Showing posts with label ఉదిత్ నారాయణ్. Show all posts
Showing posts with label ఉదిత్ నారాయణ్. Show all posts

మీసాల పిల్ల

మన శంకరవరప్రసాద్ గారు (2026)
గాయకులు: ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో 
సాహిత్యం: భాస్కరభట్ల 

పల్లవి:

హే మీసాల పిల్లా.. 
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..
మీసాల పిల్లా.. 
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..
పొద్దున్ లేచిందగ్గర నుంచీ డైలీ యుద్ధాలా?
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళా?

అట్లా కన్నెర్ర జెయ్యలా.. 
కారాలే నూరేలా
ఇట్టా దుమ్మెత్తిపొయ్యలా.. 
దూరాలే పెంచేలా
కుందేలుకు కోపం వస్తే.. 
చిరుతకి చెమటలు పట్టేలా

నీ వేషాలు చాల్లే.. 
నువ్ కాకాపడితే కరిగేటంత సీనేలేదులే
అందితె జుట్టూ.. అందకపోతే కాళ్ళబేరాలా
నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..

ఓ బాబు నువ్వే ఇంతేనా..
మగజాతి మొత్తం ఇంతేనా..
గుండెల్లో ముళ్ళు గుచ్చి 
పువ్వులు చేతికి ఇస్తారా..?

మీసాల పిల్లా.. 

స్వాతిచినుకా

అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ
రచన: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

పల్లవి : 

స్వాతిచినుకా 
సందె తళుకా 
నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా 
రావే కౌగిలింటి దాకా
చందమామ తునకా 
రావే కౌగిలింటి దాకా

ఇంత చురుకా 
వింత ఉరుకా 
ప్రేమే పుట్టాకా
అబ్బో ఆగడాల దుడుకా
అల్లే అల్లరింటి కొడుకా
ఆగడాల దుడుకా 
అల్లే అల్లరింటి కొడుకా

చేరుకో నన్నే తారకా....

కోరుకోలేవే కోరికా.....

నేరుగా వచ్చేసాక 
మోమాటమేముంది
ముద్దాడవే గోపిక

స్వాతిచినుకా 

నేను గాలిగోపురం

మనసున్న మారాజు (2000)
రచన: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గానం: ఉదిత్ నారాయణ్, అనూరాధ పౌడ్వాల్
టిప్పు (హమ్మింగ్)

పల్లవి:
  
నేను గాలిగోపురం 
నీవు ప్రేమపావురం
వచ్చీ వాలే ఈ క్షణం
 
నేను తెల్లకాగితం 
నీవు తేనె సంతకం
కోరుకున్న ఈ దినం 

ప్రేమకు దేవత నీవని తెలిసి
నా మది నీకొక కోవెల చేసా
ఓ ప్రియా.....
ఓ ప్రియా... ఓ ప్రియా..ఆ
నేను గాలిగోపురం 

గుసగుసలే గున్నామామిళ్ళో

చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ 
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత  
రచన: వేటూరి 

పల్లవి : 

గుసగుసలే గున్నామావిళ్ళో  
అన్నీ రుసరుసలే కన్నెచూపుల్లో

చిటికెడులే చిరుముద్దుల్లో 
అన్నీ పిడికెడులే పిల్లా సిగ్గుల్లో

యా యా సౌందర్య 
ఇది నిజమా యాయా

అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా

ఎదకొరిగి ఎన్నో బింకాలా
రుచిమరిగీ ఇంకా ఇంకాలా

హొయ్ చెమటలతో చెంగే పంఖాలా
హొయ్ సుఖపడుతూ కట్టే సుంకాలా 

గుసగుసలే గున్నామావిళ్ళో  
అన్నీ రుసరుసలే కన్నెచూపుల్లో

సహానా శ్వాసే వీచెనో


సహారా పువ్వై పూచెనో
గానం : గోమతి శ్రీ, విజయ్ ఏసుదాస్

సహానా శ్వాసే వీచెనో
చిత్రం : శివాజీ(2007)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : సుద్దాల అశోక్‌తేజ
గానం : ఉదిత్ నారాయణ్, చిన్మయి

సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో
సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో

ఓలమ్మో ఓరినాయనో


ఓలమ్మో ఓరినాయనో
పెళ్ళాంతో పనేంటి (2003)
ఎస్వీ కృష్ణారెడ్డి...
చంద్రబోస్
ఉదిత్ నారాయణ్, రనీనా రెడ్డి

పల్లవి: 

ఆదివారం షికారుకి 
సోమవారం సినిమాలకి 
మంగళారం రెస్టారెంటుకి 
శుక్రవారం రాముని గుడికి 
అన్నిచోట్లకి నాతో తిరిగి 
ఆఖరికి నను మరిచి పోయాడ్రో ...
ఓలమ్మో 
ఓలమ్మో ఓరినాయనో..

