Showing posts with label సాలూరి రాజేశ్వరరావు. Show all posts
Showing posts with label సాలూరి రాజేశ్వరరావు. Show all posts

నేను కత్తుల రత్తయ్యనులే

నేను కత్తుల రత్తయ్యనులే 
చిత్రం: రామ్ రహీమ్ (1974)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపథ్యగానం: రఫీ, మాధవపెద్ది రమేష్

పల్లవి :

నేను కత్తుల రత్తయ్యనులే
నేను నెత్తురు నరసయ్యనులే 

నేను కత్తుల రత్తయ్యనులే
నేను నెత్తురు నరసయ్యనులే 

డొక్క చించి డోలు కట్టాం 
చెవులు పిండి చేతిలో పెట్టాం 
నీకు పెళ్ళి కుదిరెనమ్మా
నీకు పెళ్ళి కుదిరెనమ్మా  
ఓ బెహన్ మా బెహన్ 

నీకు పెళ్ళి కుదిరెనమ్మా  
ఓ బెహన్ మా బెహన్

మామా! శతృభయంకర నామా!


మామా! శతృభయంకర నామా!
చిత్రం : కులగోత్రాలు (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : శ్రీశ్రీ 
నేపధ్య గానం : పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, 
రమణారెడ్డి, పద్మనాభం, రేలంగి, సూర్యకాంతం 

మామా! శతృభయంకర నామా!
అందానికి చందమామా-
మా మామ... 
ఈ సదానందానికి సాక్షాత్తు మేనమామ 
బలమున గామా....
(గామా; ప్రపంచ ప్రసిద్ధి చెందిన వస్తాదు.)
నీవే కద మా ధీమా.... 
గుణధామా! 
విశ్వదాభిరామా! 
మామా!

తీయనైన ఊహల


మోహినీ భస్మాసుర (1966)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
రచన: ఆరుద్ర
గానం: సుశీల

తీయనైన ఊహలా.... తేలి తేలి ఊగెదా 

ఒక పిలుపులో పిలిచితే


ఒక పిలుపులో పిలిచితే
చిత్రం: శ్రీ వెంకటేశ్వర వైభవం (1971)
గాయని: శ్రీరంగం గోపాలరత్నం
రచన: ఏడిద కామేశ్వరరావు
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

పల్లవి:

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా . .
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా
నా పలుకులో కులుకుతావటా . . ఓ . .
ఆపదమ్రొక్కుల స్వామీ
నీ సన్నిధె నా పెన్నిధీ. .
నీ సన్నిధె నా పెన్నిధీ. .

నాదు ప్రేమ భాగ్యరాశి


నాదు ప్రేమ భాగ్యరాశి
భక్త జయదేవ (1961)
సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::సముద్రాల సీనియర్
గానం::ఘంటసాల, సుశీల

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నాదు ప్రేమ భాగ్యరాశి నీవె ప్రేయసి
నీ చెలిమి నా తనువే ధన్యమాయేగా

నాదు ప్రేమ భాగ్యరాశి నీవె ప్రేయసి

పండిత నెహ్రూ పుట్టినరోజు


విచిత్ర దాంపత్యం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
గానం: సుశీల

పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజు
మమతా సమతా పుట్టినరోజు మంచికి కోవెల కట్టినరోజు

|| పండిత నెహ్రూ ||

ముత్యం లాంటి మోతీలాలుకు రత్నంలా జన్మించాడు
జాతిరత్నమై వెలిగీ యింకొక జాతి రత్నమును కన్నాడూ
అతడే జవహర్ లాలూ అతనికి మన జేజేలు
|| పండిత నెహ్రూ ||

ఓ.. సుకుమారా..


ఓ.. సుకుమారా..
చిత్రం :  భార్యాభర్తలు (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓ.. సుకుమారా.. నను చేరా.. రావోయి.. ఇటు రావోయి..
నిలువగ లేని.. వలపులరాణి.. నీ కొరకే.. తపించునులే
నిలువగ లేని.. వలపులరాణి.. నీ కొరకే.. తపించునులే

ఓ.. జవరాలా.. ప్రియురాలా.. ఈనాడే.. మనదే హాయి
తనువుగ నేడు.. ఈ చెలికాడు.. నీ దరినే.. సుఖించునులే

ఎవరికి ఎవరు చివరికి ఎవరు?

