January 7, 2020
కలగా వచ్చినావు....
కలగా వచ్చినావు
పోకిరీరాజా (1995)
రాజ్-కోటి
చిత్ర, బాలు
సిరివెన్నెల
కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
వహ్వా నచ్చినావు తహతహ కలిగించినావు
మదనా ఓ నా మదన మదన మదనా
కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
యమగా రెచ్చినావు జలజలజల కురిసినావు
లలనా ఓ హూ లలన లలన లలనా
అందొచ్చిన అందాలను వదిలేయకు
పొంగొచ్చిన గంగల్లే అల్లేయకూ
సరదా పడవా
చెబితే వినవా
మరీ అలా బెట్టెందుకు
కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
లలనా ఓ హూ లలన లలన లలనా
సరిగా పోల్చుకుని వరసే తేల్చుకుని
బరిలో దిగాలి గానీ
ఓ అయినా ఇదేం పనమ్మీ
సిగ్గే చంపుకుని అగ్గే దింపమని
అడిగే హక్కున్నదాన్ని ఓ
అలుసై పొయ్యాన సామి
మాట వరసకైన మోమాట పెట్టకు నన్ను
మోటు సరసమైన నిను కాదని అనుకోను
ఎవరనుకుని ఎగబడతావు వదలవె నన్ను
ఈనాడే కాదయ్యొ వచ్చే జన్మం లోనైనా
నీ నీడై ఇట్టాగే వెంటే ఉంటాను
అసలు సిసలు ఆడపులిగ దూకకె వామ్మో
కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
మదనా ఓ నా మదన మదన మదనా
పాపను కట్టుకుని పైటను పట్టుకుని
పైపై కొచ్చెయ్యి బావా ఓ
రావా మహానుభావా
పోన్లే పాపమని పెదవే అందుకుని
ఒళ్ళో పడాలంటావా అయ్యయ్యయ్యయ్యొ
పాపం చేసేయ్ మంటావా
పడుచుతనం లేద
అది పొడుచుకు తినలేదా
పదుగురెదుట మీద పడిపోతే మరియాద
కసి తెలియని పసి మనసువి
నువ్వు కావుగా
కల్యాణం కోసం కదం తొక్కే కళ్యాణి
వేళొచ్చెదాక వేసేయ్ కళ్ళేన్ని
ముసుగు వెనుక ముడుచు కొనక
బైట పడవయా
కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
యమగా రెచ్చినావు జలజలజల కురిసినావు
మదనా ఓ నా మదన లలన లలనా
అందొచ్చిన అందాలను వదిలేయకు
పొంగొచ్చిన గంగల్లే అల్లేయకూ
సరదా పడవా
చెబితే వినవా
మరీ అలా బెట్టెందుకు