ఆదివారం ఆఫీసుకి
సోమవారం షాపింగుకి 
మంగళారం మధురై బ్యాంకుకి 
శుక్రవారం చెన్నై బ్రాంచికి
అంతులేని బిజీగా ఉంటే 
ఇంతలో నీ గజిబిజి ఏందమ్మో...
ఓలమ్మో 
ఓలమ్మో ఓరినాయనో

అమ్మాయే సన్నగ

అమ్మాయే సన్నగ
ఖుషి (2001)
చంద్రబోస్
మణిశర్మ
కవితా కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే

అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే

ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే

ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే
ప్రేమలు పండే వేళ జగమంత జాతరలే

ప్రేమే తోడుంటె పామైన తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైన పరుపేలే

నీ ఒంట్లో ముచ్చెమటైన నా పాలిట పన్నీరే
నువ్విచ్చె పచ్చి మిరపైన నా నోటికి నారింజె

ఈ వయసులో ఈ వరసలో
ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే

నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం
నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం

ఎగిరే నీ పైటే కలిగించె సంచలనం
ఒలికే నీ వలపే చెయ్యించే తలస్నానం

యెండల్లొ నీరెండల్లో నీ చెలిమె చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవి కిరణం

పులకింతలె మొలకెత్తగ
పులకింతలే మొలకెత్తగ ఇది వలపుల వ్యవసాయం

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే

మీసాల గోపాల


మీసాల గోపాల
దొంగోడు (2003)
చంద్రబోస్
ఉదిత్ నారాయణ్, శ్రీవర్ధిని
విద్యాసాగర్

మీసాల గోపాల రా రా రారా
నా బాల గోపాల రా రా రారా

మీసాల గోపాల రా రా రారా
నా బాల గోపాల రా రా రారా

నీకు చిన్ననాటి చెమ్మ చెక్క
గుర్తు ఉన్నదా?
జామ చెట్టు కింద పిల్లి మొగ్గ
గుర్తు ఉన్నదా?
చిరుగు నిక్కరేసి వేణువూదుతుండగా
ఉప్పెనల్లె కారె ముక్కు గంగ
గుర్తు ఉన్నదా? హాఆ

హే… మీసాల గోపాల రా రా రారా
నా బాల గోపాల రా రా రారా

మర్రి చెట్టు గట్టు మీద
జాంపండు కోసుకొచ్చి
కలిసి తిన్నాము గురుతుందా? హొయి..
మిరప తోట కంచె కాడ
చెవిని పట్టి తోట మాలి
తిప్పినాడు నొప్పి పోయిందా...? హా...
హొ హొ హొ చిక్కు చిక్కు పుల్ల అంటూ
ఇసుకలో ఇళ్ళే కట్టాములె...
అహ చల్ చల్ గుర్రమంటూ
ఆటలో ఏల్లే మరిచాములే...
హొ గురుతుంది కదా ఆ పొడుపు కథా?
జొన్న చేలో చెప్పుకున్నదీ..
దోబూచి కథా బాగుంది కదా
అని ఊరు వాడ మెచ్చుకున్నదీ..

మీసాల గోపాలం రానే వచ్చాడే
నా బాల గోపాల రా.. రా

కాళ్ళ గజ్జా కంకాలమ్మ
ఏళ్ళు ముంచుకొచ్చేనని
బుల్లి గౌను కథ మరిచేనా...?
హా వీరి వీరి గుమ్మడిపండు
వేగు చుక్క వెలగపండు
గిల్లి కజ్జాలు మొదలేనా.. హొయి హొయి
హొ హొ హొ ఒప్పుల కుప్ప అంటూ
మధ్యలో వదిలేసి పోమాకే..
గుడు గుడు గుంచమంటూ
గుండెలొ గూడే కట్టుకుంటా
కల కాదు ప్రియా ఇది నిజము అని
నువ్వు గిచ్చి గిచ్చి చెప్పవమ్మా..
కలిసాము మనం కల కాదు నిజం
అని ఒట్టు పెట్టి చెప్పెనమ్మా...

అహెయ్ మీసాల గోపాలం రానే వచ్చాడే
నా బాల గోపాల రా రా రారా
నాటి చెమ్మచెక్క పిల్లిమొగ్గ
గుర్తు ఉన్నదే
పంట చేల మధ్య పప్పు చెక్క
గుర్తు ఉన్నదే
తొర్రి పళ్ళ బుజ్జి పిల్ల పరుగు తీయక
కాకి రెట్ట పడ్డ పుల్ల పిలక
గుర్తు ఉన్నదే...

నా ప్రాణమా సుస్వాగతం

నా ప్రాణమా సుస్వాగతం
డాడీ (2001)
మణిశర్మ
సిరివెన్నెల
ఉదిత్ నారాయణ్, చిత్ర

గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమా అభినందనం
అనుబంధమా శుభవందనం
నీకోసమే పుట్టాననీ నా ఊపిరన్నది
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నది
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప

చరణం 1:

నడి రేయే నిలవదుగా
వెన్నెలగా నువ్వు నవ్వతుంటే
ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే
చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి
ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
హా..నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం

చరణం 2:

ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా
తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా
సంకోచం తీర్చగా ముద్దుబాస చేస్తున్నా
సంతోషం సాక్షిగా మూగభాష వింటున్నా
నీలో లీనమై నేనే  నీవనిపించేలా
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది

నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
నీకోసమే పుట్టాననీ నా ఊపిరన్నది
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నది
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప

ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే



చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భీమ్స్
గానం: ఉదిత్ నారాయణ్, ఉష

పల్లవి : 

ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే
ఓయ్ రాజు నిను చూడకుంటే
మనసాగదయ్యో 
ఏ మంత్రమేశావయ్యో

ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే
ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే
ఏయ్ రాణి నిను చేరుకుంటా
మనువాడుకుంటా 
మనసంత నీదేనమ్మో

ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే

సోనియా... సోనియా...


సోనియా...
చిత్రం: రక్షకుడు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, హరిణి

సోనియా... సోనియా...
సోనియా సోనియా
సోనియా... సోనియా

పల్లవి:

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
హే సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటు
పిల్లా కళ్ళను చూసే
చేసెయ్ గురువా ఫైటు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటు
పిల్లా కళ్ళను చూసే
చేసెయ్ గురువా ఫైటు

చరణం: 1

పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లే
చెక్కిళ్ళు తడితే అది నీటు
కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లే
ఒడి చేర్చుకుంటే అది నాటు
పచ్చిక మీద పడే చినుకుల మల్లే
చిరుముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు
కసిగా మీద పడే ఉప్పెన మల్లే
చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు
నీ కురుల మీద పువ్వును నేనై
మురిపించే యాటలాడించనా
మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే
మంచంలో మాటలకీ చోటేముందే
మత్తెక్కే కౌగిట్లో ముంచేస్తా అమ్మడు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రెండిట్లో ఏది నాకు ప్యారు

చరణం: 2

ఊరించే ఒడిలో ఉప్పొంగే తడిలో
బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే
పరువాల పిలుపే కళ్ళల్లో మెరుపై
గుండెల్లో సెగలే రగిలిస్తుంటే
కౌగిలి క్రికెట్ కి సిస్టమ్ లేదే
అంపైరు లేడే మగతనముంటే చాలే
పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా
ఎద మల్లెల పూమాలోయ్
నలిపేకపోతే అందం లేదే
కసిలేని మోహం మోహంకాదే
కోమలితో వాదిస్తే అర్థముందా
కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా
ప్రేయసిని గెలిచేది నాజూకు తనమేగా

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటు
పిల్లా కళ్ళను చూసే
చేసెయ్ గురువా ఫైటు

సోనియా... సోనియా... సోనియా...