ఎందుకో నీవు నాతో
చిత్రం: కృష్ణవేణి (1974)
సంగీతం: విజయ భాస్కర్
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల
పల్లవి:
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి...
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి...
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి..
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి...చరణం 1:
మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై
మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై...
వలపులన్ని పూలమాలై కురులోన కులుకె నీకై ...
ఎన్ని జన్మాలకైనా.. అహ.. అహ..నీవు నాదానివేలే
ఇందుకు సాక్షులు... గిరులు తరులు... గిరులు... తరులు
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి...
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి ...
చరణం 2:
నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోనా ...
నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోనా...
ఎల్లవేళల జీవితాన నిన్ను దేవిగా కొలుచుకోనా...
గౌరిశంకరులకందం... మనది విడిపోని బంధం
ఇందుకు సాక్షులు...
సూర్యుడు ..చంద్రుడు...సూర్యుడు ...చంద్రుడు..
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి ...
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి ...
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి...