January 1, 2020

మనిషిని చూశాను


మనిషిని చూశాను
తల్లిదండ్రులు (1970)
ఆత్రేయ,
ఘంటసాల,జానకి

మనిషిని చూశాను
ఒక మంచి మనిషిని చూశాను
మనసు నిద్దుర లేచింది
మమత దగ్గర లాగింది
మానవత్వం ఉంది ఉందని
లోన ఏదో పలికింది
మనిషిని చూశాను
మనిషిలో మృగమును చూశాను
మనసు వికలమై పోయింది
మమత వికటమై తోచింది
మానవత్వం లేదు లేదని
లోన ఏదో అరిచింది

మమతే మనసులు కలిపేది
మనసే మనిషిని తెలిపేది
మనసు మమత లేదనుకుంటే
మనుగడ ఒకటే బీడయ్యేది
మహాత్ములందుకే వెలిశారు
మానవతనే బోధించారు

స్వార్ధమే నేడు ఏలుతున్నది
త్యాగమూర్తులను తరుముతున్నది
ధనమే ఆన్నిట గెలుస్తున్నది
మనసును మమతను కోలుస్తున్నది
మంచికి ఎక్కడా తావేలేదు
మనిషి మనిషిగా లేడీనాడు

మానవుడెదుగుతూ ఉన్నాడు
దేవునికెదురై నిలిచాడు
తన ఇల్లూవాకిలి ఎల్లలుదాటి
విశ్వ మానవుడు తానైనాడు
పెరిగిన హృదయమే దేవాలయము
ప్రేమే దానికి ధ్వజారోహణము