Showing posts with label సముద్రాల జూనియర్. Show all posts
Showing posts with label సముద్రాల జూనియర్. Show all posts

మనవి సేయవే...


మనవి సేయవే...
రేచుక్క-పగటిచుక్క (1959)
సముద్రాల రామనుజాచార్య (జూనియర్)
టి.వి.రాజు
ఘంటసాల

మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ
మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ
మనవి సేయవే

రావే ప్రేమలతా..


రావే ప్రేమలతా..
పెళ్ళి సందడి (1959)
సంగీతం::ఘంటసాల వేంకటేశ్వరరావు
రచన::సముద్రాలరామానుజాచార్య(జూనియర్)
గానం::ఘంటసాల,రావు బాలసరస్వతి

ఆహా..చూపుల తీపితో
కొసరుచున్..దరిజేరీ
మనోజ్ఞ గీతికా..ఆ
లాపన సేయు..కూర్మి జవరాలొకవైపు
మరొక్కవైపునన్..ఈ పసికమ్మతెమ్మరెలు
ఈ పువుదోటల శోభాలున్నచో..ఓఓ
రేపటి ఆశ..నిన్న వెతలేతికి
నేటి సుఖాలతేలుమా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ

పదపదవె వయ్యారి గాలిపటమా

పదపదవె వయ్యారి
చిత్రం: కులదైవం (1960)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: సముద్రాల (జూ)
నేపధ్య గానం: ఘంటసాల, జమునారాణి

పల్లవి:

పదపదవె వయ్యారి గాలిపటమా
పదపదవె వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా
పదపదవె వయ్యారి గాలిపటమా

చరణం 1:

ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా

ఓ... ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
నీ తళుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా

పదపదవె వయ్యారి గాలిపటమా
పదపదవె వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవె వయ్యారి గాలిపటమా

చరణం 2:

నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక...

ఆ... నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక..
రాజులెందరూడినా మోజులెంత మారినా
తెగిపోక నిలిచె నీ తోక

పదపదవె వయ్యారి గాలిపటమా
పదపదవె వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవె వయ్యారి గాలిపటమా

చరణం 3:

అహ..హ..అహ..హా..అహ..హా...
అహ..హ..అహ..హా
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో ...ఓ...

నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో ...ఓ...

వగలాడివిలే జగదంతవులే
దిగిరాకుండా ఎటులుందువులే

పదపదవె వయ్యారి గాలిపటమా
పదపదవె వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవె వయ్యారి గాలిపటమా

కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే

కమ్ కమ్ కమ్
కంగారు నీకేలనే
చిత్రం : శాంతినివాసం (1960)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల
గానం : ఘంటసాల, జిక్కి

కమ్ కమ్ కమ్
కంగారు నీకేలనే
నావంక రావేలనే
చెలి నీకింక సిగ్గేలనే

నో నో నో
నీ జోరు తగ్గాలిగా
ఆ రోజు రావాలిగా
ఇక ఆపైన నీ దానగా
నో నో నో

కోరి ఏనాడు జతచేరి ఎగతాళిగా
చేరువైనామో ఆనాడే జోడైతిమే
కోరి ఏనాడు జతచేరి ఎగతాళిగా
చేరువైనామో ఆనాడే జోడైతిమే
ఇంత స్నేహానికే అంత ఆరాటమా
చాలులే తమరికి ఏలా ఈ తొందర

నో నో నో
నీ జోరు తగ్గాలిగా
ఆ రోజు రావాలిగా
ఇక ఆపైన నీ దానగా
నో నో నో

ఏల ఈ లీల పదిమందిలో పాటలా
పరువు మర్యాదలే లేని సయ్యాటలా
ఏల ఈ లీల పదిమందిలో పాటలా
పరువు మర్యాదలే లేని సయ్యాటలా
నీవు నా దానవై నేను నీ వాడనై
నీడగా నిలచినా చాలులే నా చెలి

కమ్ కమ్ కమ్
కంగారు నీకేలనే
నావంక రావేలనే
చెలి నీకింక సిగ్గేలనే

నో నో నో
నీ జోరు తగ్గాలిగా
ఆ రోజు రావాలిగా
ఇక ఆపైన నీ దానగా
నో నో నో

సతీసావిత్రి ఎపిసోడ్


సతీసావిత్రి ఎపిసోడ్
చిత్రం : ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సముద్రాల జూనియర్   
గానం : ఘంటసాల, ఎం.ఆర్.తిలకం

ఎవరీ దివ్యమూర్తి చూడగ నా పతి ప్రాణముల్
గొనిపోవచ్చిన యమమూర్తి వలె నున్నాడే

ఓహోహోహో.. ఏమి ఆశ్చర్యమూ
భహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క
అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు
ఈ అన్నుల మిన్నకెటుల గానుపించె ఐనను ప్రకాశముగా

సావిత్రీ ! మానినీ ఆహ్హ్హహ్హహ్హహ్హహ్హహ్హ
నిర్నిమిత్త సందేహడోలాయ మానసవై
ఏల అట్లు దిగాలున చూచుచుంటివి
సామాన్య మనీషాగోచరంబైన
మద్రూప విశేషంబు గాంచియే
నేనెవ్వరో యూహించి ఉండజాలుదువు
ఐనను వచించెద

క్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పానుపు
ఒరిగినా ఒక ప్రక్క కొరుగుగాక
వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు
నాలుగు మూడైన అగునుగాక
పరమేశ్వరుని దివ్య ప్రళయతాండవమందు
తాళము తప్పిన తప్పుగాక !
చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణ
పలికినా అపశృతుల్ పలుకుగాక

సకల లోకాల ధర్మశాసనము నమలు
చేసి విధి వ్రాయు ఆయువు చెల్లగానె
వేళ తప్పక ప్రాణాలు వెలికిదీసి
మోసికొని పోవుచుండు యముండ - అబలా !
సావిత్రీ ! ఇదిగో నీ పతి ప్రాణంబుల్ గొనిపోవుచున్నాడ

అయ్యో ! అయ్యో ! ఆ!
నాథా ! నాథా !

హ్హహ్హహ్హ మహిషరాజమా మరలుము
 
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా !
సుంతయేని కరుణ మాని
సుంతయేని కరుణ మాని
కాంతుని ప్రాణములను గొని
పోవుచున్నావా !

ఆహా ! ఏమీ ఈ సాధ్వీలలామ సాహసము
దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతముశైవించి
నన్ననుసరించు ఈమె స్థైర్యము సంస్తవనీయమైననూ..
అహో.. నిష్ప్రయోజనమే... కనుక.. చెప్పి చూచెదను గాక

కాలు మోపిన చాలు కస్సని అరికాలు
కోసుకుపోయెడి కూసురాళ్ళు
అలికిడైనను చాలు అదరి బుస్సున లేచి
పడగెత్తి పైబడు పాపరేళ్ళు
అడుగుపెట్టిన చాలు ఒడలు జిల్లున లాగి
నరములు కుదియించు నదుల నీళ్ళు
గాలి దోలిన చాలు కదలి ఘీ..యని కర్ణ
పుటములు ప్రేల్చెడి ముది వెదుళ్ళు

పులులు సింహాలు శరభాలు పోవ పోవ
కటిక చీకటి కనరాదు కాలిదోవ
మరలిపొమ్మిక విడువుము మగని ఆశ
మాట వినవేల ఓ బేల మరలవేలా..ఆఆ...

పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్
నా వెంట రా తగదు రావలదు రా తగదు రావలదు
పోపోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్
చీమలు దూరని చిట్టడవులలో
కాకులు దూరని కారడవులలో
చీమలు దూరని చిట్టడవులలో
కాకులు దూరని కారడవులలో
లబోదిబోమని అఘోరించినా
లబోదిబోమని అఘోరించినా
ఫలితము సున్న మరలుము మెదలక
పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్

పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా !

ఆహా ! ఏమి ఈ బాల అచంచల మనఃస్థైర్యమూ
దుర్గమ కీకారణ్య సీమలనధిగమించుటయే గాక
మహోన్నత పర్వత శిఖరాగ్రమ్ముసైతమధిరోహించి
నన్ననుసరించుచున్నదే హొహ్హో మరియునూ
మరికొంచెము బెదరించి చూచెదను గాక

చెప్పిన వినవు చెముడా గిముడా
పట్టిన పంతము విడువవుగా
చెప్పిన వినవు చెముడా గిముడా
పట్టిన పంతము విడువవుగా
ఏమనుకొంటివి ఎవడను కొంటివి
ఏమనుకొంటివి ఎవడను కొంటివి
సముండను పాశధరుండను
కాల యముండను ఆహ్హహ్హహ్హహ్హ...
పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్ ఫో..

ఆహో.. ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమా
బేలా సావిత్రీ ఇక మానవ మాత్రులు దాటలేని బాట యిది
గోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు
అరంఘనీయమైన వైతరణి అల్లది

అన్నియునూ తెలిసిన ధర్మ వేదులుమీరు
ఇంత దూరమేతెంచి రిక్త హస్తములతో తిరిగి పొమ్మందురా

మరి ఏమందును... హ్మహుహు ఇదియునూ నిక్కంబు
కనికరించి ఏదైనా ఒక్క వరంబునొసంగి పంపెద
సాధ్వీ నీ కార్యదీక్షతకు కడుంగడు సంతసించితి
నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా
మరొక్క వరంబు కోరుకొనుము ఇచ్చెద

ఈ యముని కర్కశ హృదయంబు
కూడా కరుగుచున్నట్లున్నది
ఇచ్చిన అవకాశమేల జారనీయవలె
స్త్రీలకు పుట్టినింటికన్నను మెట్టినిల్లే
ప్రధానమని కదా ఆర్యోక్తి

యమధర్మరాజా ఆ! రాజ్య భ్రష్టులై అంధులై
కారడవులందు కటకటంబడు మా అత్తమామలకు
  సరియ సరియ రాజ్య ప్రాప్తియూ నేత్ర దృష్టియూ
రెండునూ ఒసంగితిని పొమ్ము

ఆ ! వదలక వచ్చుచున్నదే
ఐనను ఇటువంటి వరంబులెన్ని యొసంగినను
మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా
కనుక మరొక్క వరంబొసంగి లాలించి బుజ్జగించి
ఊరడించి మరలించెద
సావిత్రీ అబలవన్న ఆదరంబున
ఒంటి వరంబొసంగుట పాడికాదని భావంభున
మరొక్క వరంబీయ ఇచ్చగించితీ
అదియును నీ పతి ప్రాణంబు దక్క

ఆ ! ఇప్పుడు దారిన పడినాడు
ఈ అవకాశమును మాత్రమేల పోనీయవలె
కన్నవారి ఋణము తీర్చెద

సమవర్తీ అపుత్రస్య గతిర్నాస్తి అని
అలమటించు నా జనకునకు

ఆ! ఇక చాలు బాబోయ్ అను అటుల
సుతశతంబనుగ్రహించితి
సంతుష్టవై మరలిపొమ్ము

ఒకటి నే కోరితి రెండు నీవిచ్చితి
ముచ్చటగా మూడవ కోర్కె
చెల్లించకుండుట పాడియే ధర్మమూర్తీ

ఊ ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే
ఐనను ఆఖరి కోరికని వాపోవుచున్నది ఇచ్చి పంపెద
సావిత్రీ స్వామీ అడుగుము
అదియును నీ పతి ప్రాణంబు దక్క

సంతానమును చూసియైనను
సంతసించు భాగ్యమును ప్రసాదింపుము
ప్రసాదించితిని పొమ్ము.. ఊ !
ఇంకెక్కడికి పోయెదవు
ఏమీ ! నా పతి ప్రాణంబులీయక
అడుగు వేయలేవు

ఏమీ అడుగువేయలేనా
మహిషరాజమా.. ఊ !..

ఏమాశ్చర్యము దేవాసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష
యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులెత్తి వచ్చిననూ..
విలయ రుద్రుని ప్రళయ తాండావ ఘోష విన్ననూ
నెమరాపక అడుగు తప్పక తలతిప్పక ముందుకు సాగిపోవు
నా మహిషరాజము నేడేలనో తత్తరపాటున బిత్తరపోవుచున్నదే...

హహహహహహహ..

ఊ... నీవు సాధ్వీయే అనుకొంటిని ఇంద్రజాలవు కూడానా

ఇది ఇంద్రజాలము కాదు ధర్మబద్ధమే

 ధర్మబద్ధమా... నాకు తెలియని ధర్మమా
యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా ఎటుల 

అమరులెటులైన సంతాన మందవచ్చు
మనుజ లోకాన సాధ్వులు మగడు లేక
పుత్రసంతాన మేరీతి పొందగలరు
తమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !
తమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !

ఆహా ! పతివ్రతా శిరోమణి యన్న వాత్సల్యంబున వచ్చియుంటిని
కాని ఇంతటి తెలివి గలదని తెలిసి యుండిన నేను రాక నా భటులనే పంపియుండెడి
వాడను కదా గతంబునకు వగచి ప్రయోజనంబేమి కనుక

సాధ్వీ సావిత్రీ నీ పతి భక్తికి సమయస్ఫూర్తికీ
కడుంగడు సంతసించితి ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించుము హహహ

యముడంతవానినే తికమక బెట్టి గెలువజాలిన నీ చరిత చరితార్ధము పతితో చిరకాలము ఇహ సౌఖ్యములనుభవించి తదనంతరంబున నా లోకంబున అహ్హ! కాదు కాదు స్వర్గ లోకంబున జేరి
తరింతురు గాక తరింతురు గాక తరింతురు గాక

చందురుని కలువలతో


చందురుని కలువలతో
ఆశాజీవులు (1962)
విశ్వనాథన్-రామ్మూర్తి
సముద్రాల (జూ)
జానకి

తాం తకధిమి కిటతకి  తరికిట తత్తోం                                       
తాం తకధిమి కిటతకి  తరికిట తత్తోం
తాం తకధిమి కిటతకి తరికిట తత్తోం
తాం తకధిమి కిటతకి  తరికిట తత్తోం
తకిట తక తకిట తకిట తకదిమిత
తకిట తకదిమిత తకిట తకదిమి తరికిట తోం

గామ దపమగ  పాద సనిదప
ఆ .. ఆ .. ఆ .. ఆ .. ఆ ..

చందురుని కలువలతో
చందనపు తావులతో
కుందనపు మేనమరే సుర సుందరిని మేనకను
చందురుని కలువలతో
చందనపు తావులతో
కుందనపు మేనమరే సుర సుందరిని మేనకను

గమప పదప రిగమ మపమ
సరిగ గమగ దని సాదా దాపా
సందెకాంతి సందడిలో
అందమెల్ల రూపుకొనీ
// సందె కాంతి //
అందియల నిను పిలిచే
చెలి ముందు నిలిచే కనరా
// అందియల //
చందురుని కలువలతో
చందనపు తావులతో
కుందనపు మేనమరే సుర సుందరిని మేనకను

 గమప పదప రిగమ మపమ
సరిగ గమగ దని సాదా దాపా
సందియము ఎందులకో
ఇక ఎందులకొ తపసంతా
// సందియము //
పొందులలొ ఆనందం
మా సందిటిలొ కాదటయా
పొందులలో ఆనందం
మా సందిటిలొ కాదటయా
చందురుని కలువలతో
చందనపు తావులతో
కుందనపు మేనమరే సుర సుందరిని మేనకను