Showing posts with label స్మిత. Show all posts
Showing posts with label స్మిత. Show all posts

మన్నేల తింటివిరా కృష్ణా


మన్నేల తింటివిరా కృష్ణా
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: టిప్పు , స్మిత, కళ్యాణి మాలిక్

శ్రీ కనకమహాలక్ష్మికీ.... జై
శ్రీ సింహాచలం నరసింహస్వామికీ... జై
శ్రీ అన్నారం సత్యన్నారాయణస్వామికి... జై
శ్రీ రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజశ్రీ
పసలపూడి పంకజం గారి
పరమకళా రసిక నాట్యమండలికీ.... జై

ఎవరైనా చూసుంటారా



ఎవరైనా చూసుంటారా
అనుకోకుండా ఒకరోజు (2005)
స్మిత
సిరివెన్నెల
కీరవాణి

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజు నేనై కోటి గుండెల కోటల్ని

చరణం 1

రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పోంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్నో
కురిపిస్తాయంటే అంతే
అది నిజమోకాదో తేలాలంటే
చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా

చరణం 2

చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కధ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడ తలవంచేలా
మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా