January 31, 2020

ఆగక మనసు ఆగక


ఆగక మనసు ఆగక
అభిసారిక (1990)
సాలూరి వాసూరావు
దాసరి
ఏసుదాస్

ఆగక మనసు ఆగక
పోవక నిదుర పోవక
ఆగక మనసు ఆగక
పోవక నిదుర పోవక
ఎవరికోసం ఎదురుచూపు
దేనికమ్మా బెదురు చూపుతెలుపవా తెలుపవా అభిసారికా...
అభిసారిక...అభిసారిక...అభిసారిక...
ఆగక మనసు ఆగక
పోవక నిదుర పోవక

చరణం 1:

మండువేసవి...నడి ఎడారి
బాటసారి
ముందు పయనము
నీడ కోసము
నిండుపున్నమి...పండువెన్నెల
నీలిమేఘం
నింగి పయనము
నీటి కోసము
రేయి పగలూ మారుతున్నా...
కాలచక్రము తిరుగుతున్నా..

ఎవరికోసం ఎదురుచూపు
దేనికమ్మా బెదురు చూపు
తెలుపవా తెలుపవా అభిసారికా...
అభిసారిక...అభిసారిక...అభిసారిక...
ఆగక మనసు ఆగక
పోవక నిదుర పోవక

చరణం 2:

పెనుతుఫాను
నడిసముద్రము
నింగికెరటం
ఓడ పయనము
ప్రాణ నష్టము
ప్రేమవాకిలి
ముందు నిలబడి
ఎదురుచూసే
మనసు పయనము
మనిషి కోసము
లోకమంతా పిచ్చి అన్నా
కాకులల్లే పొడవనున్నా

ఎవరికోసం ఎదురుచూపు
దేనికమ్మా బెదురు చూపు
తెలుపవా తెలుపవా అభిసారికా...
అభిసారిక...అభిసారిక...అభిసారిక...
ఆగక మనసు ఆగక
పోవక నిదుర పోవక
ఆగక మనసు ఆగక
పోవక నిదుర పోవక