January 1, 2020

ఇప్పటికిప్పుడు రెప్పల్లో

ఇప్పటికిప్పుడు రెప్పల్లో
ప్రేమకు వేళాయెరా(1999)
చిత్ర, ఉన్ని కృష్ణన్,
ఎస్.వి. కృష్ణారెడ్డి

ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెనలో

ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కలల ఊవిళ్లో
మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే
సరదాల సందడి
ప్రేమకి వేళయిందని తరిమి తడిమే
తరుణాల తాకిడి

ఏం చేయమంది కొంటె అల్లరి
ఆ మాట చెప్పదు ఎలా మరి
మాటలేవి వద్దు చేరుకోమని
చిలికి చినికి ఉలికి పడే
చిలిపి వలపు చినుకు సడి
ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెనలో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కలల ఊవిళ్లో

సరసకు చేరలేదు ఇన్నాళ్లు
అలజడి రేపుతున్న తొందరలు
పరిచయమైన లేదు ఏ నాడు
శిరసును వంచమన్న బిడియాలు
సరదాగా మొదలైన శృతి మించే ఆటలో
నను నేనే మరిచానా మురిపించే ముద్దులో

ఏమైనా ఈ మాయ బాగుందిగా
ఆకాశ మార్గాన సాగిందిగా
ముడిపడి వీడనంది నూరేళ్ళ సంకెలా

ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెనలో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కలల ఊవిళ్లో

కనపడలేదు మునుపు ఏనాడు
కనులకు ఇన్ని వేల వర్ణాలు
తెలియనే లేదు నాకు ఏనాడు
తలపున గిల్లుతున్న వైనాలు
పెదవుల్లో విరబూసే చిరు నవ్వుల కాంతిలో
ప్రతి చోట చూస్తున్న ఎన్నెన్ని వింతలో

తొలిసారి తెలవారే నీ ఈడుకి
గిలిగింత కలిగింది ఈ నాటికి
జతపడి సాగమంది కౌగిళ్ళ వాడకి