నాదం నీ దీవనే
చిత్రం : రాగమాలిక (1982)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి
పల్లవి :
నాదం నీ దీవనే.. నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే.. పలుకే పాలూరదా...
ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే... నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే... పలుకే పాలూరదా ... ఓ..
పువ్వే వికసించదా
నాదం నీ దీవనే...
చరణం 1 :
అమృతగానం ఈ అనురాగం.. నదులు జతిగా పాడునే
నదిని విడిచే అలను నేనై ఎగసి ముగిసిపోదునే
కన్నుల మౌనమా.. కలకే రూపమా
దాచకే మెరుపులే.. పన్నీర్ మేఘమా
మరుమల్లె పువ్వంటి మనసే.. తొలిసారి విరిసే
నాదం నీ దీవనే
చరణం 2 :
కోయిలల్లే నాద మధువే పొందకోరే దీవినే
నిదురపోని కనులలోని కలలు మాసిపోవునే
కోవెల బాటలో.. పువ్వుల తోరణం
ఎంతకూ మాయని... తియ్యని జ్ఞాపకం
వెన్నెల్లో అల్లాడు కమలం... విధి నాకు విరహం
నాదం నీ దీవనే.... నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే....
పలుకే పాలూరదా... ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే