Showing posts with label మైలవరపు గోపి. Show all posts
Showing posts with label మైలవరపు గోపి. Show all posts

ముందెళ్ళే దానా



ముందెళ్ళే దానా
ఏడడుగుల బంధం (1985)
సంగీతం: శంకర్-గణేష్
గానం: బాలు
రచన: మైలవరపు గోపి

పల్లవి:

ఏయ్... ముందెళ్ళే దానా
నీ ఎనకాలే రానా
నా ముందెళ్ళే దానా
నీ ఎనకాలే రానా
చిన్నదాన ఉన్నాదాన
చెంప స్వరాలున్నా దానా
ఉన్నది జాగరతే
పిల్లదానా 
నిన్నున్నట్లే దోచాలని నేనున్నా 
నువ్వెంత గడుసైనా 
నీ కల్లోకి రానా 
కాటుకెట్టలేనా 
నిను కాటెయ్యలేనా
ముందెళ్ళే దానా నీ ఎనకాలే రానా

ఓలమ్మి ఏమి చేతునే

 

శ్రీమతి కావాలి (1984)
సంగీతం: కృష్ణ-చక్ర 
గానం: బాలు, శైలజ  
రచన: గోపి 

పల్లవి:
 
ఓలమ్మి ఏమి చేతునే.... 
నాకు నీ మీద మనసు పోయెనే 

ఓరబ్బి ఏమి చేతురా.... 
సందె పొద్దయినా వాలలేదురా 

చిలక నవ్వుతో, కలువ కళ్ళతో 
రేపనీ మాపనీ గుబులురేపకే

కన్నపిల్లనీ కంట దాచుకో 
నచ్చితే గుండెలో దీపమెట్టుకో 

నవ్వుతో బ్రతికిస్తుందీ


ఎవరీ చక్కనివాడు
చిత్రం: ఖైదీ కాళిదాసు (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఓ.. హొ.. ఓఓఓ..
హొ.. ఓఓ.. హొ.. హా

ఎవరీ చక్కనివాడు..
ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కనిచుక్క..
సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతోందీ..
హా..హా.. 
కాదన్నా వెంటపడుతోందీ

ఒక నువ్వు, ఒక నేను అంతా బొమ్మలం


ఒక నువ్వు, ఒక నేను
సినిమా:- గృహప్రవేశం (1982)
సాహిత్యం:- మైలవరపు గోపి
సంగీతం:- సత్యం
గానం:- సుశీల

ఒక నువ్వు, ఒక నేను
అంతా బొమ్మలం
ఈ లోకంలో మనుషులుగా
మసిలే బొమ్మలం

ఏమి ఎరుగని వయసమ్మా
ఈ పసితనమే ఒక వరమమ్మా
నవ్వు, ఏడుపు ఏదైనా
మీ మోమున సొగసేనమ్మా
కన్నీరైనా కంటికే కాని, గుండెది కాదమ్మా

ఆటకు పాటకు పుట్టిల్లు
ఆ గడప దాటితే అది చెల్లు
భర్త పేరుతో మొగ బొమ్మ
తలరాతలు మార్చేనమ్మా
మన కలలన్ని ఒకటేనమ్మా
కధలే వేరమ్మా

ఎవరికి వారే యమునా తీరే


ఎవరికి వారే
ఎవరికి వారే యమునా తీరే (1974)
సాహిత్యం:- మైలవరపు గోపి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

పల్లవి

ఎవరికి వారే యమునా తీరే
ఎక్కడో పుడతారు..ఎక్కడో పెరుగుతారు
ఎవ్వరికీ చెప్పకుండ పోతూనే ఉంటారు

చరణం1:

రాజ్యాలను ఏలినారు వేనవేల రాజులు
చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు
కట్టించిన కోటలన్ని మిగిలిపోయెను
కట్టుకున్న మహరాజులు తరలిపోయెను తరలిపోయెను

చరణం2:

ఊపిరి చొరబడితే పుట్టాడంటారు
ఊపిరి నిలబడితే పొయాడంటారు
గాలివాటు బ్రతుకులు..వఠ్ఠి నీటి బుడగలు
నిజమింతే తెలుసుకో...నిజమింతే తెలుసుకో

కలత మరచి నిదురపో...కలత మరచి నిదురపో

కోటికి ఒకరే పుడతారు

ప్రఖ్యాత హాస్యనటుడు
రాజబాబు
20-10-1935    14-2-1983

తెలుగు చలనచిత్ర రంగంలో
రెండు దశాబ్దాలు
ప్రముఖ హాస్యనటునిగా వెలిగిన రాజబాబు
'శతాబ్దపు హాస్య నటుడి'గా
ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి.

ఈయన అక్టోబరు 20, 1935 తేదీన
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో
పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు,
శ్రీమతి రవణమ్మ దంపతులకు జన్మించారు.

రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.  నిడదవోలు లోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశారు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో పాలుపంచుకొనే వారు.

ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన
గరికపాటి రాజారావు (పుట్టిల్లు సినిమా దర్శకుడు) సినిమాలలో చేరమని ఉత్సాహపరిచారు.
దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నారు. పూట గడవడానికి హాస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడు. కొన్నాళ్ళ తరువాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి 'సమాజం' సినిమాలో అవకాశం కల్పించారు. మొదటి సినిమా తరువాత 'తండ్రులు-కొడుకులు','కులగోత్రాలు'  'స్వర్ణగౌరి' 'మంచి మనిషి' మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి.
స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించారు.
మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన
చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే 'కుక్కపిల్ల దొరికిందా', 'నాలుగిళ్ళ చావిడి', 'అల్లూరి సీతారామరాజు' మొదలగు నాటకాలు వేశారు.

జగపతి ఫిలింస్ వి.బి.రాజేంద్రప్రసాద్ చిత్రం'అంతస్తులు' చ్రిత్రంలో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా పెద్దమొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందారు. తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో ప్రముఖ చిత్రాలలో నటించారు.

ఆ సమయంలో ఆకాశరామన్న,
సతీ శబరి, ప్రచండ భైరవి, సత్యహరిశ్చంద్ర,
సంగీత లక్ష్మి, పరమానందయ్య శిష్యుల కథ,
ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం లాంటి చిత్రాలలో నటించారు. రాజబాబుకు జంటగా
లీలా రాణి, మీనా కుమారి, ప్రసన్న రాణి,
గీతాంజలి లాంటి వారు నటించినా,
ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం
రమాప్రభ అని చెప్పాలి.

ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్,
ఇల్లు- ఇల్లాలు, పల్లెటూరి బావ,
సెక్రెటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం,
అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు
రాజబాబు-రమాప్రభ జోడీకి
మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి.

రాజబాబు  తాతా మనవడు, పిచ్చోడి పెళ్ళి,
తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే,
మనిషి రోడ్డున పడ్డాడు లాంటి
సినిమాలలో హీరోగా నటించారు.
ఈ సినిమాలలో ఎవరికి వారే యమునా తీరే,
మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా
బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్ అన్న
నిర్మాణ సంస్థ  పేరుతో నిర్మించారు.

సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు
నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవారు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని మరియు నటీమణుల్ని
సత్కరించే వారు.

ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్ఫూర్తినిచ్చిన  బాలకృష్ణను సత్కరించాడు.

రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా౹౹శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి,
రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు.

ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో
విరాళాలిచ్చిన దాత రాజబాబు.
రాజమండ్రిలో చెత్తా చెదారం
శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో
దానవాయిపేటలో భూమి ఇచ్చారు.
అంతే కాక కోరుకొండలో జూనియర్ కాలేజీ
కట్టించారు. దాని పేరుకూడా ఆయన పేరు మీదే 'రాజబాబు జూనియర్ కళాశాల'గా ఉంది.

వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు.
ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు,
మరియు ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందారు. 'చెన్నై ఆంధ్రా క్లబ్బు'వారు వరుసగా ఐదు సంవత్సరాలు 'రోలింగ్ షీల్డు'ని ప్రదానం చేసారు.
అంతే కాక 'శతాబ్దపు హాస్య నటుడిగా' అవార్డు పొందాడు.

అనుకరించడానికి అసాధ్యమైన
ప్రత్యేకమైన శైలి రాజబాబుది.

రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. మహా శివరాత్రి రోజు మరియు ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 రోజున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి
గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని థెరెసా ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రి లోనే
ఫిబ్రవరి 14, 1983 రోజున తెలుగు
సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తుడయినారు.

కోటికి ఒకరే పుడతారు
చిత్రం : మనిషి రోడ్డున పడ్డాడు (1974)
సంగీతం :  శంకర్‌-గణేష్
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు

పల్లవి:

కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు (#పుణ్యమూర్తుల అప్పలరాజు?#)
వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు
పుణ్యమూర్తులూ.. సూర్యచంద్రులూ
పుణ్యమూర్తులూ.. సూర్యచంద్రులూ

కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు
వారికొరకే వస్తారు సూర్యచంద్రులు

చరణం 1:

నా స్వార్ధం నాదే నని తలపోసేవాడూ..
నలుగురికి భారమై కాటికి పోతాడు
నా దేశం నా మనిషి అని పోరాడేవాడు..
పోయినా లోకాన మిగిలిపోతాడు
లోకాన మిగిలిపోతాడు.....

కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు
వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు

చరణం 2 :

అల్లా..ఓ అగ్బర్..అల్లా..ఓ అగ్బర్..అల్లా..
కులమత భేధాలెందుకు మనిషిలో..
కనిపించవు చివరకు ఏ పశువులో
బ్రతుకులోని తీయదనం మమతలో..
మనిషిలోని గొప్పదనం నడతలో

చరణం 3 :

తలరాతలు నమ్ముకునే దైన్యం పోవాలి...
తన చేతలపై మనిషికి ధైర్యం రావాలి...
చీకటినే నిందించే నైజం విడవాలి..
పదుగురికీ దీపమై తానే వెలగాలి..
దీపమై తానే వెలగాలి...

నీకైనా నాకైనా



నీకైనా నాకైనా
చిత్రం: కలలు కనే కళ్ళు (1984)
సంగీతం: శ్యామ్
రచన:మైలవరపు గోపి
గానం:కె.జే. ఏసుదాస్

నీకైనా నాకైనా
నీకైనా నాకైనా
మనసొకటే
మన కలలొకటే
మనసొకటే
మన కలలొకటే
మారేవి తలరాతలే
జ్యోతీ....
నీకైనా.... నాకైనా....

కాని సరే కానీ


కాని సరే కానీ
చిత్రం: ఈనాడు  (1982)
సంగీతం: జె. వి.రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: మాధవపెద్ది రమేశ్, సుశీల

పల్లవి:

కాని సరే కానీ నీ ఆటలన్ని  సాగని
సందెపొద్దు సల్లంగా జారనీ
కాని సరే కానీ నీ ఆటలన్ని  సాగని
సందెపొద్దు సల్లంగా జారనీ
చీకటేల పాకలోన ఒంటరిగా దొరకవా
అప్పుడేడ పోతావో చూడనా
కాని సరే కానీ నీ ఆటలన్ని  సాగని
సందెపొద్దు సల్లంగా జారనీ
అయినోళ్లు కానోళ్ళో ఎవరో ఒకరుండరా
అప్పుడేమి చేస్తావో చూడనా
కాని సరే కానీ నీ ఆటలన్ని  సాగని
సందెపొద్దు సల్లంగా జారనీ

చరణం: 1

పిడకల పేరుతో తడికెల చాటుగా
తొంగి తొంగి చూస్తివే అది నేనెరగనా
ఎవరిని చూస్తివో ఎవరనుకుంటివో
కంటికి మసకేస్తే కాపడమేసుకో

పిడకల పేరుతో తడికెల చాటుగా
తొంగి తొంగి చూస్తివే అది నేనెరగనా
ఎవరిని చూస్తివో ఎవరనుకుంటివో
కంటికి మసకేస్తే కాపడమేసుకో

చీకటేల పాకలోన ఒంటరిగా దొరకవా
అప్పుడేడ పోతావో చూడనా
కాని సరే కానీ నీ ఆటలన్ని  సాగని
సందెపొద్దు సల్లంగా జారనీ

కాని సరే కానీ నీ ఆటలన్ని  సాగని
సందెపొద్దు సల్లంగా జారనీ
అయినోళ్లు కానోళ్ళో ఎవరో ఒకరుండరా
అప్పుడేమి చేస్తావో చూడనా

కాని సరే కానీ నీ ఆటలన్ని  సాగని
సందెపొద్దు సల్లంగా జారనీ

చరణం: 2

సల్లకు వస్తివి ముంతను దాస్తివి
ఉరిమి చూడగా పరుగే తీస్తివి
మనసిచ్చానని అలుసై పోతినా
ముకుతాడెయ్యానా నీ పని పట్టనా

సల్లకు వస్తివి ముంతను దాస్తివి
ఉరిమి చూడగా పరుగే తీస్తివి
మనసిచ్చానని అలుసై పోతినా
ముకుతాడెయ్యానా నీ పని పట్టనా

అయినోళ్లు కానోళ్ళో ఎవరో ఒకరుండరా
అప్పుడేమి చేస్తావో చూడనా

కాని సరే కానీ నీ ఆటలన్ని  సాగని
సందెపొద్దు సల్లంగా జారనీ
కాని సరే కానీ నీ ఆటలన్ని  సాగని
సందెపొద్దు సల్లంగా జారనీ

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట



మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట
చిత్రం :  మట్టిలో మాణిక్యం (1971)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం :  సుశీల

పల్లవి:

ఆ...ఆ..ఆ..ఆ
అహా...ఆ...ఆ..ఆ..

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...
నీ బ్రతుకంత కావాలి పూలబాట..
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...
నీ బ్రతుకంత కావాలి పూలబాట..
పచ్చగ నూరేళ్ళు వుండాలని ...
నా నెచ్చలి కలలన్ని పండాలనీ...
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...
నీ బ్రతుకంత కావాలి పూలబాట..

చరణం 1:

హృదయమనేదీ ఆలయమూ....
స్నేహము దేవుని ప్రతిరూపమూ..ఊ..
హృదయమనేదీ ఆలయమూ..
స్నేహము దేవుని ప్రతిరూపమూ..
కులమేదైనా.. మతమేదైనా...
కులమేదైనా.. మతమేదైనా..
దానికి లేదు ఆ భేదమూ...

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట....
నీ బ్రతుకంత కావాలి పూలబాట..

చరణం 2:

ఆశలు ఉంటాయి అందరికీ..
అవి నెరవేరేది కొందరికే..
ఆశలు ఉంటాయి అందరికీ..
అవి నెరవేరేది కొందరికే..
ఆనందాల తేలే వేళ...
ఆనందాల తేలే వేళ...
అభినందనలు ఈ చెలికీ..

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...
నీ బ్రతుకంత కావాలి పూలబాట..
పచ్చగ నూరేళ్ళు వుండాలని...
నా నెచ్చలి కలలన్ని పండాలనీ
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట....
నీ బ్రతుకంత కావాలి పూలబాట..