చాటు రాగముంది.. 
పువ్వు నాది..
పూత నీది..
ఆకుచాటు అందముంది..  
కరిగిన కుంకుమ పెదవి ఎరుపునే కౌగిలి కోరుతు ఉంటే...(కటకటాల రుద్రయ్య)
నా పెదవులెర్రబడుతుంటే...
పడుచు సొగసులే ఇంద్రధనస్సులో... ఏడు రంగులౌతుంటే..
నా పైట పొంగులౌతుంటే...
నీ హొయలు లయలు వేస్తుంటే...

ఈదురుగాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ
హ.. ఈ చలిగాలికి.. మా దొరసానికి.. ఎదలో వీణ మ్రోగింది..
పై మెరుగులు పైడి నగలు లేవు ఇక్కడ (సుమంగళి, ఆత్రేయ)
పంతాలు సాధింపులు రావు ఇక్కడ 
పై మెరుగులు పైడి నగలు లేవు ఇక్కడ
పంతాలు సాధింపులు రావు ఇక్కడ 
నిండు మనసు చిరునగవు పండునిక్కడ 
నిండు మనసు చిరునగవు పండునిక్కడ
ఆ పండు వెన్నెలందు దినం పండుగిక్కడ

కొత్త పెళ్ళికూతురా రారా
నీ కుడికాలు ముందు మోపి రారా
గుణవతి కులసతి రారా
నువు కోరుకున్న కోవెలకు రారా
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే (నాలుగు స్తంభాలాట)
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే

మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా
ప్రేమ మనమే సుమా
వెండిగిన్నెలో వేడి బువ్వ తేవే(మనోరమ, సముద్రాల జూనియర్)
పైడిగిన్నెలో పాల బువ్వ తేవే

వెండిగిన్నెలో వేడి బువ్వ తేవే
పైడిగిన్నెలో పాల బువ్వ తేవే
అందాలా పాపకు అందించి పోవే

చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందామామా రావే జాబిల్లి రావే
నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు (తూర్పు వెళ్ళే రైలు, ఆరుద్ర)
ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు 
వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుళ్ళు 
వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లూ

తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా 
నల్లచీర కట్టుకున్నా... నవ్వాలే చిన్నమ్మా 
ఎర్రచీర కట్టుకుంటే... సందెపొద్దు నువ్వమ్మా 
ఎర్రచీర కట్టుకుంటే... సందెపొద్దు నువ్వమ్మా 
పచ్చచీర కట్టుకుంటే... పంట చేను సిరివమ్మ 

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ 
బొట్టు కాటుక పెట్టి.. నే కట్టే పాటను చుట్టి 
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ.. 
చలిగాలి రమ్మంచు పిలిచిందిలే.. (రాముడు-భీముడు, సినారె)
చెలి చూపు నీ పైన నిలిచిందిలే
చలిగాలి రమ్మంచు పిలిచిందిలే.. 
చెలి చూపు నీ పైన నిలిచిందిలే

ఏముందిలే .. ఇపుడేముందిలే
ఏముందిలే .. ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము ముందుందిలే.. 
నీ ముందుందిలే  
తెలిసిందిలే తెలిసిందిలే.. 
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
వలపించె వలపు తోటా.. (అభిమానం, శ్రీశ్రీ)
నీ ప్రేమ పసిడితోటా 
ఓ ఓ ఓ ఓ... ఓహోహో ఓ ఓ ఓ... 
వలపించె వలపు తోటా.. 
నీ ప్రేమ పసిడితోటా 
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట 
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట 

వలపు తేనెపాట.. 
తొలివయసు పూలతోట 
పరువాల చిన్నెల సయ్యాట 
ఒక చూపు తూపులా గాయాన్ని చేసిందీ (అబ్బాయిగారు అమ్మాయిగారు, ఆత్రేయ)
వేరొక చూపు  వెన్నెల మావులా మెరిసిందీ
ఒక చూపు తూపులా గాయాన్ని..చేసిందీ
వేరొక చూపు వెన్నెల మావులా మెరిసిందీ

ఒక చూపు చిలిపిగా గిలిగింత పెట్టిందీ
ఒక చూపు చిలిపిగా గిలిగింత పెట్టిందీ
వేరొక చూపు..  వేరొక చూపు నిలువునా గెలుచుకొని వెళ్ళిందీ 

