చిత్రం: చిల్లర దేవుళ్ళు (1977)
గానం: సుశీల
రచన: ఆత్రేయ
సంగీతం: కె. వి. మహదేవన్
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా
గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా
గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
భారతీసతివయ్యు బ్రహ్మకిల్లాలివై
పార్వతీదేవివై పరమేశురాణివై
భారతీసతివయ్యు బ్రహ్మకిల్లాలివై
పార్వతీదేవివై పరమేశురాణివై
పరగ శ్రీలక్ష్మివయ్యూ గౌరమ్మ
భార్యవైతివి హరికినీ
||శ్రీలక్ష్మి నీ మహిమలు||
ఎన్నెన్నొ రూపముల ఏడేడు లోకముల
ఉన్న జనులకు కోర్కెలన్ని సమకూర్చుచూ
ఎన్నెన్నొ రూపముల ఏడేడు లోకముల
ఉన్న జనులకు కోర్కెలన్ని సమకూర్చుచూ
కన్నతల్లీ వైతివి గౌరమ్మ కామధేనూ వైతివి
||శ్రీలక్ష్మి నీ మహిమలు||
బంగారుపువ్వులూ బతుకమ్మలని పేర్చి
మంగళంబని నిన్ను మధ్యనా నిల్పియు
బంగారుపువ్వులూ బతుకమ్మలని పేర్చి
మంగళంబని నిన్ను మధ్యనా నిల్పియు
రంగు గుమ్మడిపువ్వులూ గౌరమ్మ
రాశిగానర్పింతురూ
||శ్రీలక్ష్మి నీ మహిమలు||
నూటొక్క పూవులా కోటి నోములు నోమి
నీటుగా కాంతలు ఆటపాటలతో
నూటొక్క పూవులా కోటి నోములు నోమి
నీటుగా కాంతలు ఆటపాటలతో
మాటికీ నిను మెప్పుగా గౌరమ్మ
మంగళంబులు పాడగా
||శ్రీలక్ష్మి నీ మహిమలు||