January 1, 2020

ఆలయమేలా


ఆలయమేలా...
సతీ అనసూయ (1971)
రాజశ్రీ,
సుశీల,
ఆదినారాయణరావు

ఆలయమేలా? అర్చనలేలా? ఆరాధనలేలా?
పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా! అదే పరమార్థము కాదా

ఏ కొండ కొమ్ముపైనో ఏ రాతి బొమ్మలోనో
దైవమ్ము దాగెనంటూ తపియించ నేలా
ఆ దైవము నిజముగ ఉంటే - అడుగడుగున తానై ఉంటే
గుడులేల? యాత్రలేలా?పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం
మదిలోన వెలిగే అందం గమనించునా
ఈ లోకులతో పనియేమి! పలుగాకులు ఏమంటేమీ!
నా స్వామి తోడురాగా

ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా
ఆరాధనలేలా ఆరాధనలేలా