January 5, 2020
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే...
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
డియర్ కామ్రేడ్ (2019)
గానం: గౌతమ్ భరద్వాజ్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
రచన: రెహమాన్
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే...
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
నీవైపే లాగేస్తుంది నన్నే
ఓ...
నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే
నీకోసమే, నా కళ్ళే వాకిళ్ళే తీసి చూసే ముంగిళ్ళే...
రోజూ ఇలా...నే వేచే ఉన్నాలే ఊగే ప్రాణం నీవల్లే
ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురు మరచిన నా ఎద సడిలో
ఎదురు చూస్తూ ప్రతి వేకువలో
నిదుర మరచిన రాతిరి ఒడిలో
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
ఉ...హు...
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
దేరాన దేరానన దేనా