January 1, 2020

బంతిపూల జానకీ జానకీ....


బంతిపూల జానకీ జానకీ....
చిత్రం : బాద్ షా  (2013)
సంగీతం : థమన్ ఎస్.ఎస్.
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : దలేర్ మెహందీ , రనీనా రెడ్డి

సాకీ :

కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురో
రాంజీ రాంజీ రాంజీ రాంజీ...
హాయ్ రాంజీ రాంజీ రాంజీ రాంజీ

పల్లవి :

బంతిపూల జానకీ జానకీ నీకంత సిగ్గు దేనికీ దేనికీ
చలో చలో నాతో వచ్చెయ్ అత్తారింటికీ ॥॥
ఆకువక్క సున్నముంది నోరు పండటానికి
ఆడ ఈడు ముందరుంది నీకు చెందడానికి
ఉట్టిమీద తేనెపట్టు నోటిలోకి జారినట్టు సోకులన్ని పిండుకుంటనే
చరణం : 1

చాపకింద నీరులాగ చల్లగా చెంతకొచ్చినావు చెంప గిల్లగా గిల్లగా
చేపముల్లు గుచ్చినావె మెల్లగా పాతికేళ్ల గుండె పొంగి పొర్లగా పొర్లగా
చూపులో ఫిరంగి గుళ్ల జల్లుగా సిగ్గులన్ని పేల్చినావు ఫుల్లుగా ఫుల్లుగా
సంకురాత్రి కోడి సుర్రకత్తిగట్టి దూకు దూకు దూకుతాందె కారంగా
శంఖుమార్కు లుంగి పైకి ఎత్తిగట్టి ఎత్తుకెళ్లిపోర నన్ను ఏకంగా
ఆనకట్టు తెంచినట్టు దూసుకొస్తమీదికి
మందుగుండు పెట్టినట్టు మాయదారి గుట్టు మట్టు
నిన్ను చూసి ఫట్టుమందిరో ॥

చరణం : 2

అంతలేసి తొందరేంది పిల్లడా అందమంత పట్టినావు జల్లెడా జల్లెడా
అందుబాటులోని పాలమీగడా ఆకలేసి నంజుకోన అక్కడా ఇక్కడా
నీకులాంటి పిల్లగాణ్ణి ఎక్కడా చూడలేదె కంచిపట్టు పావడా పావడా
చెక్కు రాసినట్టు లెక్కతీరినట్టు హక్కులన్ని ఇచ్చుకోవె మందారం
బిక్కుమున్న బెట్టు తొక్క తీసినట్టు మూతిముద్దులిచ్చుకోరా బంగారం
అగ్గిపెట్టి చంపమాకే కుర్ర కళ్ల కుంపటీ
మస్తులోడు లవ్వులారి స్పీడుగొచ్చి గుద్దినట్టు కౌగిలిస్తె మెచ్చుకుంటలే