January 1, 2020

బృందావనమాలి రారా

బృందావనమాలి రారా
చిత్రం: తప్పు చేసి పప్పు కూడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
గానం:  కె.జె.యేసుదాసు , కె.ఎస్.చిత్ర

సమగమ సమాగమగసదా నీ సా
గమదని సమగస నిసదని మదగమ
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా
వీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టంలేరా
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
సరి సరి నటనలతో సరాగం హాయిగ సాగాలి
 సిరి సిరి మువ్వలతో చిత్రంగా చిందులు వేయాలి
మెరుపుల తీగలతో భుజాలే చనువుగ కలపాలి
ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి
పదపదమంటూ పట్టే పట్టి ప్రేమలొ ఉట్టి కొల్లగొట్టి పోరా
పరవశమవుతూ పైట చెంగు పాల దొంగకప్పగించుకోనా
 ముద్దుల జాణ ముందుకు రాగా మీగడ బుగ్గల నిగ్గులు దోచగ
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి
మురళిని మురిపెముగా మురారి మరిమరి ఊదాలి
యమునా కెరటములా నువ్వే నా యదనే తాకాలి
వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి
గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరనందుకోరా
గలగలమన్న గాజులున్న కన్నె చేతి వెన్నముద్దనీనా
మీటగ రారా యవ్వన వీణ మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగ
బృందావనమాలి... ఆ...
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి