Showing posts with label సునీత. Show all posts
Showing posts with label సునీత. Show all posts

నూనూగు మీసాలోడు


నూనూగు మీసాలోడు
యమదొంగ (2008)
కీరవాణి
అనంత్ శ్రీరాం
సునీత, కీరవాణి

డ డ డ డి డి డి డు డు డు డు ...
డ డ డ డి డి డి డు ...
ఊమ్ ...
ఊమ్ ...
ఊమ్ ...
నూనూగు మీసాలోడు ... ఊమ్ ...
నీ ఈడు జోడైనోడు ... ఊమ్ ...
నీ వైపే వస్తున్నాడు ...డు ...
ఊమ్ ...
కళ్ళల్లో కసి వున్నోడు ... ఊమ్ ...
కండల్లో పస వున్నోడు ... ఊమ్ ...
వచ్చేసాడొచ్చేసాడు ...డు ...

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే


ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే
చిత్రం : ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం : కళ్యాణి కోడూరి
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : కళ్యాణి కోడూరి, సునీత

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే
ఆనందాలు పెంచింది

పెదవి దాటని మాటొకటుంది


మనసు చాటున ఎందుకు ఉంది?
తమ్ముడు (1999)
సిరివెన్నెల
గోగుల రమణ
రమణ గోగుల, సునీత.

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది
వినపడదా దాని గొడవ
తలుచుకుని అలసిపోతోందా
కలుసుకునే చొరవ లేదా

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి



నాగమల్లి అప్పడిగింది
ఆది (2002)
చంద్రబోస్
మణిశర్మ
మల్లికార్జున్, సునీత

పల్లవి:

నీ నవ్వుల తెల్లదనాన్ని 
నాగమల్లి అప్పడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ పెదవుల ఎరద్రనాన్ని 
గోరింటాకే అరువడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం

శరణు శరణు శరణం
షిరిడీశాయి (2012)
మేడిచెర్ల
సునీత, మధు బాలకృష్ణ
కీరవాణి

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

సాయీ సాయి శిరిడి సాయి శిరిడి సాయీ
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకలా పాప హరణం
సాయి దివ్య చరణం భాగీరధీ సమానం
సాయి దివ్య చరణం భాగీరధీ సమానం
సాయి దివ్య నామం భవతారక మంత్రం
శరణు శరణు శరణం గురుసాయి శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం

యోగి ఓలే భిక్షాటన చేసి
మా పాలకు జోలిపట్టే భిక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
నీటితోనే జ్యోతులు వెలిగించి
తెరిపించెనులే జ్ఞాన చక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ
రగిలే ధునిలో చేతులు ఉంచి
పసి పాపను ఆదుకున్న ఆత్మబంధువూ
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకలా పాప హరణం

సేవించిన రోగుల దీవించి
వైద్యో నారాయణో హరి అని నిలిచాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది
పునర్జన్మ ప్రసాదించినాడు
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకలా పాప హరణం
తిరగలి విసిరి వ్యాధిని కసిరి
ఆపదనే తప్పించిన దీనబంధువు

శరణు శరణు శరణం గురుసాయి శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం

ఎక్కడయ్యా సాయి ఎడనున్నావోయీ
నడవలేకున్నాను ఎదురుపడవోయీ
నిను చూడందే నా మనసు కుదుటపడదాయె
ఎప్పుడు చూసినా ఆత్మధ్యానమే కానీ
నీ ఆకలే నీకు పట్టదా
ఏ జన్మ బంధమో మనది ఏనాటి రుణమో ఇది
పట్టవయ్యా సాయి

ప్రతిరూపం తన ప్రతిరూపమని
యుగాలకే మోక్షమిచ్చే మౌని
పెను తుపాలే విరుచుకుపడగా
బీతిల్లిన ప్రజలే పరుగులిడగా
ఆగిపోమ్మని ఆజ్ఞపించినా
గోవర్థన గిరిధారి షిరిడి పుర విహారీ

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయీ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ

కుడికన్ను అదిరెనే


కుడికన్ను అదిరెనే
చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: పార్థసారథి (ఈ పాటకు మాత్రమే)
సాహిత్యం: కె.విశ్వనాథ్
గానం: బాలు, సునీత

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు

మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
చాలుచాలాయె చెలి బుగ్గలకు
ఆఆఆ..చాలుచాలాయె చెలి బుగ్గలకు
చెలువంపు గాటున చెక్కినందుకు

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన

తెలుపరే భానునికి తెలవారలేదనీ
తెలుపరే భానునికి తెలవారలేదనీ
పులిసినమేనా కొలది పవళించినందుకు
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన

స స గ రి ని ద మ ద ని ని ని ద ని స
గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద
సా... ని ద మ గ రి స
ద ని స ద ని స ద ని స ద ని స

