January 1, 2020

యవ్వనాల పువ్వులన్ని



యవ్వనాల పువ్వులన్ని
డిటెక్టివ్ నారద (1993)
గాత్రం: బాలు,చిత్ర
సంగీతం: ఇళయరాజా

పల్లవి:

యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో 
ప్రేమయాత్ర చేద్దామా హహహ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో 
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకు లొలుకు చెలి చెంతనుండగా 
వేరే స్వర్గము ఏలనో హహహ అ
కులుకు లొలుకు చెలి చెంతనుండగా 
వేరే స్వర్గము ఏలనో
యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో 
ప్రేమయాత్ర చేద్దామా హహహ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
చరణం1:

జుం జుం హాయ్ హాయ్
జుం జుం హోయ్ హోయ్
జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి 
ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా
చెలి నగుమోమే చంద్రబింబమై 
పగలే వెన్నెల కాయగా
హహహ హహ హహహ ఆహహహ
చెలి నగుమోమే చంద్రబింబమై 
పగలే వెన్నెల కాయగా
వెన్నెల పొదలో మల్లెల గుడిలో 
విరహంతో సఖి రగలాలా
సఖినెరి చూపుల చల్లదనంతో 
జగములె ఊటీ సాయగా

యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో 
ప్రేమయాత్ర చేద్దామా హహహ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

చరణం2:

జుం జుం హాయ్ హాయ్
జుం జుం హోయ్ హోయ్
జుం జుం హాయ్ హాయ్
జుం జుం హోయ్ హోయ్
కన్నప్రేమలేని లేత కన్నె గువ్వకి 
నీ కున్న ప్రేమ దోచిపెట్టవా
కన్నవారినే మరువజేయుచూ 
అన్ని ముచ్చటలు తీర్చనా
హహహ హహ హహహ ఆహహహ
కన్నవారినే మరువజేయుచూ 
అన్ని ముచ్చటలు తీర్చనా
ఊసుల బడిలో ఊహల చెలికే 
ఊపిరులే నీ ఆదరణే
సతి ఆదరణే పతికి మోక్షమని 
సర్వ శాస్త్రములు చాటగా

యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో 
ప్రేమయాత్ర చేద్దామా హహహ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో 
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకు లొలుకు చెలి చెంతనుండగా 
వేరే స్వర్గము ఏలనో హహహ అ
కులుకు లొలుకు చెలి చెంతనుండగా 
వేరే స్వర్గము ఏలనో
యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో 
ప్రేమయాత్ర చేద్దామా హహహ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో