December 22, 2019

రావే రాజహంసలా



రావే రాజహంసలా
ముద్దుల మొగుడు (1997)
కోటి
సిరివెన్నెల
బాలు, సుజాత

ఆలపించె అణువు అణువు స్వాగతాంజలి
ఆలకించి మేలుకుంది నీ అనార్కలి
వేచివుంది వలపు లోగిలి.. ఓ.. ఓ

రావే రాజహంసలా నీవే రెండు కన్నుల
నిండి ఉండిపోవే వెన్నెలా !!

రారా రాజశేఖరా నీకే రాజధానిలా
వేచివున్న ఎదనే ఏలరా !!
ఓ చిలిపి కల.. ఓ వలపు వల
జరపవె జతపడు లీలా

అందాల సారమా మందార హారమా
నీ తేనెలో తేలించుమా..
గంగా సమీరమా శృంగార తీరమా
నీ లీలలో లాలించుమా..

అధరసుధల మృదుహాసమా
మదికి మొదటి మధుమాసమా
మదన కథల ఇతిహాసమా
మనసుపడిన దొరవే సుమా.. !!

సదా గులామై సఖీ సలాం అను
సలీం చెలిమినే ఆదరించుమా !!

రారా రాజశేఖరా నీకే రాజధానిలా
వేచివున్న ఎదనే ఏలరా !

మేఘాలచంద్రమా మోహాలమంత్రమా
నా ప్రాయమే పాలించుమా
రాగాల సంద్రమా లాగేటి బంధమా
నా శ్వాసనే శాసించుమా

బ్రతుకు నడుపు అనురాగమా
మనసు తెలిసి దయచేయుమా
తలపు తెలుపుకొను మౌనమా
తెరలు తెరచి ననుజేరుమా..!!

జగాలలో ప్రతి యుగానికీ
మన కథే నిలుచునని చాటి చూపుమా !!

రావే రాజహంసలా నీవే రెండు కన్నుల
నిండి ఉండిపోవే వెన్నెలా !!
ఓ చిలిపి కల.. ఓ వలపు వల
జరపవె జతపడు లీలా
రారా రాజశేఖరా నీకే రాజధానిలా
వేచివున్న ఎదనే ఏలరా !!