January 27, 2020

తల్లిని మించి ధారుణి

తల్లిని మించి
చిత్రం: అభిమానం (1960)
రచన: శ్రీశ్రీ
సంగీతం: ఘంటసాల
గానం: జిక్కి

పల్లవి:

తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా
చల్లనితల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా

తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా
చల్లనితల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా
చరణం 1:

చేరగ వచ్చే లేగను చూచి కోరిక తీరగా
దరి చేరగ వచ్చే లేగను చూచి కోరిక తీరగా
కడు తియ్యని పాలు తాగించి మురిసే
గోమాత మా జననీ....

తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా
చల్లనితల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా

చరణం 2:

తీగెలనిండి పూచిన మల్లి పువ్వుల తావితో
ఎల తీగెలనిండి పూచిన మల్లి పువ్వుల తావితో
అనురాగములొలికే, ఆనందమొసగే
భూమాత మా జననీ

తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా
చల్లనితల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా

చరణం 3:

ఇంటను వెలసి, కంటను మెరిసే ఈ తులసీసతీ
మా యింటను వెలసి, కంటను మెరిసే ఈ తులసీసతీ
కలకాలము బ్రోచే కష్టాలు మాపీ పాలించు మా జననీ

తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా
చల్లని తల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా...
చల్లని తల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా...