Showing posts with label సచిన్ వారియర్. Show all posts
Showing posts with label సచిన్ వారియర్. Show all posts

పరవశమే పరవశమే...

పరవశమే పరవశమే...
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (2016)
సంగీతం: గోపీ సుందర్
గానం: సచిన్ వారియర్, దివ్యా మీనన్

పరవశమే పరవశమే... ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే... ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

ఆహా అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలంబరం
మనసే పసి పావురం
వలపే తన గోపురం
వెతికి కలిసెను నిన్నీ క్షణం
కధలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

నింగి... నీలం
ఆకు... పచ్చ
నువ్వు... నేను జంట విడిపోము
పలుకు ...రాగం
మెరుపు... మేఘం
దేహం... ప్రాణం మనమై కలిసాము
జతగా ప్రతి జన్మకి నువ్వే చెలి జానకి
నీలో... సగమే జీవించనీ
ఎదలో సహవాసమై
వ్యధలో వనవాసమై
నీతో నీడై పయనించనీ

ఆహా అంటోంది నా సంబరం
ఒడిలో వాలింది నీలాంబరం
మనసే పసి పావురం
వలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీ క్షణం
కధలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే పరవశమే... ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే... ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే