Showing posts with label ఇమాన్. Show all posts
Showing posts with label ఇమాన్. Show all posts

చిన్నారి తల్లి


చిన్నారి తల్లి
విశ్వాసం (2019)
రచన:రామజోగయ్య శాస్త్రి
సంగీతం:ఇమాన్
గానం: సత్య ప్రకాష్

చిన్నారి తల్లి
చిన్నారి తల్లి
నా నింగి జాబిలి..
నీ వెన్నెలంది, వెలుగొందుతోంది
నా గుండె లోగిలి..
నీ ఊసులోనే ముసురాడుతోంది
ఈ నాన్న ఊపిరి…
కాలాలు దాటి యేనాటికైనా
చేరాలి నీ దరి
ఎన్నాళ్ళు ఉన్నానంటే
ఉన్నానంటూ ఏకాకి మాదిరి
ఆరారి రారో

కను చివరన జారే
తడి చినుకును సైతం
సిరితళుకుగ మార్చే చిత్రం నీవే
కలతగ పొలమారే
ఎద మంటల గ్రీష్మం
సులువుగు మరిపించే
మంత్రం నీవే
నువ్వంటె నా సొంతమంటూ
పలికిందీ మమకారం
ఆ మాట కాదంటు దూరం
నిలిపిందీ అహంకారం
తలవాల్చి నువ్వలా..
వడిలోన వాలగా
నిండు నూరేళ్ళ లోటు తీరిపోద
అదే క్షణానా

నిదురించు వేళ నీ నుదుట
నేను ముత్యాల అంజలి
జోలాలి పాడి తెరిచాను చూడు
స్వప్నాల వాకిలి
ఏ బూచి నీడ నీపై
రానీకుండ నేనేగ కావలి
ఆరారి రారో