January 19, 2020
పడిపోతున్నా నీ మాయలో
పడిపోతున్నా నీ మాయలో
టైటానిక్ (2016)
సంగీతం: వినోద్ యాజమాన్య
గానం: శ్రేయా ఘోషాల్
పడిపోతున్నా...నీ మాయలో
పలుకయ్యానా...నీ గుండెలో
కదిలొస్తున్నా.. నీ దారిలో
కలువయ్యానా...నీ చూపులో
సగమై నాలో నువ్వే చేరి
జతవై జగమై నడిపించావే
ఏదో ఏదో ఆశా...ఆశా
ఈ ఊపిరీ నీదనీ...నింసారే నింసారే
నింసారే నింసారే
నీ తోడై ఉంటాలే
పడిపోతున్నా నీ మాయలో
పలుకయ్యానా నీ గుండెలో
చరణం 1:
అరిచేతిరేఖల్లాగా దాచేసుకుంటా నిన్ను
ఆరక్షణం కాలం కూడా అద్భుతం నీతో నాకు
ఎంతో కొంతా నాలో నన్నే ఉంచీ
నువ్వే వేరై పోతే నేనే నీరై పోతున్నా
నిజంగా నీకు నీడగా నడిస్తే చాలునందిగా
ప్రపంచం చూడనంతగా మనస్సే బానిసైందిగా
నీలో నన్నే నింపేయనా
ఈ ఊపిరీ నీదనీ...
నింసారే నింసారే
నింసారే నింసారే
నీ నీడై వస్తాలే
పడిపోతున్నా నీ మాయలో
పలుకయ్యానా నీ గుండెలో
చరణం 2:
బ్రతుకెంత బావుంటుందో బ్రతుకంత నీతో ఉంటే
పొరపాటుగైనా నన్ను మరిచావో మన్నవుతాలే
నిన్నే చూస్తూ ఉంటే చాలంటుందే కన్ను
చాల్లే అంటూ నువ్వే కవ్విస్తున్నావే
ఇలా ఏడేడు జన్మలూ వరించే తోడునవ్వనా...
అలా నీగుండె గూటిలో ధ్వనించే రాగమవ్వనా...
ప్రాణం నేడే పాడే గానం
ఈ ఊపిరీ నీదనీ...
నింసారే నింసారే
నింసారే నింసారే
నా గమ్యం నువ్వేలే
పడిపోతున్నా నీ మాయలో
పలుకయ్యానా నీ గుండెలో