ఓ కోయిలా....
వెన్నెల్లో ఆడపిల్ల (1987)
సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
గీత రచన: సిరివెన్నెల
గానం: బాలు
ఓ కోయిలా
నీ గొంతులో
ఓ కోయిలా
నీ గొంతులో
హిమజ్వాలలే ఆరనీ
సుమరాగమే చేరనీ
హిమజ్వాలలే ఆరనీ
సుమరాగమే చేరనీఈ మంచు వీణా ...
మ్రోగించకమ్మా.
ఈ మోడు దేశం
ప్రేమించదమ్మా ...
నీ రాక కోసం
మారాలు తీసి
ఓ పూలమాసం
వేచేను రామ్మా
అనురాగమే...
అనురాగమే
నీ ఎద నిండనీవే
వాసంతగీతం
పలికించనీవే
సుధలూరగా...
తీయగా....పాడరా..వే.
హిమజ్వాలలే ఆరనీ
సుమరాగమే చేరనీ
కదలాడు బొమ్మా
మదిలేని నీవు
సుకుమారమైనా
ఒక రాతి పువ్వూ
నా ఆర్తి తోనే
నీ మూర్తిలోనా
ఓ ప్రేమజ్యోతీ
వెలిగించనీవే
ఓ చిత్రమా....
ఓ చిత్రమా
నీ సౌందర్యమంతా
కారడవి సీమా
పాలించనేలా
నా కళ్ళలో కాంతివై
చేరరా...వే.
హిమజ్వాలలే ఆరనీ
సుమరాగమే చేరనీ
ఓ కోయిలా
నీ గొంతులో
హిమజ్వాలలే ఆరనీ
సుమరాగమే చేరనీ