Showing posts with label రంజిత్. Show all posts
Showing posts with label రంజిత్. Show all posts

సౌందర్యలహరి

సౌందర్యలహరి
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : ఆదిశంకరాచార్య
గానం: రంజిత్

సౌందర్యలహరీ...
తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ-
సౌందర్యలహరీ...
తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ-
సౌందర్యలహరీ...
పరీవాహః స్రోతఃసరణిరివ సీమంతసరణిః
వహంతీ సిందూరం ప్రబలకబరీభారతిమిర
ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణమ్
సౌందర్యలహరీ...
సౌందర్యలహరీ...
సౌందర్యలహరీ...
సౌందర్యలహరీ...

ఆమ్చి ముంబై అప్నా


ఆమ్చి ముంబై అప్నా
బిజినెస్ మేన్ (2012)
భాస్కరభట్ల
థమన్
రంజిత్, నవీన్ మాధవ్, రాహుల్, అలాప్ రాజు

ఆమ్చి ముంబై అప్నా అడ్డా డోల్
ఆగ్ హై హర్ రస్తే అబ్ డోల్
జాన్ పె కత్రా హై అబ్ డోల్ ముంబాయి హోయ్ సాలె
రాత్ బర్ యహా క దందా గోల్
కిస్కో హై పత్కా న అబ్ బోల్
హర్ గడి హత్ గడియొం మె బోల్
ముంబాయి ముంబాయి

నిను చూడని కనులెందుకు


నిను చూడని కనులెందుకు
మసాలా (2013)
థమన్
కృష్ణ చైతన్య
రంజిత్, శ్రేయా గోషాల్

నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరేం లేకున్నా 
నీకంటే సొంతం లేనే లేరన్న
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరేం లేకున్నా 
నీకంటే సొంతం లేనే లేరన్న

సిరిమల్లె వాన

సిరిమల్లె వాన
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్, చిత్ర

సిరిమల్లె వాన పడుతోంది లోన
కనిపించదే కంటికి
వడగళ్ళ వాన ఉరిమింది మీనా
వినిపించదే జంటకి
తడిసే తరుణాన గొడుగై నే లేనా... సిరిమల్లె...

సిరిమల్లె వాన పడుతోంది లోన... కనిపించదే కంటికి

వల అనుకోనా వలపనుకోనా... కలిపిన ఈ బంధం
వలదనుకున్నా వరమనుకున్న... తమరికి నే సొంతం
చినుకై వచ్చావే వరదై ముంచావే... సిరిమల్లె...
సిరిమల్లె వాన పడుతోంది లోన... కనిపించదే కంటికి

చిలిపిగా ఆడి చెలిమికి ఓడి... గెలిచా నీపైన
తగువుకి చేరి తలపుగ మారి... నిలిచా నీలోన
మనసే ఈ వింత మునుపే చూసిందా... ...సిరిమల్లె...
సిరిమల్లె వాన పడుతోంది లోన... కనిపించదే కంటికి
వడగళ్ళ వాన ఉరిమింది మీనా... వినిపించదే జంటకి

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
చిత్రం: కార్తికేయ (2014)
రచన: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: శేఖర్ చంద్ర
గానం: రంజిత్

పల్లవి:

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
బదులంటే ఎక్కడో ఏ చోటో లేదురా
శోధించే చూపులో ఓ నలుపై గెలుపై దాగుందంట

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా...
బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా...
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ

ప్రశ్నంటే.... ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా

చరణం-1:

పలు రంగులు దాగి లేవా పైక్కనిపించే తెలుపులోన
చిమ్మ చీకటి ముసుగులోను నీడలు ఎన్నో ఉండవా
అడగనిదే ఏ జవాబు, తనకై తానెదురుకాదు
అద్భుతమే దొరుకుతుంది అన్వేషించారా

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా...
బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా...
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ

ప్రశ్నంటే నింగినే ... నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం ... లేకుంటే ఎలా

చరణం-2:

ఎపుడో ఎన్నేళ్ళనాడో నాందిగా మొదలైన వేట
ఎదిగే ప్రతి మలుపుతోను మార్చలేదా మనిషి బాట
తెలియని తనమే పునాది... తెలిసిన క్షణమే ఉగాది
తెలివికి గిరిగీత ఏది... ప్రయత్నించరా

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా...
బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా...
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా

స్నేహితుడో


స్నేహితుడో
బాబు బంగారం (2016)
సంగీతం: జిబ్రాన్
గానం: రంజిత్
సాహిత్యం: శ్రీమణి

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో శ్రామికుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
నీ కోసం వచ్చేశాడూ
ఆకాశం తెచ్చేశాడూ
అడగకముందే అందించే సాయం ... ఇతడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

ఎగిరే ఎగిరే ఆకాశం
గువ్వై  రెమ్మనా వాలినదా
చిగురులు తొడిగే అవకాశం
మళ్ళీ తోటకు వచ్చినదా
నవ్వుల్ పువ్వుల్ దరహాసం
పెదవుల పడవై సాగినదా
రంగుల్ రవ్వల్ సంతోషం
మనసుని మబ్బుల విసిరినదా

మండుతున్న.. ఎండలోన
నీడ కాసే.. గొడుగు వీడు
చేదు నిండే గుండెలోనా
తీపి పుట్టే కబురు వీడు
ఏ చిన్ని గాయం నీ మీదున్నా
మోసే హృదయం ఇతడు
పసివాడి కన్నులతోనా లోకాన్నే చూస్తాడు
దండిచే వాడికి తానే
గుండెలోతు కూడా ప్రేమ పంచిస్తాడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

రాతలోన గీతలోన భాగ్యరేఖై పూసినాడు
అందమైన జాతకంలా సంబరాలే తెచ్చినాడు
నీ చిన్ని చిన్ని సరదాలన్నీ తీర్చే తొలి స్నేహితుడు
ఏ పరిచయం లేకున్నా ప్రాణం పంచిస్తాడు
సెలవంటూ వెళ్ళిపోతున్నా పండగల్లె చెవులు తిప్పి లాక్కొస్తాడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

ఎగిరే ఎగిరే ఆకాశం
గువ్వై  రెమ్మన వాలినదా
చిగురులు తొడిగే అవకాశం
మళ్ళీ తోటకు వచ్చినదా
నవ్వుల్ల్ పువ్వుల్ దరహాసం
పెదవులు పడవై సాగినదా
రంగుల్ రవ్వల్ సంతోషం
మనసుని మబ్బుల విసిరినదా