Showing posts with label రమ్య. Show all posts
Showing posts with label రమ్య. Show all posts

ఆగిపో బాల్యమా

వేసవి అనగానే మావిళ్ళు, మల్లెపూలతో పాటు సెలవులతో ఇంట్లోనే ఉండి ఇరవై నాలుగు గంటలు సందడి చేసే చిన్నారులూ గుర్తొస్తారు కదా.  మహానటి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.

ఆగిపో బాల్యమా
చిత్రం : మహానటి (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రమ్య బెహ్రా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా పాటలో రాగమా

చిటికెల తాళాలు వేద్దాం
ఇంతలో వెళిపోకుమా
వెంట వచ్చే నేస్తమా
ఇంతలో వెళిపోకుమా
వెంట వచ్చే నేస్తమా
తొందరగా నన్నే పెంచేసి
నువ్వేమో చినబోకుమా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా పాటలో రాగమా

ఊరికే పనిలేకా తీరికస్సలు లేక
తోటలో తూనీగల్లే తిరిగొద్దామా ఎంచక్కా
అంతపొడుగెదిగాక తెలుసుకోలేనింకా
సులువుగా ఉడతల్లే చెట్టెక్కే ఆ చిట్కా
నింగికి నిచ్చెన వెయ్యవే
నింగికి నిచ్చెన వెయ్యవే
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హారం అల్లే రేపటి మెళ్ళో వెయ్యవే
నీ పిలుపే అందీ నలువైపుల నుండీ
అర చేతుల్లో వాలాలే
నీమది కోరిన కానుకలన్నీ

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా పాటలో రాగమా

ఉండిపో ఉండిపో

ఉండిపో ఉండిపో
ఇస్మార్ట్ శంకర్ (2019)
మణిశర్మ
భాస్కరభట్ల రవికుమార్
అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ..
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ..
ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా ..
ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా
నీతోనె నిండిపోయే నా జీవితం
వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం..

మనసే మొయ్యలేనంతలా
పట్టి కొలవలేనంతలా
విప్పి చెప్పలేనంతలా
హాయే కమ్ముకుంటోందిగా
ఏంటో చంటిపిల్లాడిలా
నేనే  తప్పిపోయానుగా
నన్నే వెతుకుతూ ఉండగా
నీలో దొరుకుతున్నానుగా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ..
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ..

సరికొత్త తడబాటే
మారింది అలవాటులాగా
ఇది చెడ్డ అలవాటే
వదిలేసి ఒకమాటు రావా
మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో
బిడియాలు పారిపోవా ఎటువైపుకో
ఆహా సన్నగా సన్నగా
సన్న జాజిలా నవ్వగా
ప్రాణం లేచి వచ్చిందిగా
మళ్ళీ పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా
కాటుక్కళ్ళనే  తిప్పగా
నేనో రంగులరాట్నమై
చుట్టూ తిరుగుతున్నానుగా

తలనిమిరే చనువౌతా
నువ్ గాని పొలమారుతుంటే
ఆ మాటే  నిజమైతే..
ప్రతిసారి పొలమారిపోతా..
అడగాలి గాని నువ్వు అలవోకగా
నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా..
ప్రాణం నీదని నాదని
రెండూ వేరుగా లేవుగా
ఎపుడో కలుపుకున్నాం కదా
విడిగా ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా
విందాం ప్రేమలో గలగల
బంధం బిగిసిపోయిందిగా
అంతం కాదులే మన కథ

మెల్లగా తెల్లారిందోయ్

మెల్లగా తెల్లారిందోయ్
చిత్రం: శతమానం భవతి (2017)
గానం: అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు
సంగీతం: మిక్కీ జె.మేయర్‌
రచన: శ్రీమణి

మెల్లగా తెల్లారిందోయ్ అలా
వెలుతురే తెచ్చేసిందోయ్ ఇలా
బోసినవ్వులతో మెరిసే పసిపాపల్లా

చేదతో బావులలో గలా గలా
చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
చుట్ట పొగమంచుల్లో
చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించి
అందించు హృదయంలా

చలిమంటలు ఆరేలా
గుడిగంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా..ఆఆ..
గువ్వలు వచ్చే వేళ
నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కనవేలా..ఆఆ..

పొలమారే పొలమంతా
ఎన్నాళ్లో నువ్వు తలచీ
కళమారే ఊరంతా
ఎన్నేళ్లో నువ్వు విడచి

మొదట అందని దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహ తహ లాడిన
పసి తనమే గుర్తొస్తుందా...

ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయనా..

నువ్వూగిన ఉయ్యాలా..
ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడకా..ఆఆ..
నువ్వాడిన దొంగాట
బెంగల్లే మిగలాలా
తన్నెవరూ వెతికే వీల్లేకా..ఆఅ..

కన్నులకే తియ్యదనం
రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం
పలికించే సెలయెళ్లే

పూల చెట్టుకి ఉందో భాష
అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే
అందం మాటాడే భాష

పలకరింపే పులకరింపై
పిలుపునిస్తే పరవశించడమే
మనసుకి తెలిసిన భాష

మమతలు పంచే ఊరు
ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరూ..ఊఊ

ప్రేమలు పుట్టిన ఊరు
అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరూ..ఊఊ