Showing posts with label సాధనా సర్ గమ్. Show all posts
Showing posts with label సాధనా సర్ గమ్. Show all posts

జాజిమల్లీ తోటలోనా


జాజిమల్లీ తోటలోనా
చిత్రం: నిను చూడక నేనుండలేను (2002)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కులశేఖర్
గానం: సాధనా సర్‌గమ్ 

పల్లవి:

జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరువంకా
జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే 
ఉన్నమాట చెప్పలేనే 
ఈ లాహిరిలో

జాజిమల్లీ తోటలోనా
జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరుమైనా
జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే 
ఉన్నమాట చెప్పలేనే 
ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా


మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
చిత్రం : మున్నా (2007)
సంగీతం : హారిస్ జయరాజ్
రచన : కందికొండ
గానం : సాధనా సర్ గమ్, నరేష్ అయ్యర్, క్రిష్ , హరిచరణ్

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

పలికే గోరింకా చూడవే నా వంక



పలికే గోరింకా....
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
రచన: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: సాధనా సర్గమ్

పలికే గోరింకా చూడవే నా వంక 
ఇక వినుకో నా మది కోరికా
పలికే గోరింకా చూడవే నా వంక 
ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి నా దీపావళి పండగ
నేడే రావాలి నా దీపావళి పండగ
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితే రోజా నేడే పూయులే

నిన్నేనా.. నేను చూస్తుంది నిన్నేనా...


నిన్నేనా.. నేను
సెల్యూట్ (2008)
హారిస్ జయరాజ్,
సాధనా సర్ గమ్

నిన్నేనా.. నేను చూస్తుంది నిన్నేనా...

నిన్నేనా.. నేను చూస్తుంది నిన్నేనా..
నువ్వేనా.. నువ్వులా ఉన్న ఎవరోనా..
కోపంలో నిప్పులకొండలా..
రూపంలో చుక్కలదండలా..
నవ్వులో చిలకమ్మలా..
చిన్నారుల చేతికి బొమ్మలా..
ఇంతకీ నువ్ ఒకడివా వందవా…
ఎంతకీ నువ్ ఎవరికీ అందవా..

నిన్నే నిన్నే వలచినది


నిన్నే నిన్నే
చిత్రం: రక్షకుడు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: సాధనా సర్గమ్, కె.జె.యేసుదాసు

నిన్నే నిన్నే వలచినది
అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది
మనసునే మరచినది
కన్నుల కరిగిన యవ్వనమా
ఒంటరి బ్రతుకే నీదమ్మా
నిన్నటి కధలే వేరమ్మా

నిన్నే నిన్నే పిలచినది
అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది
మనసునే మరచినది

చరణం: 1

పువ్వా పువ్వా నీ ఒడిలో
ఒదిగిన క్షణం ఎక్కడే
కలిగిన సుఖం ఎక్కడే
అభిమానంతో తలవంచిన
ప్రేమకి చోటెక్కడే
నిలిచితి నేనిక్కడే
కళ్ళల్లోనే ముళ్ళుంటే
కనులకి నిదరెక్కడే
వలచినవారే వలదంటే
మనిషికి మనసెందుకే
నిన్నటి వలపే నిజమని నమ్మాను
నిజమే తెలిసి మూగబోయి ఉన్నాను

నిన్నే నిన్నే పిలచినది
అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది
మనసునే మరచినది
కళ్ళలోని ఆశా కరగదులే
కౌగిలిలోనే చేర్చులే
నిన్నటి బాధ తీర్చులే
నిన్నే నిన్నే...
నిన్నే నిన్నే...
నిన్నే నిన్నే

చరణం: 2

ప్రేమా ప్రేమా నా మనసే
చెదిరిన మధువనమే
వాడెను జీవితమే
విరహమనే విధి వలలో
చిక్కిన పావురమే
మరచితి యవ్వనమే
కలలోనైనా నిన్ను కలుస్తా
ఆగనులే ప్రియతమా
లోకాలన్ని అడ్డుపడినా
వీడను నిను నేస్తమా
చీకటి వెనుకే వెలుగులు రావా
భాధే తొలిగే క్షణమగుపడదా

నిన్నే నిన్నే పిలచినది
అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది
మనసునే మరచినది
కళ్ళలోని ఆశా కరగదులే
కౌగిలిలోనే చేర్చులే
నిన్నటి బాధా తీర్చులే
నిన్నే నిన్నే...
నిన్నే నిన్నే...
నిన్నే నిన్నే

నీకు మనసిస్తా....


నీకు మనసిస్తా....
ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2003)
వేటూరి
ఆనంద్-మిలింద్
అభిజిత్, సాధనా సర్ గమ్

పని పమగ పస పని పమగ పస
లాలల ల లల్లా లాలల ల లల్లా

నీకు మనసిస్తా....
నిన్ను పెనవేస్తా
కన్ను చిటికేస్తే....
 కౌగిలికి వస్తా
చెలీ వస్తావా
చెలాయిస్తావా...
ఓ ప్రియా నీ దయా
దిల్ దేదియా

నీకు మనసిస్తా.... మాట కలిపేస్తా
కన్నె వయసిస్తా..... కౌగిలికి వస్తా
మొరాలిస్తావా.... వరాలిస్తావా...
ఈ ప్రియా నీదయా
దిల్ దేదియా

నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా....

చరణం 1:

నే ఆగలేకా... నీ దారి కాస్తా
నా ప్రేమ లేఖా...నీ పేర రాస్తా
వేసంగి ఎండలో... నా నీడ నీ జతా
సీతంగి మంచులో... నీ తోడు కోరుతా
నీనుకీ... నేనుకీ... మారదీ కథ

నీకు మనసిస్తా.... మాట కలిపేస్తా
కన్నె వయసిస్తా.... కౌగిలికి వస్తా
చెలీ వస్తావా... చెలాయిస్తావా
ఓ ప్రియా నీ దయా... దిల్ దేదియా

నీకు మనసిస్తా మాట కలిపేస్తా

చరణం 2:

కాలాలు దాటే... కలలు పండిస్తా
పన్నీరు మీదా... పూల పడవేస్తా
పున్నాగ పూలతో... సన్నాయి పాడుతా
వెన్నెల్ల తోటలో... నా రేయి పంచుతా
జన్మకీ.... ప్రేమకీ.... ఒక్కటే కథ...

నీకు మనసిస్తా
నిన్ను పెనవేస్తా
కన్నె వయసిస్తా....
కౌగిలికి వస్తా
మొరాలిస్తావా....
చెలాయిస్తావా
ఈ ప్రియా...
నీ దయా ...
దిల్ దేదియా