తొలి చూపు దూసిందీ..హృదయాన్ని
మరుచూపు వేసిందీ..బంధాన్ని
ప్రతి చూపు చెరిపింది..దూరాన్ని
పెళ్ళిచూపులే..కలపాలి ఇద్దరిని    
కట్టుకున్న మంచుచీర కరిగి జారిపోతుంది (తూర్పు వెళ్ళే రైలు, ఆరుద్ర)
ముసురుకొన్న చీకటిలో వెలుగు తోసుకొస్తుంది 
దూరంగా నా నేస్తం తూరుపుబండి కూసింది 
ఊరంతా మొద్దు నిద్రలో ముసుగుతన్ని పడుకుంది 

వేగుచుక్క పొడిచింది 
వేకువ కాబోతూంది 
గాలి లోన తేలే నాదం మేలుకొలుపు పాడింది
శుచి రుచి ఉన్న చోట ఉండవంట (శ్రీ మంజునాథ, భువనచంద్ర)
నీకు పచ్చి మద్యమాంసాలంటే ఇష్టమంటా

గణ గణ గంట కొడితే వస్తావంటా
ఇటు రా నిన్ను విరిచి నంజుకుంటా

ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్ళే లేరంటా
ఎట్ట పుట్టావో చెప్పమంటా
వెన్నెల తెల్లబోయి తగ్గనీ..తనకు సిగ్గనీ (రాజా రమేష్, ఆత్రేయ)
కన్నులు సిగ్గుమానీ..మొగ్గనీ...కలలు నెగ్గనీ

తరచిన మల్లెలు ఫక్కుమనీ ..నవ్వనీ..
పగటికి చోటివ్వక ఉండనీ..రాత్రినీ..

దీపాలు మలగనీ...ఆ...తాపాలు పెరగనీ....
రేపన్న దానినీ ఈ పూటే చూడనీ...

నేలమీది జాబిలి...నింగిలోని సిరిమల్లి...
నా చెలీ... నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి...
నేలమీది జాబిలి...  
నిన్నేనా.. అది నేనేనా కల గన్నానా.. కనుగొన్నానా (గుప్పెడు మనసు, ఆత్రేయ)
నిన్నేనా.. అది నేనేనా కల గన్నానా.. కనుగొన్నానా 

అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా 
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా 

నువ్వేనా.. సంపంగి పువ్వున నువ్వేనా 
జాబిలి నవ్వున నువ్వేనా 
గోదారి పొంగున నువ్వేనా  
కదలే పిల్లగాలి..  శ్రీగంధం చిలికిపోతుంది (జరిగిన కథ, సినారె)
కదలే పిల్లగాలి..శ్రీగంధం చిలికిపోతుంది
విరిసే నిండు జాబిలి.. నునువెన్నెలపానుపు వేస్తుంది
విరిసే నిండు జాబిలి.. నునువెన్నెలపానుపు వేస్తుంది
మదిలో కోయిల పాడుతుంది..
మమతల ఊయల ఊగుతుందీ... ఊగుతుంది..

తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే
ప్రతి ఋతువు..ఆఆ..మధుమాసం..ఆ..
ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం
మనకోసం.. 
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు (జరిగిన కథ, సినారె)
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు 
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు 
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు 
నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచినరోజు 
భలే మంచిరోజు.. పసందైన రోజు.. 
వసంతాలు పూచే నేటిరోజు..
వసంతాలు పూచే నేటిరోజు 
భలే మంచిరోజు.. పసందైన రోజు.. 
వసంతాలు పూచే నేటిరోజు.. వసంతాలు పూచే నేటిరోజు
వేల తారకల నయనాలతో.. నీలాకాశం తిలకించేను (అల్లూరి సీతారామరాజు, సినారె)
వేల తారకల నయనాలతో.. నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను
ఆతని పావన పాదధూళికై..అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే..పాలసంద్రమై పరవశించేను...  
పాలసంద్రమై పరవశించేను 
చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు (రామయ్య తండ్రి, మల్లెమాల)
చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
మింటనున్న తారకలు ఇంటింట వెలిగే రోజు
మింటనున్న తారకలు ఇంటింట వెలిగే దీపావళి రోజు
దీపావళి రోజు
వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు
పెద్దలంత పిల్లలుగా మారే రోజు
పల్లేదో పట్టణమేదో తెలియని రోజు
దీపావళి రోజు... దీపావళి రోజు...
ఆరనయిదో తనము ఏ చోట నుండు (ముత్యాల ముగ్గు, ఆరుద్ర)
అరుగులలికే వారి అరచేతనుండు
ఆరనయిదో తనము ఏ చోట నుండు
అరుగులలికే వారి అరచేతనుండు
తీరైన సంపదా ఎవరింట నుండు..
తీరైన సంపదా ఎవరింట నుండు...
దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు
 
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ
కదలిక వుంది మబ్బులో కదలిక వుంది (ఖైదీ కాళిదాసు, మైలవరపు గోపి)
నీటికీ వేగం వుంది గాలికీ చలనం వుంది 
వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుంది

వయసొచ్చింది.. దానితో వలపొచ్చింది..  
వయసొచ్చింది.. దానితో వలపొచ్చింది 
అందుకే చిన్నది తొందర పడుతోంది.. 
అందుకే చిన్నది తొందర పడుతోంది

ఎవరీ చక్కనివాడు.. 
ఎంతకూ చిక్కనివాడు.. 
ఎప్పటికి దారికొస్తాడో.. 

ఎవరీ చక్కని చుక్క.. 
సోకు దీని కాలికి మొక్క.. 
కాదన్నా వెంట పడుతోందీ.. 
మొదటి సారి కలుసుకున్నదర్ధరాతిరి (ప్రేమ మందిరం, దాసరి)
చూసుకున్న చూపులన్ని అదో మాదిరి
మొదటి సారి కలుసుకున్నదర్ధరాతిరి
చూసుకున్న చూపులన్ని అదో మాదిరి

ఆపై ప్రతి రాతిరి కలల రాతిరి
అవి చెదరగానే కలత రాతిరి
ఆపై ప్రతి రాతిరి కలల రాతిరి
అవి చెదరగానే కలత రాతిరి
కలల రాతిరీ.. కథల రాతిరి.. 
ప్రేమ కథల రాతిరి
కలత రాతిరీ.. బరువు రాతిరి.. 
గుండె బరువు రాతిరి
మనసొకచోట (దేవదాసు, ఆరుద్ర)
మనువొకచోట 
మమతలు పూచిన పూదోట 
మమతలు పూచిన పూదోట
కోరిన చిన్నది కుంకుమ రేఖల కుశలాన ఉండాలి ఆ చోట
చెలి కుశలాన ఉండాలి ఆ చోట

కల చెదిరింది... 
కథ మారింది
కన్నీరే ఇక మిగిలింది..
కన్నీరే ఇక మిగిలింది
పుట్టింది అమ్మ కడుపులోనైనా (ధర్మదాత, సినారె)
పాలు పట్టింది నీ చేతిలోనా 
పుట్టింది అమ్మ కడుపులోనైనా 
పాలు పట్టింది నీ చేతిలోనా 

ఊగింది ఉయ్యాలలోనైనా 
ఊగింది ఉయ్యాలలోనైనా 

నేను దాగింది నీ చల్లని ఒడిలోన..
చల్లని ఒడిలోన 

ఓ నాన్న! నీ మనసే వెన్న 
అమృతం కన్నా అది ఎంతో మిన్న 
ఓ నాన్నా  
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది (నా ఆటోగ్రాఫ్, చంద్రబోస్)
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా.. (అమెరికా అమ్మాయి, మైలవరపు గోపి)
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా.. 
నా గుండెలో వెలిగించెనూ.. సింగార దీపికా.. 
ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా.. 
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా.. 
నీ వలపే నిచ్చెనగా నేనందితి గగనాలు (అల్లుడే మేనల్లుడు, సినారె)
నిను లతలా పెనవేసి కనుగొంటిని స్వర్గాలు
నీ వలపే నిచ్చెనగా నేనందితి గగనాలు
నిను లతలా పెనవేసి కనుగొంటిని స్వర్గాలు
కలకాలం ఈ బంధం నిలపాలి దేవతలు
కలకాలం ఈ బంధం నిలపాలి దేవతలు
ఆ....నీవనీ నేననీ నీవనీ నేననీ లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
ఓ .... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు