January 5, 2020

నీకు నాకు మధ్య ఏదో ఉందే...


నీకు నాకు మధ్య
చిత్రం: దళపతి (2017)
సంగీతం: వినోద్ యాజమాన్య
రచన: భాస్కరభట్ల
గానం: శ్రేయాఘోషాల్, వినోద్ యాజమాన్య

నీకు నాకు మధ్య ఏదో ఉందే
ఏదో ఉందే...
కళ్ళతోనె నిన్ను చెప్పేయ్ మందే 
చెప్పేయ్ మందే... 
పెదవులే నీ పేరే పలికెనే మంత్రంలా.
ఎద లయే నీకోసం పరుగాపదేలా...?
అడిగా అడిగా ఒక మనసుతొ️ కలవమనీ...
త్వరగా త్వరగా నా దగ్గర చేరమనీ... 
జతగా జతగా అడుగులనే వేయమనీ...
శృతిగా జతిగ కడదాకా సాగమనీ...
నీకు నాకు మధ్య ఏదో ఉందే
ఏదో ఉందే...
కళ్ళతోనె నిన్ను చెప్పేయ్ మందే 
చెప్పేయ్ మందే...చరణం 1:

ప్రాణమే ఎదురుపడి అడిగితే...
మౌనమే విడిచివెళ్ళిపోయెనే....ఏమో...
కనులే నావీ... కలలే నీవీ...
మరుపేరాని నా ఊహలలో చేరిపోవా...ఇలా...
నీకు నాకు మధ్య ఏదో ఉందే
ఏదో ఉందే...
కళ్ళతోనె నిన్ను చెప్పేయ్ మందే 
చెప్పేయ్ మందే...

చరణం 2:

ఆ...
కాలమే ఆగి మరి చూసెనే...
మేఘమే వలపు కురిపించెనే...తెలుసా...!
ఏదో మాయే జరిగేనేమో...
నీ తోడుంటే... ఈ క్షణములనే మరువనులే. ప్రియా...! ️
నీకు నాకు మధ్య ఏదో ఉందే
ఏదో ఉందే...
కళ్ళతోనె నిన్ను చెప్పేయ్ మందే 
చెప్పేయ్ మందే...