జాజిమల్లీ తోటలోనా


జాజిమల్లీ తోటలోనా
చిత్రం: నిను చూడక నేనుండలేను (2002)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కులశేఖర్
గానం: సాధనా సర్‌గమ్ 

పల్లవి:

జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరువంకా
జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే 
ఉన్నమాట చెప్పలేనే 
ఈ లాహిరిలో

జాజిమల్లీ తోటలోనా
జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరుమైనా
జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే 
ఉన్నమాట చెప్పలేనే 
ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా

చరణం 1:

ఓ..
రోజు చూస్తూ ఉన్నా 
స్నేహంగానే ఉన్నా 
చెప్పలేనే ఎందుకో మరీ

నాలో తానే ఉన్నా 
అంతా చూస్తూ ఉన్నా 
అందుకోడే ఇంత ప్రేమనీ

ఏ నీలిమేఘానితో.. 
రాయాలి నా ప్రేమనీ

ఏ పూల రాగాలతో.. 
పంపాలి ఆ లేఖనీ
మనసేమో క్షణమైనా 
ఒక చోట ఉండదే

జాజిమల్లీ తోటలోనా 

చరణం 2:

అమ్మో బాబో అన్నా 
నువ్వే దారి అన్నా 
చిన్నమాట గొంతుదాటదే

మాటే రాదంటున్నా 
దారే లేదంటున్నా 
గుండెచాటు ప్రేమ ఆగదే

ఈ మోహలుయ్యాలలో.. 
నా ఆశ తీరేదెలా

ఈ గాలి కౌగిళ్ళలో.. 
నా మాట చేరేదెలా
ఎవరైనా తెలపాలి 
మదిలోన బాధని

జాజిమల్లీ తోటలోనా