మాయా మశ్చీంద్రా
చిత్రం: భారతీయుడు (1996)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: వాలి
నేపధ్య గానం:బాలు, స్వర్ణలత
పల్లవి:
మాయా మశ్చీంద్రా మచ్చని చూడ వచ్చావా
మాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరా
మన్మధ కళలన్నీ మచ్చల్లోనే పుడతాయే మేస్త్రి... కామశాస్త్రి
మైకం వలవేసి ముద్దుల్లో ముంచేసే రాతిరి రెచ్చే పోకిరి
సుకుమారి సుకుమారి ఇంద్రలోకపు వయ్యారి
వస్తానే వలపందిస్తానే..ఏ..ఏ..
జడపట్టి మగధీరా తొడగొట్టి రణధీరా
తంబురా నీదే సుందరా
ఉడుకెత్తే నడిరేయి ఒడికొస్తే యమహాయి
కిన్నెరా కొట్టేయ్ కంజిర
మాయా మశ్చీంద్రా మచ్చని చూడ వచ్చాడే
మాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరా
చరణం 1:
ఉలికించే సందిట్లో ఒకటైతే ఒళ్ళంతా
తకధిమి తకధిమి తాళం
ఊరించే కౌగిట్లో ఉల్లాసం ఇంతింతై
సరిగమలే పలికించేయదా తాపం
పంచుకుంటే తీయని తేనె తరిగేదేమి
ముద్దుతోనే చక్కర రోగం వస్తేనేమి
దినము తకధిమి కొడదామా
తడిగా పొడిగా చెడదామా
కిచ్చిడి సోం..పాపిడి
చేలో దిగితే చిలకమ్మా మీనం మేషం అవసరమా
మెక్కరా.. నీదే లక్కురా
మాయా మశ్చీంద్రా మచ్చని చూడ వచ్చాడే
మాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరా
చరణం 2:
అబ్బా నా పేరేదో నేనుండే ఊరేదో
సొద మరిచి నిన్నే అడిగా నేస్తం
పిల్లా నా పాటేదో నేనాడే మాటేదో
మతి మరిచి తపియిస్తోందే ప్రాణం
కౌగిలించుకున్న వేళ ప్రశ్నేంటయ్యా
కామశాస్త్రం నేర్పించేయిరా తస్సాదియ్యా
ఇలలో కలగా ఉందామా కరిగే కవితై పోదామా
అందమా తేనె గంధమా
వలపై ఒడిలో కలిసామా
లోకం మనమే అయిపోమా
మన్మధా రారా తుమ్మెద..
మాయా మశ్చీంద్రా మచ్చని చూడ వచ్చావా
మాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరా..