January 21, 2020

నువ్వు నాతో ఏమన్నావో


నువ్వు నాతో ఏమన్నావో
చిత్రం : డిస్కోరాజా (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

నువ్వు నాతో ఏమన్నావో ...
నేనేం విన్నానో...
బదులేదో ఏం చెప్పావో ...
ఏమనుకున్నానో...
భాషంటూ లేని భావాలేవో ..
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై ..
నీ మనసునే తాకనా
ఎటు సాగాలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటూ లేని భావాలేవో
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై
నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో
నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో
ఏమనుకున్నానో
భాషంటూ లేని భావాలేవో
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై
నీ మనసునేతాకనా

చరణం 1:

నీలాల నీ కనుపాపలో... ఏ మేఘసందేశమో
ఈనాడిలా సావాసమై... అందింది నా కోసమే
చిరునామా లేని లేఖంటి నా గానం
చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి
నచ్చిందో లేదో
ఓ చిన్న సందేహం
తీర్చేశావేమో ఈ నాటికి
మౌనరాగాలు పలికే సరాగాలతో
మందహాసాలు చిలికే పరాగాలతో
భాషంటూ లేని భావాలేవో
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై
నీ మనసునే తాకనా

నువ్వు నాతో ఏమన్నావో
నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో
ఏమనుకున్నానో

చరణం 2:

నీ కురులలో ఈ పరిమళం... నన్నల్లుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం... నను నేను మరిచేంతగా
రెక్కల్లా మారే దేహాల సాయంతో
దిక్కుల్ని దాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మోహాల భారంతో
స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం
మంచు తెరలన్ని కరిగించు ఆవిర్లతో
హాయిగా అలిసిపోతున్న "ఆహా"లతో
భాషంటూ లేని భావాలేవో
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై
నీ మనసునే తాకనా

నువ్వు నాతో ఏమన్నావో
నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో
ఏమనుకున్నానో