తీయకే...ఆఆఆఆఅ.... ఆ గడియ ఆఆఆఆఅ
తీపిఘడియలు వేలు మ్మ్..మ్.మ్.మ్.మ్...
తిరునాధు కౌగిలిని కాగువరకు
సాయకే...ఏ.. ఆ మేను...
సాయకే ఆ మేను సరసాల సమయాలు
సరిగంచు సవరించి సాగువరకూ

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు

ఇదిగిదిగో నా రాముడు

ఇదిగిదిగో నా రాముడు
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
సునీత
భారవి

ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు

ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే

పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాళ్ళివే
దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే

ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి
మరి నా రామునికీడ నిలువనీడ లేదిదేమి
నిలువ నీడ లేదిదేమి

హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి

హాయి హాయి
చెన్నకేశవ రెడ్డి (2002)
సంగీతం: మణిశర్మ
గానం: బాలు, సునీత
రచన: వేటూరి

హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లి కజ్జాలోయి గీర ఎక్కి ఉన్నావోయి
పలుకు బడాయి నా జతకు పరాయి
తోడు నువ్వు లేకపోతే తోచదోయి
తోడి రాగం పాడుతుంటె నచ్చదోయి

దాని పేరు l o v e తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనోయి తకదిన్న తకదిన్న తందాన
గిల్లి గిల్లి కజ్జాలోయి గీర ఎక్కి ఉన్నావోయి
పలుకు బడాయి నా జతకు పరాయి
హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి ఇది వలపు జుదాయి

కొట్టే కన్ను పెట్టే నిన్ను నాలో దాచుకున్నానె
అద్దమంటి అందాలోయి తకదిన్న తకదిన్న తందాన
అంటుకుంటె ఆరట్లోయి తకదిన్న తకదిన్న తందాన
పట్టె పిచ్చి పుట్టె వెర్రి ఇట్టే తోసిపుచ్చాలే
ఒంటిచేతి చప్పట్లోయి తకదిన్న తకదిన్న తందాన
అల్లుకున్న బంధాలోయి తకదిన్న తకదిన్న తందాన
మసకేస్తే మజాల జాతర...పగటేలా ఇదేమి తొందర
మసకేస్తే మజాల జాతర...పగటేలా ఇదేమి తొందర
కూచిపుడి ఆడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
కుర్రదాన్ని ఓడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
దాని పేరు l o v e తకదిన్న తకదిన్న తందాన
దాని పరువు తీయద్దోయి తకదిన్న తకదిన్న తందాన

సిగ్గా ఎర్రబుగ్గ నిన్ను తాకీ కందిపోయింది
ముద్దులింక మద్దెళ్ళేలె తకదిన్న తకదిన్న తందాన
ముళ్ళు పడ్డ ముచ్చట్లోయి తకదిన్న తకదిన్న తందాన
ప్రేమొ చందమామొ నిన్ను చూసీ వెళ్ళిపోయింది
ములక్కాడ ఫ్లూటౌతుందా తకదిన్న తకదిన్న తందాన
ముట్టుకుంటె ముద్దౌతుందా తకదిన్న తకదిన్న తందాన
ఒడి చేరీ వయస్సు దాచకు ...వయసంటూ వసంతమాడకు
ఒడి చేరీ వయస్సు దాచకు ...వయసంటూ వసంతమాడకు
కన్నె మొక్కు చెల్లించేస్తా తకదిన్న తకదిన్న తందాన
చెమ్మచెక్క లాడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
దాని పేరు l o v e తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనోయి తకదిన్న తకదిన్న తందాన

వయస్సునామి


వయస్సునామి
చిత్రం: కంత్రి (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హేమచంద్ర, సునీత

వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమీ
సొగస్సుతోమి ధూముదామి ఆడు తకతైధిమి
ఉమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ
ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి
ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి ఓ
చెక్కిలి చిక్కిన చెక్కరలోయీ
పిల్లో పడిపోయా మాయల లోయలో
పిల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ

చరణం 1:

ఎరక్కపోయి యమయమా ఇరుక్కుపోయా ప్రియతమా
తళుక్కుమన్న తమకమా చిటుక్కుమన్న చిమ చిమ
లేడి వేటకు వేడిగ వచ్చే వేటగాడివి నీవా
వేటకోసం వాడిగ చూసే మాయలేడివి నువ్వే
చనువిచ్చాక మదనా నేనోపగలనా నిన్నాపగలనా

చర్వణం 2:

కొరుక్కుతిందా నేత్రమా చురుక్కు చూపే చైత్రమా
అతుక్కుపోయే ఆత్రమా జతక్కులాసా గ్రోతమా
హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవె భామా
ఒద్దుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా
నిన్ను మెచ్చానె లలనా ఓ ఇందువదనా నీకింతపదునా

వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమీ
సొగస్సుతోమి ధూముదామి ఆడు తకతైధిమి
ఉమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ
ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి
ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి ఓ
చెక్కిలి చిక్కిన చెక్కరలోయీ
పిల్లో పడిపోయా మాయల లోయలో
పిల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ

ఝల్లుమనదా


ఝల్లుమనదా
చిత్రం: మొదటి సినిమా (2005)
సంగీతం: స్వరాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బి చరణ్, సునీత

ఝల్లుమనదా హృదయం
త్రుళ్ళిపడదా సమయం
నమ్మగలదా నయనం నయగారమా
నువ్వేనా నువ్వనుకున్నానా
నిజమేనా ఊహలో ఉన్నానా

ఝల్లుమనదా హృదయం
త్రుళ్ళిపడదా సమయం
నమ్మగలదా నయనం నయగారమా
నువ్వేనా నువ్వనుకున్నానా
నిజమేనా ఊహలో ఉన్నానా

ఐతే నాకోసం నువ్వొక కవిత చెప్పు
ఏ కవిత చెప్పను
ఆ స్వరము నువ్వై - హ హ తరువాత
స్వరమున పదము నువ్వై - హ హ
రాగం గీతం కాదా
ఇది ఆకలి రాజ్యం కాదా హ హ

ఎన్నివేల కలవరింతలొ విన్నవించుకున్నాక
నన్నివేళ పగటికాంతిలొ కలుసుకుంది శశిరేఖా
ఎన్నివేల కలవరింతలొ విన్నవించు కున్నాక
నన్నివేళ పగటికాంతిలొ కలుసుకుంది శశిరేఖా
ఈ సత్యం స్వప్నంలా కరిగేదాకా
మైమరుపే ఆపాలా నిద్దుర రాదా
సందేహం పోతుందేమో
నన్ను నేను గిల్లి చూసుకుంటే

ఆశలెపుడు హంసలేఖలై ఆమెదాక చేరాయో
కాంక్షలెపుడు కుంచె కుదుపులై ఆమె లాగ మారాయో
ఆశలెపుడు హంసలేఖలై ఆమెదాక చేరాయో
కాంక్షలెపుడు కుంచె కుదుపులై ఆమె లాగ మారాయో
చెలి శిల్పం మలిచింది మనసే ఐనా
ఇంతందం తెలిసిందా తనకెపుడైనా
తలపంతా తలవంచింది
కళ్ళముందు ఆమె వచ్చి ఉంటే

ఝల్లుమనదా హృదయం
త్రుళ్ళిపడదా సమయం
నమ్మగలదా నయనం నయగారమా
నువ్వేనా నువ్వనుకున్నానా
నిజమేనా ఊహలో ఉన్నానా

ప్రపంచమా క్షమించుమా

ప్రపంచమా క్షమించుమా
చిత్రం: గిల్లికజ్జాలు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, సునీత

ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా
వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
కాంచన కాంతులభామ నీ కంచెలు తెంచుకు రామ్మా
కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా
ఈ ఏకాంతం మనదే స్నేహమా…
వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా

కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా
జత కుదరని ఎదలకు పెరుగగ ఏదో మంటా
ఎవరెవరికొ ఎద రగిలితే అది మనకేమంటా
కనులడిగిన కలలను తరుముతు పోదామంటా
మనకు మనకు గల ముచ్చట మననెవరు కనని చోటెచ్చట
ముడులు విడని బిగి కౌగిట తగు విడిది మనకు దొరికేనట
మరి ఆలస్యం ఇంకా ఏంటటా…
ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా

తెరమరుగున నిలువక చొరవగ రారమ్మంటా
అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా
కలవరపడు గుసగుస కబురును విన్నానంటా
మనసెరిగిన వరుసకు సరసనె ఉన్నానంటా
ఉరుము వెనుక జడివానలా ఈ విరహమంత కరిగేదెలా
దిగులు పడకు నువ్వంతలా తొలి వలపు తెగని విరిసంకెలా
మరి దూరంగా ఉంటే ఇంకెలా…

వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
కాంచనకాంతుల భామ నీ కంచెలు తెంచుకు రామ్మా
కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా
ఈ ఏకాంతం మనదే స్నేహమా…

వెన్నెలింత వేడిగా


వెన్నెలింత వేడిగా
చిత్రం: తులసి (2007)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గాయకులు: వేణు, సునీత
రచన: చంద్రబోస్

పల్లవి:

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా!
చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా!

చీకట్లో సూరీడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా
నేలపై మేఘాలూ ఆకాశంలో గోదావరి చేరాయే నువ్వు చూడగా
// వెన్నెలింత //

చరణం 1:

నా పేరే అనుకుంటూ నీ పేరు నేను రాసానే
నా రూపే అనుకుంటూ నీ రూపు నేను గీసానే
తీయంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా ప్రేమంటూ కానే కాదంట
మెత్తంగా కొత్తంగా ప్రేమను మించే పదమింకా మనజంటే కనిపెట్టాలంటా
// వెన్నెలింత //

చరణం 2:

గాలైనా నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగిందే
నేలైనా నిను తడితే ఎదలో అసూయ పెరిగిందే
గాఢంగా, గర్వంగా జోడి మనమే కట్టంగా ఏడే జన్మలు సరిపోవంట
దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నోజన్మలు సృష్టించాలటా
// వెన్నెలింత //