పదిమందిలో పాటపాడినా..
చిత్రం : ఆనంద నిలయం (1971)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి:
పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే......
!!పది!!
చరణం 1:
గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..||2||
ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే....
చరణం 2:
ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.... వసంతమొక్కటే ||2||
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ||2||
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే......