ఒకే మనసు రెండు
చిత్రం : సూర్య చంద్రులు (1978)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : సినారె
గానం : బాలు, చిత్తరంజన్
అహా..ఓహో.. ఎహే..ఆహఅహ్హాహా..
ఒకే మనసు రెండు రూపాలుగా
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా
అల్లుకున్న అనుబంధం అదే అదే మన బంధం.
అల్లుకున్న అనుబంధం అదే అదే మన బంధం.
ఒకే మనసు రెండు రూపాలుగా
ఒకే ఊపిరి రెండు హృదయాలుగాఅహా ఉహూ ఏహే..
ఉన్నమనసు ఒకటైతే
పెళ్ళైతే ఎవరికిస్తావు
సగమే నా శ్రీమతికీ..
మరో సగం నీకిస్తాను..
ఆహాహహ..ఓహొహ్హోహో..
మరణమే నన్ను రమ్మంటే
మరి నీవేమంటావవు
మరణమైనా జీవనమైనా
చెరిసగమంటాను..
ఒకే మనసు రెండు రూపాలుగా
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా
మరో జన్మ మనకుంటే
ఏ వరం కోరుకుంటావు
ఒకే తల్లి కడుపు పంటగా
ఉదయించాలంటాను
ఆహాహ్హహా.. ఓహహోహో..
అన్న దమ్ములుగ జన్మిస్తే
అది చాలదు చాలదు అంటాను
కవలలుగా జన్మించే జన్మ
కావాలి కావాలి అంటాను
ఒకే మనసు రెండు రూపాలుగా
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా