పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
చిత్రం : తూర్పు సిందూరం(1990)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు
పల్లవి
పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే ॥
అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్॥
చరణం : 1
చిరుగాలి పరదాలే గలగలలాడి
చెవిలోన లోలాకూ జతగా పాడి ॥
బంగరు దేహం సోలుతుంది పాపం
చ ల్లనీపూటా కోరుకుంది రాగం
నీవే అన్నావే నే పాడాలంటూ
ఊగీ తూగాలి నా పాటే వింటూ హొయ్॥
చరణం : 2
ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే
రేరాణి తాపంలో వెల్లువై పొంగే ॥
చింతలన్ని తీర్చే మంచు పువ్వు నీవే
మెత్తగా లాలీ నే పాడుతాలే
విరిసే హరివిల్లే ఊరించే వేళా
మనసే మరిపించీ కరిగించే వేళా హొయ్॥