నీ కళ్ళలోన కాటుక
జై లవ కుశ (2017)
చంద్రబోస్
దేవిశ్రీప్రసాద్
హేమచంద్ర
నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
నీ మోము నింగినుండి ఓ ప్రేమ వాన రాగా
ఆ వానజల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా...ఆ ఆ ఆ ఆ
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా
ఓ ప్రేమవానలోన మునిగి పైకి పైకి తేలిపోయా
నీ జతగా నేనుండాలి
ఎవడు (2014)
దేవిశ్రీ ప్రసాద్
సిరివెన్నెల
శ్రేయా ఘోషాల్, కార్తీక్
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి....
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి....
నాకే తెలియని
నను చూపించి నీకై పుట్టాననిపించి
నీ దాకా నన్ను రప్పించావే
నీ సంతోషం నాకందించి
తెలుసునా తెలుసునా
సొంతం (2003)
కె.ఎస్.చిత్ర
దేవిశ్రీ ప్రసాద్
సిరివెన్నెల
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిత్రం : ఢమరుకం (2012)
సంగీతం : దేవిశ్రీప్రసాద్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిహరన్ , చిత్ర
రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరో ముద్దిమ్మంటూ వద్దకు వస్తున్నా
నెమ్మది నెమ్మదిగా ఝుంఝుం ఝుమ్మని తుమ్మెదగా
ముచ్చటగా ఓ మూడో ముద్దుకు చోటిమ్మంటున్నా
తొందర తొందరగా ఇచ్చేదివ్వక తప్పదుగా
తీయని పెదవుల చిరునామా నీ చెవిలో చెబుతున్నా
హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలొ నీ గుడి నడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడ అనీ
చిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడె ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చనీ నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ యెప్పుడు నే మరువ లేని తీపి గురుతులే
చరణం 1
మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీకోసం
నువ్వెక్కడెక్కడ అని వెతికి వయసు అలసిపోయె పాపం
నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగున నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే
కళల నుండి ఓ నిజమై రావె నన్ను చేరావె
హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వె గుండె చప్పుడికి తాళం నువ్వే
యెదను మీటు సుస్వరమై రావె నన్ను చేరవె
చరణం 2
నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటొంది
నువ్వు లేక వెన్నెల కూడ ఎండల్లె మండుతొంది
కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమి వేసే ఘడియ మన దరికి చేరుకొంది
ఏమి మాయవొ ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుంది నిన్ను రమ్మని
హోయ్ నువ్వు ఎక్కడునావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాని
నువ్వు లేకనే లేనేలేనని కాస్త తెలుపని
ఆకాశం తన రెక్కలతొ
కలుసుకోవాలని (2002)
దేవిశ్రీప్రసాద్
సుమంగళి, సత్య
ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి
జాబిల్లి తన ఈ వెన్నెలతో నను నిద్దుర లేపి
రేయంతా తెగ అల్లరి చెయ్యాలి
ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకం లోన చీకటినంత తరిమెయ్యాలి
చరణం 1
అరారొ అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
ఏలేలొ అని గోదారి నాతో ఊసులు ఆడాలి
ఇంధ్ర ధనసుని ఊయలగ నేను మలచాలి
తారలన్ని నాకు హారము కావాలి
మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి
చందమామ నాకు చందనమవ్వాలి
రంగులతో కళ్ళాపే చల్లాలి ఆ రంగుల నుండి లాలించే
ఒక రాగం పుట్టాలి
చరణం 2
నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లె నను చేరుకోవాలి
నా తోడుంటు యెన్నడైన సరె పసిపాపల్లె నను చూసుకోవాలి
అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి
ప్రేమ లోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి
చిన్న తప్పు చేస్తె నన్ను తీయగ తిట్టాలి
ఏనాడూ నా నీడై ఉండాలి
ఆ నీడను చూసి ఓటములన్ని పారిపోవాలి
తందానే తందానే
చిత్రం : వినయ విధేయ రామ (2019)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : ఎంఎల్‌ఆర్ కార్తికేయన్
తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే
తందానే తందానే
తందానే తందానే
కన్నారా ఎవరైనా
ప్రతిరోజూ పండగనే
ఏ తియ్యదనం
మనసుపడి రాసిందో
ఎంతో అందంగా
ఈ తలరాతలనే
ఏ చిరునవ్వు
ఋణపడుతూ గీసిందో
తనకే రూపంగా
ఈ బొమ్మలనే
తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే
తందానే తందానే
తందానే తందానే
కన్నారా ఎవరైనా
ప్రతిరోజూ పండగనే
ఒక చేతిలోని గీతలే
ఒక తీరుగా కలిసుండవే
ఒక వేలి ముద్రలో పోలికే
మరొక వేలిలో కనిపించదే
ఎక్కడ పుట్టినవాళ్లో
ఏ దిక్కున మొదలైనోళ్లో
ఒక గుండెకు చప్పుడు
అయ్యారుగా
ఏ నింగిన గాలిపటాలో
ఏ తోటన విరిసిన పూలో
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా
తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే
తందానే తందానే
తందానే తందానే
కన్నారా ఎవరైనా
ప్రతిరోజూ పండగనే
ఈ ఇంటిలోన ఇరుకుండదే
ప్రతి మనసులోన చోటుందిలే
ఈ నడకకెపుడూ అలుపుండదే
గెలిపించు అడుగే తోడుందిలే
విడివిడిగా వీళ్లు పదాలే
ఒకటయ్యిన వాక్యమల్లే
ఒక తియ్యటి అర్థం చెప్పారుగా
విడివిడిగా వీళ్లు స్వరాలే
కలగలిపిన రాగమల్లే
ఒక కమ్మని పాటై నిలిచారుగా
తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే
తందానే తందానే
తందానే తందానే
బంధాల గ్రంథాలయమే
ఉంది ఈ ఇంట్లోనే
Atom Bomb వీడు చెప్పి పేలతాడు
అడ్డుపెట్టి ఆపలేడు వీడినెవ్వడు
వీడు మాసుగాడు వేల రంగులోడు
Wrong నైనా రంగు మార్చి Right చేస్తడు
ఊ ఊసరవెల్లి ఊ అ ఊ అ ఊ అ ఊసరవెల్లి
You Can't Catch Him
You Can't Meet Him
You Can't Punch Him
You Can't You Can't You Can't You Can't Stop Him
You Can't Track Him
You Can't Chase Him
You Can't Catch Catch Catch Catch
ఊ ఊసరవెల్లి ఊ ఊసరవెల్లి ఊసరవెల్లి
ఎంతో ఫన్
చిత్రం : ఎఫ్2 (2018)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవిశ్రీ ప్రసాద్
స్వర్గమే నేలపై వాలినట్టు
నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు
గుండెలోన పూలవాన కురిసినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్
నెమలికే పాటలే నేర్పినట్టు
కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు
కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్
కాళిదాసు కావ్యము
త్యాగరాయ గేయము
కలిపి మనసు పాడినట్టుగా
అందమైన ఊహలు
అంతులేని ఆశలు
వాకిలంత వొంపినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్
ట్రెండు మారినా ఫ్రెండ్
చిత్రం : ఉన్నది ఒకటే జిందగీ (2017)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : దేవిశ్రీ ప్రసాద్
నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా
సైకిల్ నుండి బైక్ లోకి మారినా
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా
నోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి మారినా
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాక
కాలింగ్ మారినా
ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా
ఫీలింగ్ మారునా
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే
మ్మ్.. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారినా
రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్పే
లాండ్ లైన్ నుండి స్మార్ట్ఫోన్ కి మారినా
మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే
టూరింగ్ టాకీస్ నుండి ఐ మాక్స్ కి మారినా
పక్క పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్పే
పంచుకున్న పాప్ కార్న్ ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే
పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారినా
నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్పే
ఫ్రుటీ ల నుండి బీరు లోకి మారినా
పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్పే
మొట్టికాయ నుండి గట్టి పంచ్ లోకి మారినా
నొప్పిలేని తీపిదనం ఫ్రెండ్షిప్పే
అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే
A Square B Square
చిత్రం : 100% లవ్ (2011)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : కలర్స్ స్వాతి
He Lets Go
A Square B Square A Plus B Whole Square
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్...
అట్టాక్ అట్టాక్ ఎలుక పిల్లి మీదకే...
అట్టాక్ అట్టాక్ పువ్వు ముల్లు మీదకే..
అట్టాక్ అట్టాక్ ఉప్పు నిప్పు మీదకే..
అట్టాక్ అట్టాక్
A Square B Square A Plus B Whole Square
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్...
హే రింగా రింగా రోజెస్ వంకర టింకర పోసెస్
తింగర తింగర తీరమ్స్ కి పెట్టేయ్ సొల్యూషన్స్
హే పోటా పోటీ చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్
మీది మీది రాంకుల కోసం కాంపిటీషన్స్
అట్టాక్ అట్టాక్ చేప కొంగ మీదకే..
అట్టాక్ అట్టాక్ జింక పులి మీదకే..
అట్టాక్ అట్టాక్ వోణీ జీన్స్ మీదకే..
అట్టాక్ అట్టాక్
A Square B Square A Plus B Whole Square
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్...
ఏ స్క్వేర్ బి స్క్వేర్
చిత్రం : 100% లవ్ (2011)
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీ శ్రీ ప్రసాద్
ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏ టైమైనా డోంట్ కేర్
చీటింగ్ చీటింగ్ పిల్లి ఎలక పిల్లనీ
చీటింగ్ చీటింగ్ నక్క పిల్ల కాకినీ
చీటింగ్ చీటింగ్ మీసం జడకుచ్చునీ
చీటింగ్ చీటింగ్
ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్