January 1, 2020

నల్లని మబ్బు చాటు


నల్లని మబ్బు చాటు
రణం (2006)
మణిశర్మ
వర్దిని

నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కిల కిల నవ్వి ఈలే వేస్తావ్ ఏమలా
సర్లే పోని అంటూ వెళ్తే నేనలా
చిటపట లాడి చిందే వేస్తవేంటలా

తెలుసా జడి వాన తొలి చినుకై నువు తాకేయగా
తడిసే నెరజాన విరి నెమలై పురి విప్పేయదా

ఘల్లుఘల్లుమని అందెలు ఆడెనులే
అరె ఝల్లుఝల్లుమని చినుకే రాలెనులే
జిల్లు జిల్లుమని ఆశలు రేగెనులే
ఏడు రంగుల విల్లై ఊగెనులే
ఎంత ధైర్యమే వాన మా ఇంటికొచ్చి నా పైనా
చిటుకు చిటుకు అని జారే చల్లని చినుకై ఎద చేరే
సరదాల వరదలో నేనుంటే పరువాల పొంగులను దోసే
వెలుగైన చూడని ఒంపుల్లో తనువార జలకమే ఆడే

చనువిస్తే తుంటరి వాన
తొలి ప్రాయం దోచటమేనా
సరికాదే కొంటె వాన
ఎద మీటి పోకె సోనా

నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కిల కిల నవ్వి ఈలే వేస్తావ్ ఏమలా

వింత చేసెనీ వాన కురిసింది కొంతసేపైనా
తడిపి తడిపి నిలువెల్లా తపనై విరిసే హరివిల్లా
చిరు జల్లు వలచిన ప్రాయానే మరుమల్లె కాజేస్తే
సెలయేటి అద్దమును చూపించి మెరుపల్లె మేనిలో చేరే

చనువిస్తే తుంటరి వాన తొలి ప్రాయం దోచటమేనా
సరికాదే కొంటె వాన ఎద మీటి పోకె సోనా

ఘల్లుఘల్లుమని అందెలు ఆడెనులే
అరె ఝల్లుఝల్లుమని చినుకే రాలెనులే
జిల్లు జిల్లుమని ఆశలు రేగెనులే
ఏడు రంగుల విల్లై ఊగెనులే