Showing posts with label శ్రీమణి. Show all posts
Showing posts with label శ్రీమణి. Show all posts

మైండ్ బ్లాకు


మైండ్ బ్లాకు
సరిలేరు నీకెవ్వరు (2020)
దేవిశ్రీప్రసాద్
శ్రీమణి, దేవిశ్రీప్రసాద్
బ్లాజీ, రనీనా రెడ్డి, మహేష్ బాబు 

ఎపుడూ ప్యాంటేసే వాడు
ఇపుడూ లుంగీ కట్టాడు
ఎపుడూ షర్టేసే వాడు
ఇపుడూ జుబ్బా తొడిగాడు
చేతికేమో మల్లెపూలు, కంటికేమో కళ్లజోడు
చుట్టేసి పెట్టేసి వచ్చేశాడూ...

హీ ఈజ్ సో క్యూట్


హీ ఈజ్ సో క్యూట్
సరిలేరు నీకెవ్వరు (2020)
రచన: శ్రీమణి
గానం: మధుప్రియ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

అబ్బబ్బబ్బబ్బ... అబ్బాయెంత ముద్దుగున్నాడే...
ముద్దుగున్నాడే....ముద్దుగున్నాడే
ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే...
ఎత్తుగున్నాడే....ఎత్తుగున్నాడే
అల్లాఉద్దీన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా...
అల్లాడించాడె ఓరకంటా...

గోల్డు రంగు పిల్ల


గోల్డు రంగు పిల్ల
శైలజారెడ్డి అల్లుడు (2019)
సంగీతం: గోపీ సుందర్
రచన: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, బెహరా,
మోహన భోగరాజు, హరిప్రియ

పోరి పోరి సత్యభామ
దుమ్ము దులిపి వెళ్ళెనంట 
విచ్చుకున్న మాట వచ్చి గుచ్చెనంటా...
కిట్టమూర్తికింక మొదలు
కొంటె తంటా....

గోల్డు రంగు పిల్ల...
గుండె దోచుకుంది ఇల్లా....
సౌండే చెయ్యకుండా
ఆడుగుపెట్టి వచ్చెనిలా...

నిన్నిలా నిన్నిలా చూశానే..


నిన్నిలా నిన్నిలా చూశానే.. 
చిత్రం :‌ తొలిప్రేమ (2018)
‌సం‌గీతం :‌ ఎస్.ఎస్.థమన్
సాహిత్యం :‌ శ్రీమణి
‌గానం :‌ అర్మాన్ మాలిక్, ఎస్.ఎస్.థమన్

నిన్నిలా నిన్నిలా చూశానే..
క‌ళ్ళ‌ల్లో క‌ళ్ళ‌ల్లో దాచానే..
రెప్ప‌లే వేయ‌నంతగా క‌నుల‌పండ‌గే..

నాలో చిలిపి కల


నాలో చిలిపి కల
చిత్రం : లవర్ (2018)
సంగీతం : సాయి కార్తీక్
సాహిత్యం : శ్రీమణి
గానం : యాజిన్ నిజార్

నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా
నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా

గుండెలో ఈ ఊహలేమిటో
చూపలేని దాచలేని అల్లరిలా
తియ్యని ఈ వేదనేమిటో
మాటలే మోయలేని మౌనంలా

తందానే తందానే

తందానే తందానే
చిత్రం : వినయ విధేయ రామ (2019)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : ఎంఎల్‌ఆర్ కార్తికేయన్

తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే

తందానే తందానే
తందానే తందానే
కన్నారా ఎవరైనా
ప్రతిరోజూ పండగనే

ఏ తియ్యదనం
మనసుపడి రాసిందో
ఎంతో అందంగా
ఈ తలరాతలనే
ఏ చిరునవ్వు
ఋణపడుతూ గీసిందో
తనకే రూపంగా
ఈ బొమ్మలనే

తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే

తందానే తందానే
తందానే తందానే
కన్నారా ఎవరైనా
ప్రతిరోజూ పండగనే

ఒక చేతిలోని గీతలే
ఒక తీరుగా కలిసుండవే
ఒక వేలి ముద్రలో పోలికే
మరొక వేలిలో కనిపించదే

ఎక్కడ పుట్టినవాళ్లో
ఏ దిక్కున మొదలైనోళ్లో
ఒక గుండెకు చప్పుడు
అయ్యారుగా
ఏ నింగిన గాలిపటాలో
ఏ తోటన విరిసిన పూలో
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా

తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే

తందానే తందానే
తందానే తందానే
కన్నారా ఎవరైనా
ప్రతిరోజూ పండగనే

ఈ ఇంటిలోన ఇరుకుండదే
ప్రతి మనసులోన చోటుందిలే
ఈ నడకకెపుడూ అలుపుండదే
గెలిపించు అడుగే తోడుందిలే
విడివిడిగా వీళ్లు పదాలే
ఒకటయ్యిన వాక్యమల్లే
ఒక తియ్యటి అర్థం చెప్పారుగా
విడివిడిగా వీళ్లు స్వరాలే
కలగలిపిన రాగమల్లే
ఒక కమ్మని పాటై నిలిచారుగా

తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే

తందానే తందానే
తందానే తందానే
బంధాల గ్రంథాలయమే
ఉంది ఈ ఇంట్లోనే

ఎంతో ఫన్

ఎంతో ఫన్
చిత్రం : ఎఫ్2 (2018)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవిశ్రీ ప్రసాద్

స్వర్గమే నేలపై వాలినట్టు
నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు
గుండెలోన పూలవాన కురిసినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్

నెమలికే పాటలే నేర్పినట్టు
కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు
కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్
కాళిదాసు కావ్యము
త్యాగరాయ గేయము
కలిపి మనసు పాడినట్టుగా
అందమైన ఊహలు
అంతులేని ఆశలు
వాకిలంత వొంపినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్

కళ్ళు కళ్ళూ కలుపుకుంటూ
కలలు కలలూ పంచుకుంటూ
కాలమంతా సాగిపోనీ
మోహమంతా కరిగిపోతూ
విరహమంతా విరిగిపోతూ
దూరమంతా చెరిగిపోనీ
రాతిరంటె కమ్మనైన
కౌగిలింత పిలుపనీ
తెల్లవార్లు మేలుకోవడం
ఉదయమంటె తియ్యనైన
ముద్దు మేలుకొలుపనీ
దొంగలాగ నిద్రపోవడం

ఎంతో ఫన్ ఎంతో ఫన్

రోజుకొక్క బొట్టుబిళ్ళే
లెక్కపెడుతూ చిలిపి అద్దం
కొంటె నవ్వే నవ్వుతోందే
బైటికెళ్ళే వేళ నువ్వే
పిలిచి ఇచ్చే వలపు ముద్దే
ఆయువేదో పెంచుతోందే
ఇంటికెళ్ళె వేళ అంటు
మల్లెపూల పరిమళం
మత్తుజల్లి గుర్తుచేయడం
ఇంటి బయిట చిన్నదాని
ఎదురుచూపు కళ్ళలో
కొత్త ఉత్సవాన్ని నింపడం

ఎంతో ఫన్ ఎంతో ఫన్

నాలో నీకు నీలో నాకు

నాలో నీకు నీలో నాకు
చిత్రం : మిస్టర్ మజ్ను (2019)
సంగీతం : థమన్ ఎస్.ఎస్.
సాహిత్యం : శ్రీమణి
గానం : కాలభైరవ, శ్రేయ ఘోషల్

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదలుకుంటున్నా
నీ కబురింక విననంటున్న హృదయానా
నువ్వే నిండి ఉన్నావంది నిజమేనా

నాకే సాధ్యమా నిన్నే మరవడం
నాదే నేరమా నిన్నే కలవడం
ప్రేమను కాదనే బదులే ఇవ్వడం
ఏదో ప్రశ్నలా నేనే మిగలడం

గాయం చేసి వెళుతున్నా
గాయం లాగ నేనున్నా
ప్రాయం ఇంత చేదై మిగిలెనా
గమ్యం చేరువై ఉన్నా
తీరం చేరలేకున్నా
దూరం ఎంత జాలే చూపినా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కాని ప్రేమే వదులుకుంటున్నా

ఓ నవ్వే కళ్లతో బ్రతికేస్తానుగా
నవ్వుల వెనుక నీరే
నువ్వని చూపక
తియ్యని ఊహల కనిపిస్తానుగా
ఊహల వెనుక భారం
ఉందని తెలుపక

నువ్వని ఎవరని
తెలియని గురుతుగా
పరిచయం జరగనే
లేదంటానుగా

నటనైపోదా బ్రతుకంతా
నలుపైపోదా వెలుగంతా
అలుపే లేని ఆటే చాలిక
మరిచే వీలు లేనంతా
పంచేసావె ప్రేమంతా
తెంచెయ్‌మంటే
సులువేం కాదుగా

మనసులే కలవడం
వరమా శాపమా
చివరికి విడవడం
ప్రేమా న్యాయమా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదలుకుంటున్నా

ఏ స్క్వేర్ బి స్క్వేర్



A Square B Square
చిత్రం : 100% లవ్ (2011)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : కలర్స్ స్వాతి

He Lets Go
A Square B Square A Plus B Whole Square
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్...
అట్టాక్ అట్టాక్  ఎలుక పిల్లి మీదకే...
అట్టాక్ అట్టాక్  పువ్వు ముల్లు మీదకే..
అట్టాక్ అట్టాక్  ఉప్పు నిప్పు మీదకే..
అట్టాక్ అట్టాక్
A Square B Square A Plus B Whole Square
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్...

హే రింగా రింగా రోజెస్  వంకర టింకర పోసెస్
తింగర తింగర తీరమ్స్ కి  పెట్టేయ్ సొల్యూషన్స్
హే పోటా పోటీ చీటింగ్  చీటికి మాటికి ఫైటింగ్
మీది మీది రాంకుల కోసం  కాంపిటీషన్స్
అట్టాక్ అట్టాక్  చేప కొంగ మీదకే..
అట్టాక్ అట్టాక్  జింక పులి మీదకే..
అట్టాక్ అట్టాక్  వోణీ జీన్స్ మీదకే..
అట్టాక్ అట్టాక్
A Square B Square A Plus B Whole Square
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్...

ఏ స్క్వేర్ బి స్క్వేర్
చిత్రం : 100% లవ్ (2011)
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీ శ్రీ ప్రసాద్

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏ టైమైనా డోంట్ కేర్
చీటింగ్ చీటింగ్ పిల్లి ఎలక పిల్లనీ
చీటింగ్ చీటింగ్ నక్క పిల్ల కాకినీ
చీటింగ్ చీటింగ్ మీసం జడకుచ్చునీ
చీటింగ్ చీటింగ్

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్

రింగ రింగ రోజెస్ పాకెట్ ఫుల్లాఫ్ పోజెస్
దొంగ దొంగా చదివేసేయ్ ఇంపార్టెంట్ బుక్స్
సబ్జెట్ సబ్జెక్టు కలిపేసి సిలబస్ చూజే చేసి
చూపుల స్ట్రానే వేసి చప్పున జుర్రేయ్ మార్క్స్

చీటింగ్ చీటింగ్ చీమ పంచదారనే
చీటింగ్ చీటింగ్ తేనెటీగ పువ్వునీ
చీటింగ్ చీటింగ్ ఉడతా జాంపండు నీ...
చీటింగ్ చీటింగ్...

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్

ఏక్ బార్ ఏక్ బార్


ఏక్ బార్ ఏక్ బార్
వినయవిధేయరామ (2019)
దేవిశ్రీప్రసాద్
శ్రీమణి
దేవిశ్రీ ప్రసాద్, రనీనా రెడ్డి

ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్లే ఫుల్లే
నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్లే చిల్లే
నీ కళ్ళలోనే ఉంది ముంతకల్లే కల్లే
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లే విల్లే

ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్లే ఫుల్లే
నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్లే చిల్లే
నీ కళ్ళలోనే ఉంది ముంతకల్లే కల్లే
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లే విల్లే

హే రావే నా అలీషా
చూపిస్తా తమాషా
ఉంటది నాలో నిషా... హమేషా

నాలోని కళాకార్ నీలోని అలంకార్
మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్
ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
దంచేయ్ రో డాన్స్ ఫ్లోర్

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
దంచేయ్ రో డాన్స్ ఫ్లోర్

ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్లే ఫుల్లే
నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్లే చిల్లే
నీ కళ్ళలోనే ఉంది ముంతకల్లే కల్లే
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లే విల్లే

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
దంచేయ్ రో డాన్స్ ఫ్లోర్

ఓ ఫ్లైట్ లాగ టేక్ ఆఫ్
ఐ రయ్యిమందిలే
నా నడక చూసి
నా బుల్లి హార్టు

హైటు మరచి కైటల్లే ఎగురుతుందిలే
నీ రాక తోటి నా హార్ట్ బీటు

ఓ మినీ ఓ మినీ నా సోకుల సౌదామిని
తినిపిస్తా బిరియాని
చూపిస్తా నా దునియాని
ఓ హనీ ఓ హనీ
ఇక నువ్వే నా కహాని
నా వయ్యరాల గని
నువ్వు ఏంచేస్తావో గానీ

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
దంచేయ్ రో డాన్స్ ఫ్లోర్

ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్లే ఫుల్లే
నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్లే చిల్లే
నీ కళ్ళలోనే ఉంది ముంతకల్లే కల్లే
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లే విల్లే

హే సున్నాకున్న విలువేంటో
తెలిసినాదిలే
నీ సన్న ఎంకి నడుము చూసినాక

హే రెంట్ లేని కరెంటంటే
తెలిసినాదిలే
నీ కొంటె చూపు షాక్ కొట్టి నాకా

రాణి ఓ రాణి
నన్ను నీతో పాటే రానీ
నీ సోలో సొగసులన్నీ
ఫ్లోలో ఎత్తుకు పోనీ

ఆజా రాజా జానీ
నీ జాను నేనై పోనీ
ఈ సూపర్ సౌండ్ కి బాణీ
అరేయ్ సూపర్ హిట్ అయిపోని

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
దంచేయ్ రో డాన్స్ ఫ్లోర్

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
దంచేయ్ రో డాన్స్ ఫ్లోర్

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ


ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ
చిత్రం : చిత్రలహరి (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : సుదర్శన్ అశోక్

రంగు రంగు పువ్వులున్న
అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
ఏడు రంగులొక్కటై
పరవశించు వేళలో
నేలకే జారిన కొత్త రంగులా

పాల పిట్టలో వలపు


పాల పిట్టలో వలపు
చిత్రం : మహర్షి (2019)
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : రాహుల్ సిప్లిగంజ్, మానసి

ఏవో గుస గుసలే
నాలో వలసే విడిసీ
వలపే  విరిసే  ఎదలో

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు పట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే
పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

కొండవలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దినా పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి
నా మానసిట్టా
నీవైపుకి మళ్ళిందే
పిల్లోడ గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే

విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటే బాణాలు
గడ్డి పరకపై అగ్గి పుల్లలా
భగ్గుమన్నవే నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటే మరి ముళ్ళు
నిప్పు పెట్టిన తేనె పట్టులా
నిద్ర పట్టదే రాత్రుళ్ళు
నీ నడుము చూస్తే మల్లె తీగ
మనసు దానినల్లే తూనీగ
మెల్ల మెల్లగా చల్లినావుగా
కొత్త కలలు బాగా

పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల పుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే

పిల్లోడా గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే

స్నేహితుడో


స్నేహితుడో
బాబు బంగారం (2016)
సంగీతం: జిబ్రాన్
గానం: రంజిత్
సాహిత్యం: శ్రీమణి

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో శ్రామికుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
నీ కోసం వచ్చేశాడూ
ఆకాశం తెచ్చేశాడూ
అడగకముందే అందించే సాయం ... ఇతడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

ఎగిరే ఎగిరే ఆకాశం
గువ్వై  రెమ్మనా వాలినదా
చిగురులు తొడిగే అవకాశం
మళ్ళీ తోటకు వచ్చినదా
నవ్వుల్ పువ్వుల్ దరహాసం
పెదవుల పడవై సాగినదా
రంగుల్ రవ్వల్ సంతోషం
మనసుని మబ్బుల విసిరినదా

మండుతున్న.. ఎండలోన
నీడ కాసే.. గొడుగు వీడు
చేదు నిండే గుండెలోనా
తీపి పుట్టే కబురు వీడు
ఏ చిన్ని గాయం నీ మీదున్నా
మోసే హృదయం ఇతడు
పసివాడి కన్నులతోనా లోకాన్నే చూస్తాడు
దండిచే వాడికి తానే
గుండెలోతు కూడా ప్రేమ పంచిస్తాడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

రాతలోన గీతలోన భాగ్యరేఖై పూసినాడు
అందమైన జాతకంలా సంబరాలే తెచ్చినాడు
నీ చిన్ని చిన్ని సరదాలన్నీ తీర్చే తొలి స్నేహితుడు
ఏ పరిచయం లేకున్నా ప్రాణం పంచిస్తాడు
సెలవంటూ వెళ్ళిపోతున్నా పండగల్లె చెవులు తిప్పి లాక్కొస్తాడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

ఎగిరే ఎగిరే ఆకాశం
గువ్వై  రెమ్మన వాలినదా
చిగురులు తొడిగే అవకాశం
మళ్ళీ తోటకు వచ్చినదా
నవ్వుల్ల్ పువ్వుల్ దరహాసం
పెదవులు పడవై సాగినదా
రంగుల్ రవ్వల్ సంతోషం
మనసుని మబ్బుల విసిరినదా

మెల్లగా తెల్లారిందోయ్

మెల్లగా తెల్లారిందోయ్
చిత్రం: శతమానం భవతి (2017)
గానం: అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు
సంగీతం: మిక్కీ జె.మేయర్‌
రచన: శ్రీమణి

మెల్లగా తెల్లారిందోయ్ అలా
వెలుతురే తెచ్చేసిందోయ్ ఇలా
బోసినవ్వులతో మెరిసే పసిపాపల్లా

చేదతో బావులలో గలా గలా
చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
చుట్ట పొగమంచుల్లో
చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించి
అందించు హృదయంలా

చలిమంటలు ఆరేలా
గుడిగంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా..ఆఆ..
గువ్వలు వచ్చే వేళ
నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కనవేలా..ఆఆ..

పొలమారే పొలమంతా
ఎన్నాళ్లో నువ్వు తలచీ
కళమారే ఊరంతా
ఎన్నేళ్లో నువ్వు విడచి

మొదట అందని దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహ తహ లాడిన
పసి తనమే గుర్తొస్తుందా...

ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయనా..

నువ్వూగిన ఉయ్యాలా..
ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడకా..ఆఆ..
నువ్వాడిన దొంగాట
బెంగల్లే మిగలాలా
తన్నెవరూ వెతికే వీల్లేకా..ఆఅ..

కన్నులకే తియ్యదనం
రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం
పలికించే సెలయెళ్లే

పూల చెట్టుకి ఉందో భాష
అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే
అందం మాటాడే భాష

పలకరింపే పులకరింపై
పిలుపునిస్తే పరవశించడమే
మనసుకి తెలిసిన భాష

మమతలు పంచే ఊరు
ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరూ..ఊఊ

ప్రేమలు పుట్టిన ఊరు
అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరూ..ఊఊ

తెలవారితే కనురెప్పల తొలి

తెలవారితే
చిత్రం : ప్రేమమ్ (2016)
సంగీతం : రాజేష్ మురుగన్
సాహిత్యం : శ్రీమణి
గానం : విజయ్ ఏసుదాస్

తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే
పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే
నీ పేరే పలకడమే పెదవులకలవాటే

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నామాటే

ఎవరే.. ఎవరే ప్రేమను మాయంది..
ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ..

ఎవరే నిన్నే నా వైపు నడిపే
నా ఊహల మధురోహల హరివిల్లు నింపే
తియ్య తియ్యని నిముషాలే నీలోన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే..
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వె విలువైన వరమంటూ
నా ప్రాణమే నీకు చెబుతోంది ఇపుడూ
నువు లేక నే లేననీ ..

గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం నువు దూరమైనా
నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే..

ఎవరే..

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నామాటే
ఎవరే.. ఎవరే ప్రేమను మాయంది..

ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ..
ఓఓ...ఓఓఓ...ఓఓఓ...ఓఓ...

తెలుసా తెలుసా ప్రేమించానని...


తెలుసా తెలుసా ప్రేమించానని...
చిత్రం : సరైనోడు (2016)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీమణి
గానం : జుబియల్, సమీర

సజనా.
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ
రాశా రాశా నీకే ప్రేమనీ
రాశా రాశా నువ్వే నేననీ

ధమ్ ధమ్ ధమ్ దదమ్ ధమ్
ఆనందం ఆనందం
నీలా చేరింది నన్ను... వందేళ్ల అనుబంధం

నా ఊపిరే నిలిపావురా
నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా
మనస్సునే పిలిచావురా
నా లోకమై పోయావురా
వెయేళ్ళు నాతో ఉండరా

తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ
రాశా రాశా నీకే ప్రేమనీ
రాశా రాశా నువ్వే నేననీ

ఏదేదో ఏదో.. ఏదో ఇది
ఏనాడు నాలో లేనిది
నీపైనే ప్రేమయిందే చెలీ

నా ఊపిరే నిలిపేవురా
నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా
మనస్సునే పిలిచావురా
నా లోకమై పోయావురా
వెయేళ్ళు నాతో ఉండరా

ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా
ఇకపైన నువ్వా లోటే తీర్చాలిరా
ఇన్నేళ్ళు  కన్నీళ్ళెందుకు రాలేదనీ
నువు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా

నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా
చిన్ని గుండెల్లో దాచి పెట్టుకుంటా
లెక్కలేనంతా ప్రేమ తెచ్చి నీ పైనా గుమ్మరించీ
ప్రేమించనా కొత్తగా

మనస్సునే పిలిచావురా
నా లోకమై పోయావురా
వెయ్యేళ్ళు నాతో ఉండరా

తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ
రాశా రాశా నీకే ప్రేమనీ
రాశా రాశా నువ్వే ప్రేమనీ