Showing posts with label వింజమూరి సీత. Show all posts
Showing posts with label వింజమూరి సీత. Show all posts

బండెనుక బండి గట్టి..


బండెనుక బండి గట్టి..
మాభూమి (1980)
సుద్దాల హనుమంతు
వింజమూరి సీత, గౌతమ్ ఘోష్
గద్దర్

బండెనుక బండి గట్టి..
పదహారు బండ్లు గట్టి..
ఏ బండ్లే బోతవ్ కొడుకో..
నైజాము సర్కరోడా..
బండెనుక బండి గట్టి పదహారు బండ్లు గట్టి
ఏ బండ్లే బోతవ్ కొడుకో నైజాము సర్కరోడా
నాజీల మించినవురో నైజాము సర్కరోడా

పోలీసు మిల్ట్రీ రెండూ బలవంతులానుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కరోడా

జాగీరుదారులంతా జామీను దారులంతా
నీ అండా జేరిరి కొడుకో
నైజాము సర్కరోడా

స్త్రీ పురుషులంత గలిసి పిల్లాలమంత గలిసి
వడిసేల రాళ్లు నింపి వడి వడిగ గొట్టితేను
కారాపు నీళ్లు దెచ్చి కండ్లల్ల జల్లితేను
నీ మిల్ట్రీ బారిపోయెరో నైజాము సర్కరోడా

సుట్టు ముట్టూ సూర్యపేట
నట్టనడుమ నల్లగొండ
నువ్ ఉండేది హైద్రబాదు
దాని పక్కన గోలుకొండా
గోల్కొండ ఖిలా కింద గోల్కొండ ఖిలా కింద
నీ ఘోరీ కడ్తమ్ కొడుకో నైజాము సర్కరోడా

పల్లెటూరీ పిల్లగాడా

పల్లెటూరీ పిల్లగాడా
చిత్రం : మా భూమి (1980)
సంగీతం : వింజమూరి సీత, గౌతం ఘోష్
రచన : సుద్దాల హనుమంతు
గానం : సంధ్య

పల్లెటూరీ పిల్లగాడా!!
పశులగాసే మొనగాడ !!
పల్లెటూరీ పిల్లగాడా !!
పశులగాసే మొనగాడ !!

పాలు మరచీ ఎన్నాల్లయ్యిందో ..
ఓ..పాలబుగ్గలా జీతగాడా..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..

చాలి చాలని చింపులంగీ చల్లగాలికి సగము ఖాళీ..
చాలి చాలని చింపులంగీ చల్లగాలికి సగము ఖాళీ..
గోనె చింపూ కొప్పెర పెట్టావా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
దాని చిల్లులెన్నో లెక్కాబెట్టేవా..

తాటి గెగ్గలా కాలి జోడూ తప్పటడుగుల నడక తీరు
తాటి గెగ్గలా కాలి జోడూ తప్పటడుగుల నడక తీరు
బాట తో పని లేకుంటయ్యిందా...

ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
చేతికర్రే తోడైపోయిందా..

గుంపు తరలే వంపు లోకి కూరుచున్నవు గుండు మీద..
గుంపు తరలే వంపు లోకి కూరుచున్నవు గుండు మీద..
దొడ్డికే నీవు దొరవై పోయావా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
దొంగ గొడ్లనడ్డగించేవా...

కాలువై కన్నీరు గారా... కల్ల పై రెండు చేతులాడ..
కాలువై కన్నీరు గారా... కల్ల పై రెండు చేతులాడ..
వెక్కి వెక్కి ఏడ్చెదవదియేలా
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
ఎవ్వరేమన్నారో చెప్పేవా..


మాయదారి ఆవుదూడలు మాటి మాటికి ఎనుగుదుమికి
మాయదారి ఆవుదూడలు మాటి మాటికి ఎనుగుదుమికి
పంట చేను పాడు చేసాయా
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
పాలికాపూ నిన్నే గొట్టాడా..

నీకు జీతము నెలకు కుంచము.. తాలు వడిపిలి కల్తి గాసము
నీకు జీతము నెలకు కుంచము.. తాలు వడిపిలి కల్తి గాసము
కొలువగ శేరు తక్కువ వచ్చాయా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
తల్చుకుంటే దుఖం వచ్చిందా..

పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!
పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!
పాలు మరచీ ఎన్నాల్లయ్యిందో ..
ఓ..పాలబుగ్గలా జీతగాడా..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..