Showing posts with label ద్వారం వెంకటస్వామి నాయుడు. Show all posts
Showing posts with label ద్వారం వెంకటస్వామి నాయుడు. Show all posts

దేశమును ప్రేమించుమన్నా

గురజాడ అప్పారావు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను కార్యోన్ముఖుల్ని చేస్తుంది. ఈ ప్రముఖ గేయానికి ద్వారం వెంకటస్వామి నాయుడు స్వరాలను కూర్చారు. దీనిని కృష్ణా పత్రిక 1913 ఆగస్టు 9 తేదీన ప్రచురించింది. అందులోని కొంత భాగాన్ని ఇద్దరు పేరెన్నికగన్న గాయనీమణులు గానం చేసారు.

గానం: టంగుటూరి సూర్యకుమారి

గానం: శ్రీరంగం గోపాలరత్నం

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయీ...