July 29, 2023

ఓంకారం సకలకళా శ్రీకారం

ఓంకారం సకలకళా శ్రీకారం
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : వేదవ్యాస
గానం : శంకర మహదేవన్

ఓంకారం సకలకళా శ్రీకారం
చతుర్వేద సాకారం
చైతన్య సుధాపూరం
జ్ఞాన కమల కాసారం

ధ్యాన పరిమళాసారం
మధురభక్తి సింధూరం
మహాభక్త మందారం
భవ భేరీ భాండారం

హృదయ శంఖ హుంకారం
ధర్మ ధనుష్టంకారం
జగత్ విజయ ఝంకారం
అద్వైత ప్రాకారం 
భజేహం

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ శ్రీవత్స
సాహిత్యం: వేదవ్యాస
గానం: కార్తీక్ 

పల్లవి:

ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ. 

ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ...

ఛాంగుభళా చమకు చమకు 
తళుకు బెళుకు సృష్టికళా
హృదయమిలా ఊగే హొయలు చిలుకు 
లయల కులుకు సోయగాల ఊయల 

భజ గోవిందం

భజగోవిందం అనే పాట ఊసుపోక ఏదో భగవంతుడిని గురించి మాత్రమే చెప్పుకునే మూఢ భక్తి  గీతం కాదు. దానిలో ఉన్న అర్ధాన్ని, పరమార్ధాన్నీ ఒక్కసారి గమనించండి. పాట దాని తాత్పర్యం ఈ క్రింద వివరింపబడినది. 

భజ గోవిందం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ శ్రీవత్స
సాహిత్యం: ఆది శంకరాచార్యుడు
గానం: మధు బాలకృష్ణన్ 
 
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే 

భావం: భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని... ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి) వ్యాకరణ  సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు.

శ్రీ కృష్ణః

శ్రీ కృష్ణః
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ శ్రీవత్స
సాహిత్యం: శ్రీ వేదవ్యాస్
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మణి నాగరాజ్ 
 
కృష్ణా...ఆ
కృష్ణా...
శ్రీకృష్ణః శరణం మమ 
శ్రీకృష్ణః తరణం మమ

శ్రీకృష్ణః శరణం మమ 
శ్రీకృష్ణః తరణం మమ

శ్రీకృష్ణః 
కృష్ణః

ఎవడు నేను

ఎవడు నేను
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ శ్రీవత్స
సాహిత్యం: జె.కె.భారవి
గానం: బాలు 
 
ఎవడు నేను
ఎవడు నువ్వు 

ఎవడు నేను
ఎవడు నువ్వు

ఎవడు నేను
ఎవడు నువ్వు

ఎవడు దేవుడు 
ఎవడు జీవుడు

గురువు ఎవ్వడు
శిష్యుడెవ్వడు

కర్త ఎవ్వడు 
భర్త ఎవ్వడు  

తెలిసినోడెవడూ
తెలుపువాడెవడు  

లక్ష్మీ పద్మాలయ

లక్ష్మీ పద్మాలయ
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : ఆదిశంకరాచార్య
గానం : శరత్ సంతోషి


లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీ హరిప్రియా
ఇందిరా లోకమాతా మా రమా మంగళదేవతాః

నమోస్తు నాళీకనిభావనాయై
నమోస్తు దుగ్ధో దధిజన్మభూమ్యై
నమోస్తుసోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణో రురసిస్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై

లక్ష్మీ నృసింహా

లక్ష్మీ నృసింహా
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : ఆదిశంకరాచార్య
గానం : టిప్పు

లక్ష్మీ నృసింహా లక్ష్మీ నృసింహా 
లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబమ్
లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబమ్

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగీంద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీ నృసింహా లక్ష్మీ నృసింహా 
లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబమ్

సౌందర్యలహరి

సౌందర్యలహరి
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : ఆదిశంకరాచార్య
గానం: రంజిత్

సౌందర్యలహరీ...
తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ-
సౌందర్యలహరీ...
తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ-
సౌందర్యలహరీ...
పరీవాహః స్రోతఃసరణిరివ సీమంతసరణిః
వహంతీ సిందూరం ప్రబలకబరీభారతిమిర
ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణమ్
సౌందర్యలహరీ...
సౌందర్యలహరీ...
సౌందర్యలహరీ...
సౌందర్యలహరీ...

అఖిల చరాచర

అఖిల చరాచర
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
గానం: ఉన్ని కృష్ణన్ 
రచన: శ్రీ వేదవ్యాస్

కృష్ణా.... ద్వారకావాసా 
అఖిల చరాచర జగద్జాలముల అనాది అత్మల సాక్షిగా 
అంతట నీవే ఉండీ లేవను ఉజ్వల భావం ఊపిరిగా 
నింగీ నేలా నీరూ నిప్పూ గాలి కలయికల కాపరిగా 
నీ ఆటే ఆటగ పాటే పాటగ సృష్టి  స్థితి లయ,
విన్యాసలయల, ఆవల ఈవల అలరారే నీ లలితా
నృతరస లహరుల లీల, లీలాకృష్ణ చూపరా.     
అమ్మకు చూపరా....

సరిగమ పమ రిస సరిమ, 
మప నిద నిని స, 
నిసరిప మపగమ రిస నిస రిస నిస రిస నిస నిప 
మప గమ రిస నిని స

నిత్యానందకరీ

చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : ఆది శంకరాచార్య
గానం: బాలు 

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిల దోషపావనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(అన్నపూర్ణ అష్టకం)

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృమ్భతే
యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణి
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చేత్
చండాలోస్తు స తు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ...
(మనీషా పంచకం)

శంకర విజయం

శంకర విజయం 
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : శ్రీ వేదవ్యాస్

శంకర విజయం 
ఆదిశంకర విజయం
సత్య శంకర విజయం 
ధర్మ శంకర విజయం 

ఆస్తిక హిత భూషణం 
అసమ్మత మత భీషణం 
ఆసేతు సీతాచల సంచలనం 
శంకర విజయం 
శంకర విజయం 

శివోహం

 శివోహం (నిర్వాణ శటకం)
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
రచన: ఆది శంకరాచార్యుడు
గానం: హరిహరన్

మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం  
న చ శ్రోత్ర  జిహ్వే న ఘ్రాణనేత్రే 
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం 

భావము: నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తము కూడా కాదు. నేను పంచేంద్రియాలైన చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం కూడా కాదు. నేను  పంచభూతాలైన  భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం కూడా కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.

July 13, 2023

పూల పూల వాన

పూల పూల వాన
చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : కోన వెంకట్ 
గానం : సునీత ఉపద్రష్ట 

పల్లవి:

పూల పూల వాన  
వాన స్వరాలవాన.. వాన 

పూల పూల వాన  
వాన స్వరాల వాన వాన

ఊహూ... ఊహూ.. కురిసే 
కురిసే జగాలే విరిసే 

మేఘమా... కురియుమా 
మేఘమా....కరుగుమా 
కరుగుమా....

July 5, 2023

పెగ్గు మీద పెగ్గు కొట్టు

పెగ్గు మీద పెగ్గు కొట్టు 
చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : కోన వెంకట్ 
గానం : మనో, కోరస్ 

పల్లవి:

పెగ్గు మీద పెగ్గు కొట్టు  
సోడా యేసి దంచికొట్టు 

పరేషానులన్ని నువ్వు మూలపెట్టు 
పరేషానులన్ని నువ్వు మూలపెట్టు
సంక కింద అట్టిపెట్టు జామచెట్టు 
మామ కల్లుమామ 

ఒంటరైన గుండెలో

ఒంటరైన గుండెలో
చిత్రం: మౌనం (1995)
సంగీతం: కీరవాణి
రచన: సిరివెన్నెల 
గానం: బాలు, చిత్ర 

పల్లవి:

ఒంటరైన గుండెలో
తీగలేని వీణలు
మోగుతున్న మూగరాగమేమో

నిద్రలేని నిన్నని
మేలుకోని రేపుని
చూపుతున్న నేటి రాతిరేమో

సుదూర తీరాల జ్ఞాపకాలే
సమీపమౌతున్న జాడలా

ఉండుండి వీచేటి ఈ గాలిలో

నాతోనే ఉన్నావు

నాతోనే ఉన్నావు 
చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉన్ని కృష్ణన్, సుజాతా మోహన్ 

పల్లవి: 

నాతోనే ఉన్నావు 
నాతోడై ఉన్నావు 
ఐనా నీ నిరీక్షణ 

July 4, 2023

రగిలింది విప్లవాగ్ని ఈ రోజు

రగిలింది విప్లవాగ్ని ఈ రోజు
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

పల్లవి:

రగిలింది విప్లవాగ్ని ఈ రోజు
ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు

రగిలింది విప్లవాగ్ని ఈ రోజు
ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు

July 1, 2023

పిలిచే వయసు పలికే సొగసు

పిలిచే వయసు 
మండే సూర్యుడు (1992)
సంగీతం: దేవా 
గానం: బాలు, జానకి  
రచన: రాజశ్రీ

పల్లవి:

పిలిచే వయసు పలికే సొగసు 
తలఁచెను మదిలోనా 
మల్లెల తలపు, అల్లరి వలపు 
చిలికెను విరివానా
 
కలలై పొంగి ఎద ఉప్పొంగి 
ఆశలు ఉరికేనే 
నాలో లోలో సవ్వడి చేసి 
గాథలు తొణికేనే