ప్రముఖ గాయనీ గాయకులు హమ్మింగ్ మాత్రమే చేసిన తెలుగు పాటలు

నవ్వింది మల్లెచెండు... నచ్చింది గర్ల్ ఫ్రెండు-అభిలాష (1983), జానకి

పయనించే చిరుగాలి – పట్నం పిల్ల (1980) ఆనంద్ గారు పాడిన పాటకు సుశీల గారు హమ్మింగ్ ఇచ్చారు. 

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ - సిరి సంపదలు (1962) - సుశీల

పరుగులు తీసే నీ వయసునకూ - ఆత్మబలం (1964) - సుశీల

ఈ సంజెలో... కెంజాయలో- మూగప్రేమ (1976) - బాలు

నా హృదయపు కోవెలలో- ఇద్దరు అమ్మాయిలు (1970) - జానకి

ఆ కనులలో కలల నా చెలీ - ఆలాపన (1986) - జానకి

నా హృదయమా

చిత్రం: ప్రియ (1981)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్యగానం: బాలు, జానకి   

పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. 
నా హృదయమా .. 
నా హృదయ ఉదయరాగమా
మాయనీ... తీయనీ... 
మధురగీతి పాడుమా

ఒక మాటుంది

చిత్రం: ఐ లవ్ యూ (1979)
సంగీతం: సత్యం
గీతరచయిత: వీటూరి
నేపథ్యగానం: జానకి

పల్లవి :

ఒక మాటుంది.. 
కలవరం రేపి
మనసులో దాగను అంటోంది.. 
ఐ లవ్ యూ
పొంగే వయసిది.. 
పూచే మరి మరి.. 
రా దొరా

ఒక మాటుంది.. 
కలవరం రేపి
మనసులో దాగను అంటోంది.. 
ఐ లవ్ యూ

రావె మోహిని

గోపాలరావు గారి అబ్బాయి (1989)
సంగీతం: ఇళయరాజా 
రచన: సీతారామశాస్త్రి 
గానం: బాలు, జానకి

పల్లవి : 

రావె మోహిని 
రసరాగవాహిని
రావె మోహిని 
రసరాగవాహిని
మనలో మరులే సుధలై 
నిలువనీవే..
రావె మోహిని
రసరాగవాహిని

అరుణపతాకం ఎగిరింది

మనుషులు మారాలి (1969)
రచన: శ్రీశ్రీ 
సంగీతం: మహదేవన్
గానం: పిఠాపురం, మాధవపెద్ది బృందం

పల్లవి : 

యూనియన్ జిందాబాద్ 
ఇంక్విలాబ్ జిందాబాద్ 
యూనియన్ జిందాబాద్ 
ఇంక్విలాబ్ జిందాబాద్ 

అరుణపతాకం ఎగిరింది 
కార్మికలోకం గెలిచింది 
మానవులంతా ఒకటని చాటే 
మరోప్రపంచం పిలిచింది 
॥అరుణ॥

బుఱ్ఱకథ

కార్మికుల బుఱ్ఱకథ 
చిత్రం: కథానాయకురాలు (1970)
సంగీతం: ఆకుల అప్పలరాజ్
రచన: సుంకర సత్యనారాయణ
గానం: సుశీల & బృందం

తక తా తకిటతక, తరికిట, తరికిట తా
కార్మిక సోదర ప్రజలారా ఓ కష్టజీవులారా!
వంత: వినరా కార్మిక వీరకుమార! విజయము మనదేరా
కార్మికులోడ్చే చెమటకు ఖరీదు కట్టువాడు లేడు
వినరా కార్మిక వీరకుమార! విజయము మనదేరా
అందరు కలిసి చేసే పనికొక అందమున్నదోయి 
ఓహో
కొందరి సౌఖ్యానికి చేసే పని ఘోరనరకమోయి
అయ్యా ఘోరనరక మోయి

మోసగించబడి కాసుకులోబడి (తందాన తందానె తందాన)
ఇన్ని నీళ్ళు సేవించి బుర్ర చెడి (తందాన తందానె తందాన)
మనలో మనకే కలతలు పెంచీ (తందాన తందానె తందన)
అయిన వాళ్ళకే హాని జేసెడి (తందాన తందానె తందాన)
దిక్కుమాలిన బ్రతుకది ఎందుకు ముక్కు మూసుకోరా
ఓయ్ వినరా కార్మిక వీరకుమార! విజయము మనదేరా
తరిగిట ఝంతరి తా...