January 1, 2020

అపరంజి మదనుడే

అపరంజి మదనుడే
చిత్రం : మెరుపుకలలు (1997)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : అనురాధా శ్రీరామ్

అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే
వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చె వలపంటి వాడే
వినువీధిలో ఉంటె సూర్యుడే ఓడునే ఇల మీద ఒదిగినాడే
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే
అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే..
అతడేమి అందగాడే
పోరాట భూమినే పూదోట కోనగా పులకింపజేసినాడే.. 
పులకింపజేసినాడే
కళ్యారిమలనేలు కలికి ముత్యపురాయి కన్నబిడ్డతడులేవే
నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే
ఇరుకైన గుండెల్లో అనురాగమొలకగా నెలబాలుడొచ్చినాడే
ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై
అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే..
అతడేమి అందగాడే
వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చె వలపంటి వాడే..
 వచ్చె వలపంటి వాడే
అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే..
అతడేమి అందగాడే
వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చె వలపంటి వాడే..
వచ్చె వలపంటి వాడే