January 3, 2020

మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా


మువ్వలా నవ్వకలా
పౌర్ణమి (2006)
సిరివెన్నెల
దేవిశ్రీ ప్రసాద్
బాలు, చిత్ర

మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
ముగ్గులో దించకిలా... ముగ్ధ సింగారమా
నేలకే నాట్యం నేర్పావే... నయగారమా
గాలికే సంకెళ్ళేశావే... ఏ...ఏ...

నన్నిలా మార్చగల కళ నీ సొంతమా...
ఇది నీ మాయ"వల" కాదని అనకుమా...
ఆశకే ఆయువు పోశావే... మధుమంత్రమా...
రేయికే రంగులు పూశావే...ఏ..ఏ..చరణం 1:

కలిసిన పరిచయం ఒకరోజే కదా...
కలిగిన పరవశం... యుగముల నాటిదా?
కళ్లతో చూసే నిజం నిజం కాదేమో..!
గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో...
ఓ...ఓ...
ఓ...ఓ...
నన్నిలా మార్చగల కళ నీ సొంతమా...
ఇది నీ మాయవల కాదని అనకుమా...
నేలకే నాట్యం నేర్పావే... నయగారమా
గాలికే సంకెళ్లేశావే...ఏ...ఏ...

చరణం 2:

పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ..
మరియొక జన్మగా మొదలౌతున్నదా...
పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా...
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా...
ఓ...ఓ...
ఓ...ఓ...
మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
ముగ్గులో దించకిలా... ముగ్ధ సింగారమా
ఆశకే ఆయువు పోశావే... మధుమంత్రమా
రేయికే రంగులు పూశావే..ఏ...ఏ..