ఎవరికి ఎవరు
దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)
ఎస్.రాజేశ్వరరావు
సినారె
రామకృష్ణ, శ్రీమతి రమణ

ఎవరికి ఎవరు చివరికి ఎవరు?
ముగియని ఈ యాత్రలోనా
ముగిసే ఈ జన్మలోనా?

చరణం 1:

పూలను పెంచే తోటమాలీ
నీవే తోటకు నిప్పులు పెడితే
వెన్నెల కురిసే పున్నమి జాబిలీ
చీకటితో నీవు చేయి కలిపితే
వెన్నెల లేదు-వేకువ లేదు
వెన్నెల లేదు-వేకువ లేదు
ఉదయం లేదు-హృదయం లేదు
బ్రతుకే చేదు

చరణం 2:

దేవుడు వెలసిన కోవెల తానే
వల్లకాడుగా మారిపోతే
గుండెలమాటున నిండుగ వెలిగే
ప్రణయదీపమే ఆరిపోతే
దేవుడు లేడు - జీవుడు లేడు
దేవుడు లేడు - జీవుడు లేడు
వేడుకలేదు-వేదన లేదు
వలపే చేదు

ధీరసమీరే... యమునాతీరే

ధీరసమీరే... యమునాతీరే
చిత్రం :  భక్త జయదేవ (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  జయదేవ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

రతిసుఖసారే గతమభిసారే మదనమనోహర వేశం
నకురునితంబిని గమనవిళంబనం
నకురునితంబిని గమనవిళంబనం
అనుసరతం హృదయేశం

ధీరసమీరే... యమునాతీరే వసతివనే వనమాలీ
ధీరసమీరే... యమునాతీరే వసతివనే వనమాలీ

గోపీ పీనపయోధర మర్ధన చంచల కరయుగశాలీ ఈ ఈ ఈ
ధీరసమీరే... యమునాతీరే వసతివనే వనమాలీ ఈ ఈ ఈ

చరణం 1:

నామసమేతం కృతసంకేతం నామసమేతం కృతసంకేతం
వాదయతే మృదువేణుం

బహుమనుతే నను తే తనుసంగత పవనచలిత మపి రేణుం
బహుమనుతే నను తే తనుసంగత పవనచలిత మపి రేణుం
ధీరసమీరే... యమునాతీరే వసతివనే వనమాలీ ఈ ఈ ఈ...

Meaning of ధీరసమీరే... యమునాతీరే

శ్లోకం: పుర్వం యత్ర సమం త్వయ రతిపతే రాసాదితా స్సిద్ధయహ్
తస్మిన్నేవ నికుంజ మన్మధ మహ తీర్ధే పునర్మాధవహ
ధ్యాయం త్వమనిశం జపన్నపి తవైవాలాప మంత్రావళీం
భూయస్తత్ కుచ కుంభ నిర్భర పరీరంభామ్రుతం వాంచతి

Oh Radha,  Krishna is sitting in the same cottage where you met happily
before. He is chanting your name like Mantra incessantly. He is yearning
to enjoy the happiness of your embrace.

రతి సుఖ సారే గతమభి సారే మదన మనోహర వేశం
నకురు నితంబిని గమన విలంబన మనుసరతం హ్రుదయేశం
ధీర సమీరే యమునాతీరే వసతి వనే వనమాలీ
గోపీ పీన పయోధర మర్దన చంచల కరయుగ శాలీ

Oh dear Radha, go quickly to meet your beloved Krishna who is beautiful
like Manmadha.The breeze is blowing gently. Krishna is waiting  in
Brundavana on the bank of Yamuna river. His hands play on the breasts of
Gopikas.

నామసమేతం క్రుత సంకేతం వాదయతే మ్రుదు వేణుం
బహు మనుతే ననుతే తను సంగత పవన చలితమపి రేణుం||ధీర

Krishna is playing flute calling your name, indicating where he was
waiting for you. He admires even the breeze passing over you and
reaching him.

పతతి పతత్రే విచలతి పత్రే శంకిత భవ దుపయానం
రచయతి శయనం సచకిత నయనం పశ్యతి తవ పంధానం||ధీర||

He is alarmed even when a feather or dry leaf drops. He is setting on bed of tender leaves and is excited about your arrival.

ముఖర మధీరం త్యజ మంజీరం రిపుమివ కేళిషు లోలం
చల సఖి కుంజం స తిమిర పుంజం శీలయ నీల నిచోళం||ధీర||

Oh Radha, leave off your anklets lest they make noise when you meet him. Please go to that bower during night in black dress.

ఉరసి మురారే రుపహిత హారే ఘనైవ తరళ బలాకే
తటిదివ పీతే రతి విపరీతే రాజసి సుక్రుత విపాకే||ధీర||

When you meet Krishna your pearl necklaces fall on his chest. You shine like
lightening on his chest which resembles dark clouds with white Sarasa birds.

విగళిత వసనం పరిహ్రుత రసనం ఘటయ జఘనమపిధానం
కిసలయ శయనే పంకజ నయనే నిధిమివ హర్ష నిదానం||ధీర|| 

Your eyes are beautiful like lotus flower. You are treasure of beauty lying
on bed of tender leaves. You are bestower of happiness.

హరిరభిమానీ రజని రిదానీ మియమపియతి విరామం
కురు మమ వచనం సత్వర రచనం పూరయ మధురిపు కామం||ధీర||

Krishna is a person with self-respect. The night is ending
He would be angry if you make delay. Go soon and fulfill his wish.

శ్రి జయదేవే క్రుత హరిసేవే భణతి పరమ రమణీయం కమనీయం
ప్రముదిత హ్రుదయం హరిమతి సదయం సమత సుక్రుత||ధీర||

Poet Jayadeva tells this delightful story of love between Radha and Krishna
with utmost devotion. Oh devotees, bow to the most benevolent lord Krishna with pious hearts.

ఈ మౌనం... ఈ బిడియం...

ఈ మౌనం... ఈ బిడియం...
చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం...

చరణం 1:

ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
మమతలన్ని తమకు తామె ...
మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక... ఆ... ఆ...ఆ...

ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం

చరణం 2:

మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
అహ... ఓహొ... ఆ....
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతిక... ఆ...ఆ... ఆ...

ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం

చరణం 3:

ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఎంత ఎంత ఎడమైతే...
ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక... ఆ...ఆ... ఆ...

ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం

హే జ్యోతి స్వరూపా

హే జ్యోతి స్వరూపా
చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల, జానకి

హే జ్యోతి స్వరూపా నారాయణా

కనులకు వెలుగువు నీవే కావా..
కనులకు వెలుగువు నీవే కావా..
కనపడు చీకటి మాయే కాదా..
కనపడు చీకటి మాయే కాదా..
నిను గనలేని ప్రాణి బ్రతుకే
నిజముగ చీకటి ఔగా దేవా..

కనులకు వెలుగువు నీవే కావా..

పేరుకు నేను తల్లిని గానీ
ఆదుకొనా లేనైతీ..
పేరుకు నేను తల్లిని గానీ
ఆదుకొనా లేనైతీ..
పాలను ద్రాపి ఆకలి బాపే
భాగ్యమునైనా నోచని నాకు
పాలను ద్రాపి ఆకలి బాపే
భాగ్యమునైనా నోచని నాకు
ఏల జనించితివయ్యా
నాకేల జనించితివయ్యా
నాకేల జనించితివయ్యా..

అండగ నుండ విధాతవీవు
అండగ నుండ విధాతవీవు
ఆకలి దప్పుల ధ్యాసే లేదు
నారాయణ నామామృత రసమే
నారాయణ నామామృత రసమే
అన్నము పానము కావా దేవా

కనులకు వెలుగువు నీవే కావా..
కనపడు చీకటి మాయే కాదా..
నిను గనలేని ప్రాణి బ్రతుకే
నిజముగ చీకటి ఔగా దేవా..
కనులకు వెలుగువు నీవే కావా..

జీవము నీవేకదా....

జీవము నీవేకదా....
చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల

జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా దేవా
బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!!
జనకుడు నీపై కినుక వహించీ నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసేదెవరూ సర్వము నీవే కదా స్వామీ !!

హే! ప్రభో! హే! ప్రభో!
లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా! కరుణా భరణా! కమల లోచన !
కన్నుల విందువు చేయగరావే ! అశ్రిత భవ భంధ నిర్మూలనా!
లక్ష్మీ వల్లభా! లక్ష్మీ వల్లభా

నిన్నే నమ్మీ నీ పద యుగళీ, సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా, పన్నగశయనా నారాయణా
||జీవము నీవే కదా||

మదిలో వెలిలో చీకటిమాపీ,
పథము జూపే పతితపావనా!
||జీవము నీవే కదా||

భవజలధినిబడి  తేలగలేని, జీవులబ్రోచే పరమపురుషా! నను
కాపాడి నీ  బిరుదమునూ, నిలువుకొంటివా  శ్రితమందార
||జీవము నీవేకదా||

నారాయణ మంత్రం....

నారాయణ మంత్రం....
చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల

ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

తల్లియు తండ్రియు నారాయణుడె
గురువు చదువు నారాయణుడె
యోగము యాగము నారాయణుడె
ముక్తియు దాతయు నారాయణుడె
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

నాథహరే శ్రీ నాథహరే
నాథహరే జగన్నాథహరే

చెట్టులెక్కగలవా ఓ నరహరి



చెట్టులెక్కగలవా ఓ నరహరి
చిత్రం: చెంచులక్ష్మి (1958)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, జిక్కి

పల్లవి:

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా?
ఓ నరహరి! చిగురు కోయగలవా?

చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే!
ఓ చెంచిత! చిగురు కోయగలనే!

చరణం 1:

ఉరకలేయగలవా? ఓ నరహరి! పరుగులెత్తగలవా?
ఉరకలేయగలవా? ఓ నరహరి! పరుగులెత్తగలవా?
ఊడ పట్టుకొని జారుడు బండకు ఊగి చేరగలవా?
ఓ నరహరి! ఊగి చేరగలవా?

ఉరకలేయగలనే! ఓ చెంచిత! పరుగులెత్తగలనే ఉరకలేయగలనే!
ఓ చెంచిత! పరుగులెత్తగలనే ఊడ పట్టుకొని జారుడు బండకు ఊగి చేరగలనే!
ఓ చెంచిత! ఊగి చేరగలనే!

చరణం 2:

ఓహో హోయ్... గురిని చూసుకుని
కనులు మూసుకుని బాణమేయగలవా?
ఓ నరహరి! బాణమేయగలవా?

గురిని చూసి వెనుతిరిగి
నాణెముగ బాణమేయగలనే!
ఓ చెంచిత బాణమేయగలనే!
ఓ చెంచిత నిన్ను మించగలనే..!

చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే!
ఓ చెంచిత! చిగురు కోయగలనే!

చరణం 3:

ఓహో హోయ్... తగవులేల ఎగతాళికాదు నను తాళిగట్టనీవా!
ఓ చెంచిత తాళిగట్టనీవా!
మనసు తెలుసుకొని మొరులు చూపితే మనువునాడనిస్తా!
ఓ నరహరి! మనువునాడనిస్తా!
ఓ నరహరి! మాలతెచ్చివేస్తా!

మాటలకందని భావాలు


మాటలకందని భావాలు
నీతి నిజాయితి (1972)
ఎస్.రాజేశ్వరరావు
సినారె
సుశీల

పల్లవి :

మాటలకందని భావాలు
మంచి మనసులు చెబుతాయి
కవితలకందని భావాలు
కంటిపాపలే చెబుతాయి
మాటలకందని భావాలు
మంచి మనసులు చెబుతాయి

చరణం 1 :

వెన్నెల మాటాడునా
వెదజల్లును చల్లదనాలు
మల్లిక మాటాడునా
కురిపించును పరిమళాలు
వెన్నెల మాటాడునా
వెదజల్లును చల్లదనాలు
మల్లిక మాటాడునా
కురిపించును పరిమళాలు

బాసరాని పాపాయి
బోసినవ్వు చాలదా
ఏనాడూ పలకని దైవం
ఈ లోకములేలదా

చరణం 2 :

పిల్లగాలి పరుగులలో
వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలో
కోటి రాగమాలికలు
పిల్లగాలి పరుగులలో
వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలో
కోటి రాగమాలికలు

హృదయానికి చెవులుంటే
జగమంతా నాదమయం
కనగలిగిన మనసుంటే
బ్రతుకే అనురాగమయం

అట్లతద్దోయ్ ఆరట్లోయ్.


