నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానందీ వేళా
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
చరణం 1:
సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమై పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నైలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
చరణం 2:
ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరఫున గీత చెరపనా
ఎంత దూరాన నీవున్నా నితోనే నే లేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా
అదరగొట్టు కొట్టు కొట్టు
చిత్రం : కృష్ణ (2008)
సంగీతం : చక్రి
సాహిత్యం : చంద్రబోస్
గానం : శివాణి, వాసు
అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విరగ గొట్టు విరహన్నే
మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విరగ గొట్టు విరహన్నే
నా చెంపలు నిమిరెయ్యవా చెవి రింగువై
నా గుండెలుతడిమెయ్యవా ఓ గొలుసువై
నా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వై
నీ చీకటి కరిగించనా కొవొత్తినై
నీ భయమును తొలిగించనా తాయతునై
నీ గదిలో వ్యాపించనా అగరత్తి నేనై
వేలే పట్టెయ్ ఉంగరమయ్యి
నాతో తిరిగెయే బొంగరమయ్యి
ఒళ్ళే మోసెయ్ పల్లకివై
నన్నే దాచెయ్ బంగరమయ్యి
ఊకొడుతూ చేరనా ఊడిగమే చెయ్యనా
ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విరగ గొట్టు విరహన్నే
నా వెనకే వచ్చెయ్యవా అపరంజివై
నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై
నా నోటికి రుచులియ్యవానారింజ నీవై
నీవాకిట కురిసెయ్యనా చిరుజల్లునై
ఈ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై
నీ ఆశలు తగ్గించనా తలదిళ్ళునేనై
ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపంగివై
సంగీతానికి సారంగివై రావే రావే అర్ధాంగివై
ఉత్సాహం నింపగా ఉల్లాసం పెంచనా
ఉమ్మా అందించనా ఉంగా తినిపించనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా