నిన్ను చూడగానే అన్ని మరిచాను
నాయకుడు-వినాయకుడు (1980)
ఆత్రేయ
టి.చలపతిరావు
బాలు, విజయలక్ష్మీశర్మ
నిన్ను చూడగానే అన్ని మరిచాను
నిన్ను చూడగానే అన్ని మరిచాను
తుమ్మెద ఝుమ్మంటే విని...
నువ్వేననుకుని నన్నే మరిచాను
నిన్ను చూడగానే అన్ని మరిచాను
కోయిల కో అంటే విని....
నువ్వేననుకుని నిన్నే పిలిచాను
నిన్ను చూడగానే
ఎదురుగా నీవుంటే
నిదుర రానేరాదు
నీవు రావనుకుంటే
లోకమంతా చేదు
జలజల పొంగే వలపే
ఒక కలగా తలచేను
నిన్ను చూడగానే అన్ని మరిచాను
కోయిల కో అంటే విని....
నువ్వేననుకుని నిన్నే పిలిచాను
నిన్ను చూడగానే
నీ కనుల కాంతులతో
ప్రతిపొద్దు మెరిసేను
నీ కురుల నీడలలో
ప్రతిరేయి మురిసేను
కోవెలకోరని దేవుడ నీవని
నిన్నే కొలిచేను
నిన్ను చూడగానే అన్ని మరిచాను
తుమ్మెద ఝుమ్మంటే విని...
నువ్వేననుకుని నన్నే మరిచాను
నింగిలో నీలాలు నిలిచి ఉండేదాక
కడలిపై కెరటాలు
కదలి ఆడేదాక
మనసులు శృతిగా
తనువులు జతగా ఇలాగే ఉందాము
నిన్ను చూడగానే అన్ని మరిచాను
కోయిల కో అంటే విని....
నువ్వేననుకుని నిన్నే పిలిచాను
నిన్ను చూడగానే