యవ్వన మధువనిలో
చిత్రం : బంగారు పాప (1954)
సంగీతం : ఓగిరాల రామచంద్రరావు
గీతరచయిత : దేవులపల్లి కృష్ణశాస్త్రి
నేపధ్య గానం : ఏ.ఎమ్.రాజా, సుశీల
పల్లవి:
ఓహో ఓ ఓ ఓ ఓ
యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
ఉయ్యాల.. జంపాల.. ఉయ్యాల... జంపాల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
ఉయ్యాల...జంపాల.. ఉయ్యాల... జంపాల
చరణం 1:
బ్రతుకే ఎలమావితోట మదిలో మకరందపు తేట
బ్రతుకే ఎలమావితోట మదిలో మకరందపు తేట
అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట
ఆ.. ఆ.. ఆ.. అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట
ఉయ్యాల.. జంపాల.. ఉయ్యాల.. జంపాల
ఉయ్యాల జంపాల
చరణం 2:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అలనల్లన నా మదిలోన పలికే బంగారు వీణ
అలనల్లన నా మదిలోన పలికే బంగారు వీణ
నులిమెత్తని అంగులిహాని ఈ తీగలు మీటెను గాని
నులిమెత్తని అంగులిహాని ఈ తీగలు మీటెను గాని
ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఆ ఆ ఆ ఆ
ఉయ్యాల... జంపాల.. ఉయ్యాల.. జంపాల