అట్లతద్దోయ్ ఆరట్లోయ్.
చిత్రం: పవిత్ర బంధం (1971)
సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,బృందం

పల్లవి::

అట్లతద్దోయ్ ఆరట్లోయ్..ముద్దపప్పోయ్ మూడట్లోయ్
ఆటలనోము అట్టతద్ది..
ఆటలనోము అట్లతద్ది..ఆడపిల్లలు నోచేతద్ది
వేడుకమీరక..కోరికతీరగ..
ఓ..చెలియా నోచవే..జీవితమే..పూచెనే

ఆటలనోము అట్లతద్ది..ఆడపిల్లలు నోచేతద్ది
వేడుకమీరక..కోరికతీరగ..
ఓ..చెలియా నోచవే..జీవితమే..పూచెనే

చరణం::1

చందమామ కన్న చాలా అందమైన మొగుడు
సన్నజాజి పొదలకన్న చక్కనైన ఇల్లు..

చందమామ కన్న చాలా అందమైన మొగుడు
సన్నజాజి పొదలకన్న చక్కనైన ఇల్లు..

బంగారు బొమ్మకు కావాలే బావయ్య నేడే రావాలే
ఈ బంగారు బొమ్మకు కావాలే బావయ్య నేడే రావాలే
పన్నీరు జల్లేటి పబ్బాల కోసం..
నోచినచో ఓ చెలి..నీ మొగుడే జాబిలి..నీ మొగుడే జాబిలి

ఆటలనోము అట్లతద్ది..ఆడపిల్లలు నోచేతద్ది
వేడుకమీరక..కోరికతీరగ..
ఓ..చెలియా నోచవే..జీవితమే..పూచెనే

చరణం::2

గోరెంటాకు పెట్టుకొంటే..చేయి పండేనమ్మా
" చేయి పండితే చేపట్టే వాడొస్తాడే "
తమలపాకు వేసుకొంటే నోరు పండే నమ్మా
" నోరు పండితే పండంటి మొగుడొస్తాడే "
గోరెంటాకు పెట్టుకొంటే..చేయి పండేనమ్మా
తమలపాకు వేసుకొంటే నోరు పండే నమ్మా

నీ కన్నె వలపే పండాలి..ఆపైన నీ ఒడి ని9ండాలి
నీ కన్నె వలపే పండాలి..ఆపైన నీ ఒడి ని9ండాలి

నీ ఆశ ఆకాశమే తాకి..రాగ
ఊయాలపై ఊగవే కోయిలవై కూయవే
ఊయాలపై ఊగవే కోయిలవై కూయవే

ఆటలనోము అట్లతద్ది..ఆడపిల్లలు నోచేతద్ది
వేడుకమీరక..కోరికతీరగ..
ఓ..చెలియా నోచవే..జీవితమే..పూచెనే

ఇంతేరా ఈ జీవితం

ఇంతేరా ఈ జీవితం
చిత్రం: రంగులరాట్నం (1966)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు మరియు బి. గోపాలం
రచన: భుజంగరాయ శర్మ
గానం: ఘంటసాల బృందం
రాగం: సింధుభైరవి

పల్లవి:

ఆఆఆఆఆఆఆ

కలిమి నిలవదు
లేమి మిగలదు
కలకాలం ఒక రీతి గడవదు
కలిమి నిలవదు
లేమి మిగలదు
కలకాలం ఒక రీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా
వాడిన బ్రతుకే పచ్చగిల్లదా

ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము

చరణం::1

ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ

ఏనుగుపైని నవాబు
పల్లకిలోని షరాబు
గుఱ్ఱము మీది జనాబు
గాడిద పైని గరీబు
నడిచే దారుల గమ్యమొక్కటే

ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ

నడిచే దారుల గమ్యమొక్కటే
నడిపే వానికి అందరొక్కటే

ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము

చరణం::2

ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ

కోరిక ఒకటి జనించు
తీరక ఎడద దహించు
కోరనిదేదో దేదో వచ్చు
శాంతి సుఖాలను తెచ్చు
ఏది శాపమో ఏది వరమ్మో..ఓఓఓ..

ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ

ఏది శాపమో ఏది వరమ్మో
తెలిసీ తెలియక అలమటించుటే

ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగులరాట్నము

చరణం::3

త్యాగమొకరిది ఫలితమొకరిది
అమ్మప్రాణమా ఇద్దరిదీ
వ్యధలూ బాధలు కష్టగాథలు
చివరికి కంచికి వెళ్ళే కథలే

ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము

చరణం::4

ఆఆఆఆఆఆఆఆ

ఆగదు వలపు ఆగదు వగపు
ఆరదు జీవనమాగదు
ఎవరు కులికినా ఎవరు కుమిలినా
ఆగదు కాలం ఆగదు

ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము

ఆఆఆఆఆఆఆఆ

కలిమి నిలవదు లేమి మిగలదు
కలకాలం ఒక రీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లును
వాడిన బ్రతుకే పచ్చగిల్లును

ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము

చరణం::5

ఆఆఆఆఆఆఆఆఆ

ఇరుగింటిలోన ఖేదం
పొరుగింటిలో ప్రమోదం
రాలినపువ్వులు రెండు
పూచే గుత్తులు మూడూ
ఒకరి కనులలో చీకటిరేయి
ఇరువురి మనసులు వెన్నెలహాయి

ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము

పచ్చ బొట్టు చెరిగిపోదులే

పచ్చ బొట్టు చెరిగిపోదులే
చిత్రం:  పవిత్ర బంధం (1971)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత:  ఆరుద్ర
నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:

    పచ్చ బొట్టు చెరిగిపోదులే...నా రాజా..
    పడుచు జంట చెదరీపోదులే.... నా రాజా..

    పచ్చ బొట్టు చెరిగిపోదులే.. నా రాణీ..
    పడుచు జంట చెదరీపోదులే ..నా రాణీ..

    పచ్చ బొట్టు చెరిగిపోదులే...

చరణం 1:

    పండిన చేలు ...పసుపు పచ్చా
    పండిన చేలు... పసుపు పచ్చా
    నా నిండు మమతలు.. మెండు సొగసులు.. లేత పచ్చా..ఆ..ఆ..

    నీ మెడలో పతకం ...చిలక పచ్చా
    మన మేలిమి గురుతీ... వలపుల పచ్చా

    పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాణీ
    పడుచు జంట చెదరీపోదులే..నా రాణీ

    పచ్చ బొట్టు చెరిగిపోదులే..నా రాజా

చరణం 2:

    కలసిన కలయిక ...తలవని తలపు
    మన కలసిన కలయిక ...తలవని తలపు
    నీ చెలిమి విలువకే ...చేతి చలువకే...చిగిర్చే నా మనసు

    తిరిగెను బ్రతుకే... కొత్త మలుపు..ఊ...
    ఇది తీయని వాడని ...మన తొలి వలపు

    పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాజా
    పడుచు జంట చెదరీపోదులే...నా రాణీ...

    పచ్చ బొట్టు చెరిగిపోదులే ..

చరణం 3:

    నూరేళ్ళ వెలుగు... నుదుటి బొట్టు
    నూరేళ్ళ వెలుగు... నుదుటి బొట్టు
    అది నోచిన నోములు... పూచిన రోజున ...పెళ్ళి బొట్టు
    కట్టేను నీచేయ్... తాళిబొట్టు
    కట్టేను నీచేయ్... తాళి బొట్టు
    అది కలకాల కాంతుల... కలిమి చెట్టు

    పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాణీ
    పడుచుజంట చెదరీపోదులే...నా రాజా

    పచ్చ బొట్టు చెరిగిపోదులే...

ఫిఫ్టీ..ఫిఫ్టీ


ఫిఫ్టీ..ఫిఫ్టీ

చిత్రం:  పవిత్ర బంధం (1971)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత:  ఆరుద్ర
నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి :

ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ
సగం సగం.. నిజం నిజం
నీవో సగం.. నేనో సగం
నీవో సగం.. నేనో సగం
సగాలు రెండూ.. ఒకటైపోతే
జగానికే ఒక.. నిండుదనం
నిజం నిజం.. నిజం నిజం... ఫిఫ్టీ..ఫిఫ్టీ

చరణం 1 :
     
నీవే నాదం.. నేనే గీతం
నీవే నాదం.. నేనే గీతం
నీ నా కలయిక.. సంగీతం
నీ నా కలయిక.. సంగీతం
నీవే నింగి.. నేనే నేల
నీవే నింగి.. నేనే నేల
నిండు విలీనమే.. ఈ భువనం
నీవే కుసుమం.. నీవే భ్రమరం
పువ్వూ తుమ్మెద.. ఒకటైపోతే
జగానికే ఒక.. కమ్మదనం
నిజం నిజం.. నిజం నిజం
ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ

చరణం 2 :

రాధ సగం.. మాధవుడు సగం
రాధ సగం.. మాధవుడు సగం
రాసవిహారమే.. ప్రణయమయం
రాసవిహారమే.. ప్రణయమయం
గౌరి సగం.. శివుడు సగం
గౌరి సగం.. శివుడు సగం
అర్ధనారీశ్వరమే.. అఖిల జగం
అవినాభావం.. అమృతరావం
అభేద రూపం.. స్థిరమైపోతే
జగానికే ఒక  అమర పథం
నిజం నిజం.. నిజం నిజం .. ఫిఫ్టీ...ఫిఫ్టీ
సగం సగం.. నిజం నిజం
నీవో సగం.. నేనో సగం
సగాలు రెండూ ఒకటైపోతే
జగానికే ఒక నిండుదనం
ఫిఫ్టీ..ఫిఫ్టీ.. ఫిఫ్టీ..ఫిఫ్టీ

అల్లి బిల్లీ పిల్లల్లారా


అల్లి బిల్లీ పిల్లల్లారా
చిత్రం: రక్త సిందూరం (1967)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గానం: సుశీల బృందం
రచన: ఆరుద్ర

అల్లిబిల్లి పిల్లల్లారా
ఇల్లా రండి
మీరు.. ఇల్లా రండి
అట్లాతద్ది కన్నెనోము నోచాలండి..
నేడే నోచాలండి..

అందాల హంసతో
అలరించే చిలకతో
చిందేసే నెమలితో
తుళ్ళి తుళ్ళి ఆడుదాం

ఊరించే ఊహతో
కేరింతలాడుతూ
ఊరించే ఊహతో
కేరింతలాడుతూ
కోరికలే కలకాలం పండాలి
ఓ పండాలీ
తొక్కుడుబిళ్ళ, దాగుడుమూత
గుడుగుడుగుంచం, గుజ్జెనగూళ్ళు
పాడిననాడు చక్కని మగడు
పాడకపోతే తన్నే మగడు
నీకే...నీకే...నీకే 

అల్లిబిల్లి పిల్లల్లారా
ఇల్లా రండి
మీరు.. ఇల్లా రండి
అట్లాతద్ది కన్నెనోము నోచాలండి..
నేడే నోచాలండి..

ఉయ్యాలలూగుదాం
సయ్యాటలాడుదాం
ఒయ్యారమొలకబోసి
పాటలెన్నో పాడుదాం
ఉయ్యాలలూగుదాం
సయ్యాటలాడుదాం
ఒయ్యారమొలకబోసి
పాటలెన్నో పాడుదాం
విరజాజి తీగలై
విరితేనే వాగులై
విరజాజి తీగలై
విరితేనే వాగులై
పరువాలే కవ్వించి నవ్వాలి

జాబిలికన్నా చల్లనివాడు
వస్తాడమ్మా నేడో రేపో
నచ్చినవాడు వచ్చిననాడు
ఏం చేస్తావో పిల్లా చెప్పూ
నవ్వుతావా?
సిగ్గుపడతావా?
పులకిస్తావా?
కాదే పెళ్ళాడి పెనవేస్కుంటుందే

అల్లిబిల్లి పిల్లల్లారా
ఇల్లా రండి
మీరు.. ఇల్లా రండి
అట్లాతద్ది కన్నెనోము నోచాలండి..
నేడే నోచాలండి..